• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Bapatla >  కాంగ్రెస్ బ‌ల‌మా......

కాంగ్రెస్ బ‌ల‌మా... ప‌ర్స‌న‌ల్ ఎటాచ్‌మెంటా.. ?

| బాపట్ల జిల్లా చీరాలలో 10 మున్సిపల్ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఈ విజయం పార్టీ బలంతో కాకుండా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యక్తిగత పట్టుతోనే సాధ్యమైందనే విశ్లేషణలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో, ఇదే తరహా విజయాలు సాధించేందుకు ప్రతి జిల్లాలో బలమైన నాయకులను సిద్ధం చేయడం షర్మిలకు సవాలుగా మారింది.

By - Garuda Media
Update: 2026-11-08 11:15 GMT

బాప‌ట్ల జిల్లా చీరాలలో ప‌ది మున్సిపల్ స్థానాలను సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రవ్యాప్తంగా కనీసం మ‌రికొన్ని స్థానాల్లో అయినా గెలిచి ఉంటే అది ఇంకా బాగుండే పరిస్థితి ఉండేది. సాధారణంగా కాంగ్రెస్ పుంజుకుంటుంది లేదా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీ ఇస్తుంది అని చెప్పుకునేందుకు కూడా అవకాశం ఉండేది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఫలితం దక్కలేదు. కొన్ని కొన్ని స్థానాల్లో అయితే 20 ఓట్లు 10 ఓట్లు మూడు ఓట్లు కూడా పడిన నాయకులు ఉన్నారు. అంటే వాళ్ల కుటుంబాల్లో సభ్యులు కూడా వేయలేదు అన్నది స్పష్టమైనది.

ముఖ్యంగా రాయలసీమలో కాంగ్రెస్ వైపు పడిన ఓట్లు గమనిస్తే 10 కంటే కూడా దారుణంగా పడ్డాయి. సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది అర్థమవుతుంది. చీరాలలో మాత్రం ఖచ్చితంగా 10 వార్డుల్లో గెలవడం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఒక రకంగా ఆ పార్టీ బలమైన స్థానాల్ని దక్కించుకుందని భావించాలి. అయితే, ఇది కాంగ్రెస్ బలమా లేకపోతే వ్యక్తిగతంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బలమా అంటే పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఒప్పుకున్నట్టుగా ఇది పూర్తిగా ఆమంచి విజయం అనే చెప్పాలి.

ఆయన పట్టుదల, స్థానికంగా తనకున్న పట్టు నిరూపించుకోవాలన్న కసి వంటివి స్పష్టంగా కనిపించాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు వరకు కూడా వారి వెన్నంటి ఉండే వారిని వ్యక్తిగతంగా ముందుకు నడిపించి విజయం సాధించారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే తరహా గెలుపు రావాలి లేదా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటు బ్యాంకు పెంచుకోవాలి అంటే ప్ర‌తి జిల్లాకు ఆమంచి వంటి నాయకుడిని షర్మిల సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆమెకు ఇదో పెద్ద సవాల్గా మారనుంది.

ఎందుకంటే ఒకచోట ఒక వ్యక్తి కారణంగా పార్టీ గెలిచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ డోలాయ‌మానంలో పడడం అనేది పార్టీకి అదే విధంగా వ్యక్తిగతంగా షర్మిలకు కూడా ఇబ్బందికర పరిస్తితి. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో జిల్లాల వారీగా ఆమె బలమైన నాయకులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రజల్లో పట్టు ఉన్న నాయకులు అలాగే ప్రజలను కలుసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చే నాయకులకు అవకాశం కల్పించాలి.

అసలు ప్రజల పరిస్థితిని, వారి ఆకాంక్షలను కూడా తెలుసుకుని దానికి అనుగుణంగా షర్మిల అడుగులు వేస్తే చీరాల వంటి గెలుపు కొన్ని కొన్నిచోట్ల సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమంచి వల్లే కావచ్చు లేదా చీరాల ప్రజల అభిమానం వల్ల కావచ్చు కాంగ్రెస్కు కొంత పుంజుకునేందుకు అవ‌కాశం అయితే ద‌క్కింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Tags:    
  • congress 
  • yssharmila 
  • amanchikrishnamohan 
  • chirala 

Similar News

ష‌ర్మిల‌కు ఆల్ట‌ర్నేట్‌.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.. ?

2026-11-09 19:14 GMT

షర్మిల ఓవర్ కాన్ఫిడెన్స్

2026-11-07 11:50 GMT

టీడీపీలో 'బీచ్' వార్: ఎంపీ VS ఎమ్మెల్యే ..!

2026-08-30 03:00 GMT

అమెరికా పౌరసత్వం వద్దు సార్.. 94 ఏళ్ల వృద్ధురాలి ఇంట్రెస్టింగ్ స్టోరీ

2026-06-24 14:30 GMT

ఆ ఫ‌స్ట్ టైం టీడీపీ 'ఎంపీ' స్ట‌యిలే వేరుగా ..!

2026-03-02 12:30 GMT

తల్లి మళ్లీ పెళ్లి చేసుకుందని కొడుకు సూసైడ్

2025-12-13 09:54 GMT

పాద‌యాత్ర‌కు రెడీ అయిన‌ మాజీ ఎంపీ.. జ‌గ‌న్ ఏం చెప్పారంటే..!

2025-07-30 14:59 GMT

కుక్కను ఢీకొంటే వందేభారత్ ట్రైన్ దెబ్బ తినటమా?

2025-07-07 07:30 GMT

బాబు సభలో జై జగన్ నినాదాలు.. దిమ్మతిరిగేలా వార్నింగ్ ఇచ్చిన సీఎం

2025-04-02 04:57 GMT

మారిన చంద్రబాబు.. అంత బిజీలోనూ జీవిత భాగస్వామి కోసం షాపింగ్

2025-04-02 04:01 GMT

మళ్లీ జైలుకు మాజీ ఎంపీ నందిగం సురేశ్.. వైసీపీకి షాక్

2025-02-17 11:53 GMT

Copyright @2026

Powered by Blink CMS