ప్ర‌భుత్వం అన్నాక ఆమాత్రం చేయాలి: సీఎం విజ‌య్‌పై సుప్రీం వ్యాఖ్య‌లు

''ప్ర‌భుత్వం అన్నాక ఆ మాత్రం చేయాలి త‌ప్పులేదు. ముందుకు వెళ్లండి!.'' అంటూ.. త‌మిళ‌నాడులోని సీఎం విజ య్ ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

Update: 2026-08-14 16:35 GMT

''ప్ర‌భుత్వం అన్నాక ఆ మాత్రం చేయాలి త‌ప్పులేదు. ముందుకు వెళ్లండి!.'' అంటూ.. త‌మిళ‌నాడులోని సీఎం విజ య్ ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌న‌సు పెట్టారంటూ ప్ర‌శంసించింది. అదేస‌మ‌యంలో పిటిష‌న్ దారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వ విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించే అధికారం మీకెవ‌రి చ్చారంటూ నిల‌దీసింది. ప్ర‌తి విష‌యాన్నీ కోర్టుల వ‌ర‌కు లాగి స‌మ‌యాన్ని వృథా చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు ప్ర‌ధానన్యాయ‌మూర్తి ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.

విష‌యం ఏంటంటే..

గ‌త ఏడాది సెప్టెంబ‌రులో త‌మిళ‌నాడులోని క‌రూర్‌లో టీవీకే అధినేత‌, న‌టుడు విజ‌య్ నిర్వహించిన ఎన్నిక‌ల ర్యా లీలో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ స‌మ‌యంలో 41 మంది మృతి చెందారు. ఈ కుటుంబాల‌ను ఆదుకునేందుకు విజ య్ తలా కోటి రూపాయ‌ల చొప్పున ఇచ్చారు. దీంతో పాటు.. తాను అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇస్తాన ని బాధిత కుటుంబాల‌కు హామీ ఇచ్చారు. అనంత‌రం.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య్ గెలుపు గుర్రం ఎక్కారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అధికారంలోకి వ‌స్తూనే నాటి బాధిత కుటుంబాల్లో అర్హులైన 33 మందికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.

అయితే.. ఈ వ్య‌వ‌హారంపై కొంద‌రు త‌మిళ‌నాడు హైకోర్టును ఆశ్ర‌యించారు. నిరుద్యోగులు పోటీప‌డి సాధించుకోవా ల్సిన ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం ప‌ప్పుబెల్లాల్లా పంచిపెట్టార‌ని కోర్టుకు వివ‌రించారు. ఈ చ‌ర్య‌లను అడ్డుకోవాల‌న్నా రు. దీనిపై స్పందించిన హైకోర్టు.. తొలుత ప‌ర్మినెంట్ కాకుండా.. క్యాజువ‌ల్ ఉద్యోగాలు ఇవ్వాల‌ని ఆదేశించింది. అనంత‌రం.. అస‌లు ఉద్యోగాలే ఇవ్వ‌డానికి వీల్లేద‌ని విజ‌య్ ప్ర‌భుత్వాన్ని కోరుతూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల‌పై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. బాధితుల‌ను ఆదుకోవ‌డం ప్ర‌భుత్వా ల ప్ర‌థ‌మ క‌ర్త‌వ్య‌మ‌ని.. విజ‌య్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంలో త‌ప్పులేద‌ని పేర్కొంది. పిటిష‌న‌ర్ల‌కు వేరే ఉద్దే శాలు ఉన్న‌ట్టుగా స్ప‌ష్ట‌మవుతోంద‌ని తెలిపింది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆర్థిక సాయం అందించినా.. జీవ‌నోపాధి పొందేందుకు బాధిత కుటుంబాల‌కు ఉద్యోగాలు ఇస్తే త‌ప్పులేద‌ని విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకోబోమ‌ని పేర్కొంది. మ‌ద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెట్టింది.

Tags:    

Similar News