• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  ట్రంప్ కొంపముంచేశాడు.....

ట్రంప్ కొంపముంచేశాడు.. అధ్యక్ష రేసు నుంచి జేడీ వాన్స్ తప్పుకుంటారా?

| అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో పునరాలోచనలో పడినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమి, ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌తో విభేదాలు, మాగా కూటమిలో చీలికలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు రాన్ డిసాంటిస్, టెడ్ క్రూజ్ వంటి నేతలు అధ్యక్ష నామినేషన్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పోటీకి దిగడం కంటే సరైన సమయం కోసం వేచి చూడాలని వాన్స్ భావిస్తున్నట్లు సమాచారం.

By - A.N.Kumar
Update: 2026-11-14 07:19 GMT

మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ల ఘోర పరాజయం.. మాగా కూటమిలో విభేదాలు.. ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌తో అభిప్రాయ భేదాలు.. నాలుగోసారి తండ్రిగా మారిన నేపథ్యంలో కుటుంబ బాధ్యతలు.. ఇవన్నీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసేలా చేస్తున్నాయట.. అమెరికా రాజకీయ ఆకాశంలో మొన్నటిదాకా డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఏకైక వారసుడిగా కనిపించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇప్పుడు 2028 అధ్యక్ష రేసు విషయంలో అయోమయంలో పడ్డారని అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవైపు మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న పరాజయం.. మరోవైపు ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్‌తో ఏర్పడిన విభేదాలు ఆయన రాజకీయ ప్రయాణంపై ప్రభావం చూపుతున్నాయి.

నవంబర్ 3న జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలవ్వడం 2028 ఎన్నికల సమీకరణాలను మార్చేసింది. 2024లో ట్రంప్‌కు అండగా నిలిచిన యువత.. లాటినో ఓటర్లు.. పురుషులు, శ్వేతజాతీయ ఓటర్లలో అసంతృప్తి పెరిగినట్లు పోల్స్ సూచిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్స్ వేదికగా 617 పదాలతో సుదీర్ఘ పోస్ట్ పెట్టిన జేడీ వాన్స్ రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్ యుద్ధమే ప్రధాన కారణమని బహిరంగంగా పేర్కొన్నారు. దేశీయ సమస్యలు.. జీవన వ్యయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలు అధ్యక్షుడు ట్రంప్‌కు అసహనం కలిగించినట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్‌తో చర్చల బాధ్యతలు చూసిన వాన్స్‌ను ఆ వ్యవహారం నుంచి తప్పించి అవినీతి అంశాలపై దృష్టి పెట్టాలని ట్రంప్ ఆదేశించడం వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలకు నిదర్శనంగా మారింది.

ట్రంప్ రాజకీయ బలమైన మాగా ఉద్యమంలోనూ ఇప్పుడు చీలికలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్సన్ మూడో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలపై సంకేతాలు ఇవ్వడం రిపబ్లికన్ ఓటు బ్యాంకును విభజించే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. మాగా ఉద్యమం విశ్వసనీయత కోల్పోయిందని.. మద్దతుదారుల్లో తిరిగి నమ్మకం కలిగించడం వాన్స్‌కు పెద్ద సవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాన్స్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకముందే ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్.. టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్.. జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ వంటి నేతలు 2028 నామినేషన్ కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

2028 ఎన్నికల్లో వాన్స్ బరిలోకి దిగితే తాను మద్దతు ఇస్తానని ట్రంప్ ఇంతవరకు స్పష్టంగా ప్రకటించలేదు. అభ్యర్థిత్వంపై ఇప్పుడే తొందరపడనని ట్రంప్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఎలాన్ మస్క్, పీటర్ థీల్ వంటి సంపన్నుల అండ రాక్‌బ్రిడ్జ్ నెట్‌వర్క్ దాతల మద్దతు వాన్స్‌కు సానుకూలాంశాలుగా ఉన్నాయి.

ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న వాన్స్.. ఈ వేసవిలో నాలుగోసారి తండ్రిగా మారారు. కుటుంబ బాధ్యతలకు సమయం కేటాయిస్తూనే ప్రతికూల రాజకీయ వాతావరణంలో ఓటమిని ఎదుర్కొనే బదులు సరైన సమయం కోసం వేచి చూడాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇప్పుడే వెనక్కి తగ్గితే పార్టీ నాయకత్వంపై ఇతరులు పట్టు సాధించే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం ముగింపు.. ట్రంప్ ప్రజాదరణ.. రిపబ్లికన్ పార్టీ ఐక్యత వంటి అంశాలే వాన్స్ 2028 రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Tags:    
  • jdvance 
  • donaldtrump 
  • uspolitics 
  • 2028election 
  • maga 

Similar News

ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా.. ‘షాల్ వుయ్ మూవ్?’ అన్న మోదీ!

2026-11-18 06:50 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

డర్టీ బాంబ్‌.. పేలుడు కంటే రేడియేషన్‌తోనే ఎక్కువ ముప్పు!

2026-11-17 10:01 GMT

రోడ్లపై 'ఎర్ర' సముద్రం.. ఇదీ ప్రకృతి సృష్టిస్తున్న అద్భుత దృశ్యం

2026-11-17 05:35 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

ఆస్ట్రేలియాలో చదువుతున్న వారికి కొత్త తలనొప్పి.. కుటుంబ సభ్యుల వీసాపై మారిన రూల్స్!

2026-11-17 04:41 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

ఇంట్లో తినడానికి గుప్పెడు పిండి లేదు.. కానీ భారత్‌ను కొట్టడానికి టర్కీ నుంచి ఏకంగా లక్ష డ్రోన్లట..

2026-11-16 07:57 GMT

భారత ఐటీ కంపెనీలకు అమెరికాలో కొత్త చిక్కులు.. H-1B వీసాలపై పెరుగుతున్న ఆంక్షలు!

2026-11-16 04:28 GMT

ఆర్థిక ఇబ్బందులతో ఇరాన్ ప్రజల కఠిన నిర్ణయాలు.. అవయవాల విక్రయానికి ప్రకటనలు!

2026-11-16 04:26 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

Copyright @2026

Powered by Blink CMS