• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రిమాండ్ ఖైదీ సంచలన...

రిమాండ్ ఖైదీ సంచలన విజయం.. జడ్పీటీసీగా వైసీపీ నేతకు పట్టం కట్టిన ఓటర్లు

| తిరుపతి జిల్లా పెళ్లకూరు జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 1,719 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హత్య కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేసి గెలుపొందడం చర్చనీయాంశమైంది. ఆయన భార్య ప్రభావతి, కుమార్తె రజని, స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించగా, జైలు నుంచి రాసిన లేఖ కూడా ఓటర్లను ఆకట్టుకుందని కథనం.

By - Tupaki Desk
Update: 2026-11-08 11:14 GMT

తిరుపతి జిల్లా పెళ్లకూరు జడ్పీటీసీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఎన్నిక రాష్ట్రంలో సంచలన చర్చకు తెరతీసింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై 1719 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేకపోయినప్పటికీ, ఆయన ఎన్నికైన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నామినేషన్ వేసిన నుంచి గెలిచిన వరకు ఒక్కరోజు కూడా ఆయన ప్రజల్లో తిరగకుండానే విజయం సాధించి రికార్డు సృష్టించారు. స్థానిక ఎన్నికలకు ముందు అరెస్టు అయిన సత్యనారాయణరెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో బెయిలు రాకపోవడంతో జైలు నుంచే నామినేషన్ వేశారు. జైలులో ఉంటూనే గెలిచారు. దీంతో సత్యనారాయణరెడ్డి విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా సరే ప్రజల మధ్య తిరగాలి, ఇంటింటి ప్రచారం చేయాలి, ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకోవాలి. కానీ, ఇవేమీ లేకుండా సత్యనారాయణరెడ్డి పెళ్లకూరు జడ్పీటీసీగా గెలవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ గెలుపు ద్వారా ప్రజల్లో తన పట్టును ఆయన నిరూపించుకున్నారని అంటున్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంలో తమ అభ్యర్థులతో నామినేషన్లనే వేయనీయడం లేదని వైసీపీ విమర్శలు చేసింది. అయితే అదే పార్టీకి చెందిన సత్యనారాయణరెడ్డి జైలు నుంచే నామినేషన్ వేసి గెలిచి సత్తా చాటారు. ఈ పరిణామంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సత్యానారాయణరెడ్డి జైలులో ఉండగా, ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతి, కుమార్తె రజని స్థానిక నాయకులతో కలిసి చేసిన ప్రచారం ఆకట్టుకుంది. దీంతో ప్రజలు సత్యానారాయణరెడ్డిని గెలిపించారని చెబుతున్నారు.

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఓ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన ఒకరి హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు అని ఆరోపించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఓ భూ వివాదానికి సంబంధించి తలెత్తిన ఘర్షణలే ఈ హత్యకు దారితీసినట్లు చెబుతున్నారు. ఈ కేసులో సత్యనారాయణరెడ్డి నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోవడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, సత్యనారాయణరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడానికి, పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు బనాయించిందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తూ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. దీంతో ఆయన విజయం నల్లేరుపై నడకలా సాగిందని అంటున్నారు.

పెళ్లకూరు మండలంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి నాలుగు దశాబ్దాలుగా బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన గతంలో పెళ్లకూరు ఎంపీపీగా సేవలందించిన సమయంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజలతో ఉన్న మమేకత ఆయనకు మంచి పేరు తెచ్చుకున్నారని చెబుతున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆయన చేసిన సేవల కారణంగానే స్థానికంగా ఆయనపై ప్రత్యేక ప్రజాదరణ ఉందని చెబుతున్నారు. జైలు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాక, తొలుత ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మతో నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, సత్యనారాయణ రెడ్డి నామినేషన్ ఆమోదం పొందడంతో ప్రధాన అభ్యర్థిగా బరిలో నిలిచారు.

అభ్యర్థి ప్రత్యక్షంగా ప్రచారానికి వచ్చే అవకాశం లేకపోవడంతో, ఆయన సతీమణి ప్రభావతమ్మ, కుటుంబ సభ్యులు, స్థానిక పార్టీ నాయకులు పెళ్లకూరు మండలం మొత్తం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు జైలు వేదికగా సత్యనారాయణ రెడ్డి విడుదల చేసిన ఒక భావోద్వేగ లేఖ కూడా ఎన్నికల్లో బాగా పనిచేసింది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకోవాలని కోరడం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో ప్రత్యర్థులు సర్వశక్తులు ఒడ్డినప్పటికీ, ప్రజలు మాత్రం కామిరెడ్డి వైపే నిలిచారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నప్పటికీ పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి 1,719 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అభ్యర్థి కళ్లెదుట లేకపోయినా, జైలు గోడల వెనుక ఉన్నా ప్రజలు ఆయనను గెలిపించడం స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. కష్టకాలంలోనూ ప్రజలు తన వెంటే ఉన్నారని నిరూపించిన ఈ గెలుపుతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

Tags:    
  • ysrcp 
  • kamireddysatyanarayanareddy 
  • pellakuru 
  • andhrapradeshpolitics 
  • zptcelection 

Similar News

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS