మొన్న ఎన్వీడియో.. నిన్న మైక్రోసాఫ్ట్.. నేడు విమానాలన్నీ బంద్.. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?
| అమెరికాలో వరుస సాంకేతిక అంతరాయాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామాపై ప్రచారం, మైక్రోసాఫ్ట్ సేవల నిలిచిపోవడం, తాజాగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ సమస్యలతో విమాన సర్వీసుల అంతరాయం కలకలం రేపాయి. ఇవన్నీ సైబర్ దాడులేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా, అధికారికంగా అలాంటి నిర్ధారణ లేదు. వరుస ఘటనల వెనుక కారణాలపై చర్చ సాగుతోంది.
పేరు గొప్ప అగ్రరాజ్యం.. అసలు టెక్నాలజీ కింగ్.. ఎవ్వరూ వంక పెట్టడానికి లేనన్నీ వసతులున్నాయి.. కానీ.. సమ్ థింగ్ రాంగ్.. ఏదో జరుగుతోంది.. కానీ అది ఎవ్వరికీ తెలియడం లేదు.. పైకి చూడడానికి ఇందంతా యాక్సిడెంట్, సాంకేతిక కారణాలు అని అర్థమవుతోంది. కానీ ఈ వరుస పరిణామాలు చూస్తే మాత్రం ఏదో తేడా కొడుతోంది.. అదేంటన్నది అగ్రరాజ్యం బయటపెట్టదు.. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టు.. ట్రంప్ సార్ మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓడిపోయాక తెరవెనుక ఏదో జరుగుతోందన్న చర్చ ఇప్పుడు అమెరికా వర్గాల్లో సాగుతోంది.
మొన్నే ఎన్వీడియో సీఈవో జెన్సాన్ హువాంగ్ రాజీనామా వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఆయన రాజీనామాకు కారణం ఒక చైనీస్ స్పై అని అనుమానిస్తున్న సింగపూర్ చిప్స్ కంపెనీ లేడీ ఓనర్ తో ఎఫైర్. అది బయటపడిందో లేక అమెరికానే చైనా చేతిలో హువాంగ్ పావుగా మారుతాడని అమెరికా భయపడిందో.. తమ చిప్స్ టెక్నాలజీ చైనా పరమవుతుందన్న ఆందోళనో ఏమో కానీ వెంటనే అమెరికా మీడియా మొత్తం జెన్సాన్ వివాహేతర సంబంధాలను తవ్వడం మొదలుపెట్టాయి. అమెరికా ప్రభుత్వం, ట్రంప్ జెన్సాన్ మంచోడు ఆయనకు ఇలా జరగడం కరెక్ట్ కాదంటూ సన్నాయినొక్కులు నొక్కినా.. ఆయన ప్లేసులో యాపిల్ మాజీసీఈవో టిమ్ కుక్ ను పెట్టాలంటూ కోరడంతో అందరిలోనూ అనుమానాలు వచ్చాయి. ఒక్క ఎఫైర్ తోనే జెన్సాన్ దిగిపోడని అర్థం కావడంతోనే ఆయన పాత రెండు ఎఫైర్లను బయటకు తీసుకొచ్చారని.. అందుకే జెన్సాన్ అవమానకరంగా రాజీనామా చేసి ఆయనను కుర్చీలోంచి దించేశారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో నిజనిజాలు ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే అమెరికా హిపోక్రసీ అలానే ఉంటుంది. తమకు నచ్చని.. మాట వినని.. స్పై చేతుల్లో చిక్కిన వారిని గద్దెదించడంలో అమెరికా కు అందెవేసిన చేయి..
ఇక రెండో విషయం మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్ సహా అన్నీ డౌన్ కావడం ప్రపంచవ్యాప్తంగా ఆ సేవలు నిలిచిపోవడం చర్చనీయాంశమైంది. అధికారికంగా ప్రకటించింది ఏంటయ్యా అంటే.. నెట్ వర్క్ కాన్ఫిగరేషన్ మార్పుల వల్ల తలెత్తిన సాంకేతిక లోపం అని.. సర్వర్లపై పడిన అధిక భారం అని పైకి చెప్పారు. గతంలో నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి చేసిన అప్ గ్రేడ్ లో భాగంగా ఒక సాంకేతిక లోపం ఏర్పడిందని.. మరో మార్పు తర్వాత ఆ లోపం బయటపడి వ్యవస్థలపై ప్రభావం చూపిందని అంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయి అంతా ఆగమాగమైంది. అయితే ఇదో సైబర్ దాడి అని.. ఉగ్రవాద నెట్ వర్క్ ల పని అని.. లేదా చైనీస్ స్పైవేర్ ల పని అన్న ప్రచారం ఉన్నా అగ్రరాజ్యం, మైక్రోసాఫ్ట్ దీన్ని ఖండించింది. తెరవెనుక ఏ జరిగిందన్నది మాత్రం బయటపడలేదు.
ఇప్పుడు తాజాగా అమెరికాలో విమాన సర్వీసులన్నీ ఆగిపోవడం కలకలం రేపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లలో కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తాయని.. ఆ దేశ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకటించింది. గ్రౌండ్ స్టాఫ్ ను ఒక్క విమానం ఎగరకుండా చూడాలని.. గాల్లోని విమానాలను మాత్రమే అత్యవసరంగా ల్యాండ్ చేయాలని ఆదేశించింది. అంటే విమానాలకు, ఎయిర్ పోర్టులోని కంట్రోల్ లకు, విమానాలకు మధ్యలో మాట్లాడే సిస్టం అయిన టెలీ కమ్యూనికేషన్ నిలిచిపోవడంతో విమానాలన్నింటిని అమెరికా వ్యాప్తంగా ఆపేశారు. 22 సెంటర్ల కమ్యూనికేషన్ ఒక్కసారిగా పడిపోయిందట.. 9/11 దాడుల తర్వాత అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిచిపోవడం ఇది రెండోసారి. 2023లోనూ ఈ తరహా సమస్య ఏర్పడింది. అయితే ఇది సైబర్ అటాక్ కావచ్చని అనుమానాలున్నాయి. అమెరికన్ సెక్యూరిటీ మాత్రం ఇది టెర్రర్ అటాక్ కాదంటూ చెబుతున్నాయి.
అయితే వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు మాత్రం అమెరికాలో హాట్ టాపిక్ గా మారాయి. మొన్న ఎన్వీడియో.. నిన్న మైక్రోసాఫ్ట్.. ఈరోజు విమానాలన్నీ బంద్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ జరగడంతో అందరూ డౌట్ పడుతున్నారు. ఇలా విమానాలన్నీ రద్దు కావడం 9/11 అప్పుడే జరిగింది. 10వేల విమానాలు అమెరికాలో రద్దు అయ్యాయి. 2000 విమానాలు డిలే అయ్యాయి. ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు విమానాలు టేకాఫ్ అవుతాయి.. ఎప్పుడు సమస్య బయటపడుతుందన్నది తెలియదు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే విమాన ప్రయాణికులు మీ ప్లైట్స్ వెళతాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మీ ప్రయాణ ఇబ్బంది కలుతుతుంది.
ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలంగా లేని దేశాల్లో ప్రభుత్వాలను మార్చేస్తుంటుంది. దేశ అధ్యక్షులను పారిపోయేలా చేస్తుంది. రెజీమ్ చేంజ్ అంటూ పలు దేశాల్లో అల్లర్లకు ఉసిగొల్పుతుంది. ఇప్పుడు తమ సొంత దేశంలో జరిగే పరిణామాలను కూడా తెరవెనుక ఉండి నడిపిస్తుందన్న చర్చ సాగుతోంది. అమెరికాలోని ఈపరిణామాలకు ప్రభుత్వ పాత్ర ఎంత ఉందన్నది తెలియదు కానీ.. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. లోగుట్టు ఎవరికీ తెలియదు.. కానీ అమెరికాలో మాత్రం ఏదో జరుగుతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సింది ఉంది.