ఆ ఫ‌స్ట్ టైం టీడీపీ 'ఎంపీ' స్ట‌యిలే వేరుగా ..!

ఫ‌స్ట్‌టైమ్ విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీల్లో బాప‌ట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ‌ప్ర‌సాద్ ఒక‌రు. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన బాప‌ట్ల నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు.;

Update: 2026-03-02 12:30 GMT

ఫ‌స్ట్‌ టైమ్ విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీల్లో బాప‌ట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ‌ప్ర‌సాద్ ఒక‌రు. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన బాప‌ట్ల నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న‌కు చివ‌రి నిమిషంలో టికెట్ కేటాయించ‌డంతోపాటు.. స్థానిక నాయ‌కుల‌ను సంప్ర‌దించకుండానే ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చార‌న్న వాద‌న ఇప్ప‌టికీ వినిపిస్తుంది. స‌రే.. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ ప‌రిస్థితి ఏంటి? ఎలా ముందుకు సాగుతున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌.

ఎంపీగా కృష్ణ‌ప్ర‌సాద్ గెలిచి ఇప్ప‌టికి 20 నెల‌లు అయింది. కానీ.. ఇప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గంలోని ముఖ్య నాయ‌కుల‌కు ఆయ‌న ద‌ర్శ‌నం క‌డు క‌ష్టంగా మారిందంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. గ‌తంలో పోలీసుగా ప‌నిచేసిన ఆయ‌న‌.. ఇప్ప‌టికీ.. అదే స్ట్రిక్ట్‌నెస్ పాటిస్తున్నార‌న్న‌వాద‌నా వినిపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్ర‌స్థాయిలో ఆయ‌న కేవ‌లం ఎమ్మెల్యేల‌కు అది కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఇద్ద‌రు ముగ్గురు ఎమ్మెల్యేల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న‌ర‌న్న‌ది టీడీపీ నాయ‌కులే చెబుతున్న మాట‌.

అంతేకాదు.. తెన్నేటి స్ట‌యిలే వేర‌ని కూడా టీడీపీ నేత‌లు బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేస్తున్నారు. జాతీయ స్థాయి నాయ‌కులపైనే ఆయ‌న మ‌క్కువ ఉంద‌ని.. ఎంత‌సేపూ.. ఢిల్లీలోనే ఉంటున్నార‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఎంపీగా ఆయ‌న ఢిల్లీకి వెళ్ల‌డం త‌ప్పు కాక‌పోయినా.. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిం చేందుకు ప్ర‌య‌త్నించాలని కోరుతున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో స‌మన్వ‌య స‌మావేశాలు నిర్వ‌హించింది లేదు. పైగా.. కార్య‌క‌ర్త‌ల‌ను క‌లివిడిగా చేసింది కూడా లేదు.

చీరాల చైర్మ‌న్ ఎంపిక విష‌యంలో ఎమ్మెల్యేతో క‌లిసి ప‌నిచేసిన త‌ర్వాత‌.. ఆయ‌న ఎవ‌రికీ అందుబాటు లోకి రాలేద‌న్నది నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తున్న టాక్‌. ఈ విష‌యంపై ఒకసారి నాయ‌కులు కూడా ఆయ‌న కు పెద్ద ఎత్తున లేఖ సంధించారు. కానీ.. ఫ‌లితం ద‌క్క‌లేద‌ని చెబుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం కోసం.. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము క‌ష్టించామ‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఎంపీ మాట వేరేగా ఉంది. దీంతో నాయ‌కుల‌కు ఎంపీకి మ‌ధ్య డిస్టెన్స్ కొన‌సాగుతోంది. ఇది స‌రికాద‌న్న‌ది సీనియ‌ర్లు చెబుతున్న మాట‌. అయినా.. తెన్నేటి మాత్రం త‌న‌దైన శైలిలోనే ముందుకు సాగుతున్నారట‌.

Tags:    

Similar News