సినిమాలు ఎందుకు చేస్తున్నానంటే...పవన్ !

అంతే కాదు తనకు అన్నం పెట్టినది కళామతల్లి. అందుకే సినిమా విషయంలో తన ప్రేమ తగ్గదని చెప్పారు. అభిమానుల కోసం కూడా సినిమాలు చేస్తున్నాను అన్నారు.;

Update: 2025-07-22 04:16 GMT

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత. ఏపీకి ఉప ముఖ్యమంత్రి. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అంతే కాదు అధికార బాధ్యతలతో ఉన్నారు. మరి ఇంతటి బిజీ షెడ్యూల్ లో సినిమాలు చేయాల్సిన అవసరం ఉందా అన్నది ఒక చర్చ. అసలు పవన్ ఎందుకు సినిమాలు చేస్తున్నారు తన ఆత్మానందం కోసమా. లేక కళ మీద మక్కువా లేక అభిమానుల కోసమా లేక దేనికి అన్నది చర్చగానే ఉంటుంది.

దానికి ఆయన హరిహర వీరమల్లు సినీ ఫంక్షన్ లో ఒక వివరణ ఇచ్చేశారు. నాకు సినిమాలు తప్ప మరోటి తెలియదు అని వ్యాఖ్యానించారు. నాకు డబ్బులు అవసరం అని పవన్ అన్నారు. నేను పార్టీని నడపాలి. అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి అందుకే సినిమాలు చేస్తున్నాను అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

అంతే కాదు తనకు అన్నం పెట్టినది కళామతల్లి. అందుకే సినిమా విషయంలో తన ప్రేమ తగ్గదని చెప్పారు. అభిమానుల కోసం కూడా సినిమాలు చేస్తున్నాను అన్నారు. వీరమల్లులో కంటెంట్ ని ఆయన చెబుతూ ఇందులో సస్పెన్స్ ఉండదు, డైరెక్ట్ స్టోరీనే అన్నారు.

మన పాఠ్య పుస్తకాలలో మొఘలుల పాలన గురించి ఎంతో గొప్పగా చెబుతారని కానీ వారు చేసిన చెడుని ఎక్కడా చూపించరని ఆయన అన్నారు. భారత దేశం మీద ఎంతో మంది దాడి చేసి దండయాత్ర చేసి దోచుకున్నారని పవన్ అన్నారు. అలాగే ఔరగజేబు గ్రేట్ అంటారు. అక్బర్ గ్రేట్ అంటారు అని వారి రెండవ కోణం ఎవరూ చెప్పరని ఆయన అంటూ ఔరంగజేబు గురించి ఈ సినిమాలో చూపించామని చెప్పారు.

హిందువుగా ఉండాలంటే కప్పం కట్టాలి అన్న ఔరంగజేబు విధానం మీద పోరాడిన ఒక తీరు మీద తిరుగుబాటు మీద అల్లిన కల్పిత కధ ఇదని అన్నారు. ఇక పవన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హిందూత్వ గురించి మాట్లాడుతూ ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చారు.

ఈ మధ్యకాలంలో ఆయన సనాతం అంటున్నారు. సనాతన ధర్మం అంటున్నారు. హిందూత్వ అని చెబుతున్నారు. మరి ఆ పాయింట్లు అన్నీ కలపి ఈ మూవీలో రంగరించారా అన్నది కూడా చర్చగా ఉంది. పాన్ ఇండియా మూవీ అని ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడారా లేక హిందూత్వ గురించి చెబుతూ బీజేపీ పెద్దలకు కూడా వివరించే ప్రయత్నంలో మాట్లాడారా అన్నది తెలియదు కానీ ఆయన మొఘలుల పాలన తీరు మీద చరిత్రలో చోటు చేసుకోని చీకటి కోణాల మీద మాట్లాడడం చూస్తే కనుక బీజేపీ వారి ఫిలాసఫీ గానే ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ తన స్పీచ్ తో సినిమా అంచనాలు మాత్రం పెంచేశారు. అలాగే తాను సినిమాలు ఎందుకు చేస్తున్నానో చెప్పేశారు. అలా చాలా విషయాల మీద క్లారిటీ అయితే ఇచ్చేశారు.

Tags:    

Similar News