2500 : రాహుల్ వ్యాఖ్యలు బూమ్ రాంగ్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అవుతున్నాయి.

Update: 2024-05-06 06:44 GMT

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు రూ.2500 నగదు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ రాష్ట్రంలో మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తున్నాం అని చేసిన ప్రకటన కలకలం రేపుతున్నది.

ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మాత్రమే అమలు చేస్తున్నది. మిగిలిన పథకాలు ఏవీ అమలుకావడం లేదు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉన్న పరిమితుల దృష్ట్యా ప్రభుత్వ పథకాలను అమలుచేయలేక పోతున్నామని కాంగ్రెస్ చెబుతున్నది. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రతి మహిళకూ రూ.2500 ఇస్తున్నామని చెప్పించడం వెనక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉందని అంటున్నారు.

ఇప్పటికే రైతుభరోసా ఎకరాకు రూ.15000 వేలు ఇవ్వకుండా, ఎకరాకు రూ.10000 రైతుబంధు కూడా ఇవ్వకుండా రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నది. డిసెంబరు 9న రూ.2 లక్షలు రుణమాఫీ, రైతుబంధు , ఆరు గ్యారంటీల అమలు ఇప్పటికే బూమ్ రాంగ్ అయింది.

విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో ఆగస్ట్ 15న రుణమాఫీ, ఈ నెల 8 లోపు అందరికీ రైతుబంధు నిధులు జమచేస్తాం అని రేవంత్ పదే పదే చెబుతున్నాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ నోటి నుండి ఈ వ్యాఖ్యలు చేయించడం కలకలం రేపుతున్నది.

Tags:    

Similar News