• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Bapatla >  షర్మిల ఓవర్ కాన్ఫిడెన్స్

షర్మిల ఓవర్ కాన్ఫిడెన్స్

| బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 వార్డుల్లో పోటీ చేసి 10 స్థానాలు గెలుచుకుందని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ విజయానికి స్థానిక పార్టీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ కృషే కారణమని అభినందించారు. చీరాలలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచి ప్రతిపక్ష పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పుంజుకోవాలంటే ఆమంచి తరహాలో జిల్లాలవారీగా బలమైన నాయకత్వం, క్షేత్రస్థాయి సంస్థాగత బలోపేతం అవసరమనే చర్చ సాగుతోంది.

By - Garuda Media
Update: 2026-11-07 11:50 GMT

బాప‌ట్ల జిల్లా చీరాల మునిసిపాలిటీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 10 వార్డుల‌ను ద‌క్కించుకుంది. ఇది ఒక‌ర‌కంగా.. పార్టీకి బూస్ట్ ఇచ్చిన ట్టేన‌న్న చ‌ర్చ సాగుతోంది. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన ష‌ర్మిల‌.. 44 స్థానాల్లో భాగంగా, 42 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి, 10 స్థానాలను గెలిచామ‌ని పేర్కొన్నారు. పార్టీ పుంజుకుంటోంద‌న‌డానికి ఇదే పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా ఆమె పేర్కొన్నారు. అయితే.. ఈ విజ‌యం పూర్తిగా స్థానిక జిల్లా పార్టీ అధ్య‌క్షుడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కే ద‌క్క‌నుంద‌ని చెప్పారు. పార్టీని రెండో స్థానంలో నిలబెట్టడంలో ప్రత్యక్ష పాత్ర పోషించార‌ని అభినందించారు. కాంగ్రెస్ సారథ్యంలో చీరాలలో అభ్యర్థుల గెలుపు ఆమంచి కష్టానికి దక్కిన ప్రతిఫలమని ఆమె పేర్కొన్నారు.

స్థానికంగా ప్రజా సమస్యలపై ఆమంచి అకుంఠిత పోరాట పటిమకు నిదర్శనమన్న ష‌ర్మిల‌.. చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం.. నిజమైన ప్రజాస్వామ్య విజయంగా పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయం అనడానికి ఇదొక సంకేతమ‌ని తెలిపారు. ప్రజల గొంతుకను నొక్కిపట్టాలని చూసిన కూటమి శక్తులను ఎదురించి, అధికార బలాన్ని తట్టుకుని, ప్రలోభాలకు లొంగకుండా, ప్రజా పక్షాన నిలిచి పోరాడి కాంగ్రెస్‌ వార్డు సభ్యులు గెలిచార‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మి ఓటేసి గెలిపించిన చీరాల ప్రజలకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోలేక పోయినా, గౌరవ ప్రదమైన స్థానాలు దక్కించుకొని, ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్న కాంగ్రెస్ దే చీరాలలో అసలైన నైతిక విజయమ‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. చీరాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కూటమి నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా, అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, గెలుపొందిన మన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అంకితభావంతో పనిచేయాల‌ని ష‌ర్మిల పిలుపునిచ్చారు. ఈ విజ‌యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేస్తుంద‌ని చెప్పారు. పార్టీ గ‌తంలో ఏ విధంగా అయితే.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయిందో ఇప్పుడు కూడా అలానే చేరువ అవుతుంద‌ని చెప్పారు.

ఆశ‌లు నెర‌వేరాలంటే..

అయితే.. ష‌ర్మిల పేర్కొన్న విష‌యం ప్ర‌కారం.. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకుదా? అంటే.. సందేహ‌మే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పోటీ చేసినా.. ఎక్క‌డా మెరుగైన ప్రాతినిధ్యం ప్ర‌ద‌ర్శించ‌లేదు. కానీ, ఒక్క చీరాల‌లో మాత్రం ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ప్ర‌భావంతోనే పార్టీ పుంజుకుంద‌న్న‌ది సుస్ప‌ష్టం. అయితే.. ఆమంచి మాదిరిగా జిల్లాల వారీగా నాయ‌కులు పుంజుకుంటే.. అప్పుడు పార్టీకి ష‌ర్మిల ఆశిస్తున్న ట్టు పున‌ర్వైభ‌వం వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. కానీ, ఆమేర‌కు పార్టీనిసంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసేందుకు క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఉన్నారా? అనేది ప్ర‌శ్న‌. అయితే.. ష‌ర్మిల ఈదిశ‌గా ఆలోచ‌న చేస్తే.. కొంత మేర‌కు పుంజుకునే అవ‌కాశం క‌నిపిస్తుంది.

Tags:    
  • yssharmila 
  • congress 
  • chirala 
  • amanchikrishnamohan 
  • andhrapradeshpolitics 

Similar News

ష‌ర్మిల‌కు ఆల్ట‌ర్నేట్‌.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.. ?

2026-11-09 19:14 GMT

కాంగ్రెస్ బ‌ల‌మా... ప‌ర్స‌న‌ల్ ఎటాచ్‌మెంటా.. ?

2026-11-08 11:15 GMT

టీడీపీలో 'బీచ్' వార్: ఎంపీ VS ఎమ్మెల్యే ..!

2026-08-30 03:00 GMT

అమెరికా పౌరసత్వం వద్దు సార్.. 94 ఏళ్ల వృద్ధురాలి ఇంట్రెస్టింగ్ స్టోరీ

2026-06-24 14:30 GMT

ఆ ఫ‌స్ట్ టైం టీడీపీ 'ఎంపీ' స్ట‌యిలే వేరుగా ..!

2026-03-02 12:30 GMT

తల్లి మళ్లీ పెళ్లి చేసుకుందని కొడుకు సూసైడ్

2025-12-13 09:54 GMT

పాద‌యాత్ర‌కు రెడీ అయిన‌ మాజీ ఎంపీ.. జ‌గ‌న్ ఏం చెప్పారంటే..!

2025-07-30 14:59 GMT

కుక్కను ఢీకొంటే వందేభారత్ ట్రైన్ దెబ్బ తినటమా?

2025-07-07 07:30 GMT

బాబు సభలో జై జగన్ నినాదాలు.. దిమ్మతిరిగేలా వార్నింగ్ ఇచ్చిన సీఎం

2025-04-02 04:57 GMT

మారిన చంద్రబాబు.. అంత బిజీలోనూ జీవిత భాగస్వామి కోసం షాపింగ్

2025-04-02 04:01 GMT

మళ్లీ జైలుకు మాజీ ఎంపీ నందిగం సురేశ్.. వైసీపీకి షాక్

2025-02-17 11:53 GMT

Copyright @2026

Powered by Blink CMS