హై అలర్ట్... పుణ్యక్షేత్రంలో బెంబేలెత్తిస్తోన్న పెద్దపులి!

అవును... అడవిలో ఉండాల్సిన పులి.. రాజమండ్రి, రాజానగరం ప్రాంతాల్లో తిరుగుతుండటం ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది.;

Update: 2026-02-05 06:30 GMT

రాజమండ్రి శివారు గ్రామాల్లో పెద్ద పులి సంచారం స్థానిక ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. పగలు రెస్ట్ తీసుకుంటూ రాత్రుల్లు జనావాసాల్లోకి వస్తోన్న ఈ పులి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి దివాన్ చెరువు, అక్కడ నుంచి బీజాపూర్ టౌన్ షిప్, శ్రీరాంపురం మీదుగా రఘునాథపురం చేరుకుందని.. ఈ క్రమంలో రాత్రి కురుక్షేత్రం ప్రాంతంలో సంచరించిందని అధికారులు చెబుతున్నారు. ఆ పులిని పట్టుకునే ఆపరేషన్ పూర్తయ్యే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అవును... అడవిలో ఉండాల్సిన పులి.. రాజమండ్రి, రాజానగరం ప్రాంతాల్లో తిరుగుతుండటం ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. పలు పశువులను చంపి రక్తం తాగిన పెద్ద పులి టెన్షన్ పుట్టిస్తోంది. దీంతో స్థానిక పాఠశాలలలకు సెలవులు ప్రకటించిన అధికారులు.. పులి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్ మండలం అంకాలమ్మ తల్లి కొండ వద్ద పులి పాదముద్రలు ఉన్నాయనే సమాచారంతో అటవీశాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు.

ఈ నేపథ్యంలో.. పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాంలో పులి సంచారం ఉందని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ.. జాగ్రత్తగా మాత్రం ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సమయలో పులికి మత్తుమద్దు ఇచ్చి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులూ వచ్చాయని తెలిపారు. ఈ సమయంలో.. పూణే, ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని.. ఇప్పటికే 12 బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

వాస్తవానికి సుమారు రెండు వారాల క్రితం ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో పులి జాడను అధికారులు గుర్తించగా.. ఇప్పుడు రాజమండ్రి, రాజానగరం ప్రంతాల్లో పులి సంచారం ఆందోళన కలిగిస్తుంది. దారి తప్పి అడవిలోకి వెళ్లకుండా సిటీ వైపు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో సుమారు రెండు వారాలుగా గోదావరి జిల్లాల జనాలకు ఈ పెద్ద పులి ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తొందరగా దాన్ని బంధించి.. అడవిలో వదిలిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కాగా... గత నెలలో ఏలూరులోని బుట్టాయగూడెం మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఈ పులి తెలంగాణ రాష్ట్రంలోని కావడిగుండ్ల, జీలుగు మిల్లి ప్రాంతం నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి మారేడు మిల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లాల్సింది పోయి, దారి తప్పి రాజమండ్రి, రాజనగరం ప్రాంతాల్లో సంచరిస్తూ.. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ఈ క్రమంలో బుధవారం రాత్రి పుణ్యక్షేత్రం - జి.యర్రంపాలెం గ్రామాల మద్య మూడు ఆవులు, ఓ దూడను చంపేసింది. ఇందులో భాగంగా... పుణ్యక్షేత్రం గ్రామంలోని ఓ పామాయిల్ తోటలో ఆవును.. అనంతరం జి.యర్రంపాలెంలోని మరో తోటలో రెండు ఆవులు, దూడను చంపింది. దీంతో గురువారం ఉదయం ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు తెలిపారు. ఈ సమయంలో అటవీశాఖ అధికారులతో పాటు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Tags:    

Similar News