• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇరాన్ పై అమెరికా దాడి......

ఇరాన్ పై అమెరికా దాడి... పాకిస్థాన్ కీలక వ్యాఖ్యలు!

| ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలోకి తాజాగా అమెరికా ఎంట్రీ ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-06-22 13:25 GMT

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలోకి తాజాగా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా.. ఇరాన్ లోని మూడు కీలక అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసింది. ఈ సందర్భంగా మిషన్ సక్సెస్ అంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఈ ఘటనపై పాకిస్థాన్ స్పందించింది. కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... నోబెల్ శాంతి బహుమతి - 2026కి ట్రంప్ పేరును పాకిస్థాన్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు అనంతరం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన పాక్.. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఖండించింది. దీనివల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

తాజా ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం తనను తాను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కు ఇరాన్ కు ఉందని పాకిస్థాన్ తెలిపింది.

ఇదే సమయంలో... ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య శత్రుత్వాన్ని వెంటనే ముగించాలని కోరిన పాకిస్థాన్... సైనిక తీవ్రత కాదు, దౌత్యమే శాంతికి స్థిరమైన మార్గం అని నొక్కి చెప్పడం గమనార్హం. ఈ ప్రాంతంలో సంక్షోభాలను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలు మాత్రమే ఆచరణీయ మార్గం అని పాకిస్థాన్ చెప్పుకొచ్చింది.

ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన వల్ల ఉద్రిక్తతలు మరింత పెరగనున్నాయని తెలిపింది. కాగా... ఇరాన్‌ తో 900 కిలోమీటర్లకుపైగా సరిహద్దును పంచుకునే పాకిస్తాన్ తాజా వ్యాఖ్యలు ఇరాన్ కు మద్దతుగా మాత్రమేనా.. లేక, ట్రంప్ చర్యను పూర్తిగా ఖండిస్తున్నట్లా అనే స్పష్టత కొరవడిందని అంటున్నారు!

కాగా వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును అధికారికంగా నామినేట్ చేయాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ కు ట్రంప్ వైట్ హౌస్‌ లో ఆతిథ్యం ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

Tags:    
  • IranIsraelWar 
  • USStrikesIran 
  • PakistanOnWar 
  • TrumpNobelNomination 
  • MiddleEastTensions 
  • IranNuclearSites 
  • Geopolitics2025 
  • WorldWar3Threat 
  • PakistanDiplomacy 
  • PeaceVsWar 
  • Iranisraelwar 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS