కలకలం : బీజేపీ అధికార ప్రతినిధిగా పీకే !

బీజేపీ విడుదల చేసినట్లు చెబుతున్న ఆ లేఖ ఫేక్ అని ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ ఓ ప్రకటనలో తెలిపింది

Update: 2024-05-23 11:51 GMT

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆలియాస్ పీకే బీజేపీలో చేరాడని, అతడిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించిందనే సోషల్ మీడియా స్క్రీన్ షాట్లు కలకలం రేపాయి.

బీజేపీ విడుదల చేసినట్లు చెబుతున్న ఆ లేఖ ఫేక్ అని ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ ఓ ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ పార్టీ నేత జై రాంరమేష్‌ఈ ఫేక్ ఇమేజ్ షేర్ చేశాడని విమర్శించింది.

‘‘కాంగ్రెస్, రాహుల్ గాంధీ, మీరంతా ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతూ బాధితులమని చెప్తారు. ఇప్పుడు మీరే చూడండి, కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ చీఫ్, సీనియర్ నేత జైరాం రమేష్ వ్యక్తిగతంగా ఈ నకిలీ డాక్యుమెంట్‌ని ఎలా సర్య్కూలేట్ చేస్తున్నారో..’’ అని ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎక్స్ వేదికగా విమర్శించింది. ప్రశాంత్ కిషోర్‌ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్లు ఉన్న లేఖ ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సప్ లలో విస్తృతంగా సర్క్యూలేట్ అవుతున్నది.

గత కొన్ని రోజులుగా మోడీ తిరిగి అధికారంలోకి రానున్నాడని, బీజేపీ చెబుతున్నట్లు 370 సీట్లు రాకున్నా గతంలో వచ్చిన సీట్లకు కొద్దిగా అటు ఇటూ వస్తాయని ప్రశాంత్ కిశోర్ చెబుతున్నాడు. దీనిని ఇండియా కూటమి తప్పుపడుతుంది.

Tags:    

Similar News