• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెరపైకి మరో యూట్యూబర్......

తెరపైకి మరో యూట్యూబర్... పాక్ కు గూఢచర్యం కేసులో బిగ్ ట్విస్ట్!

| ఇప్పుడు ఈ కేసు వ్యవహారం ఒడిశాకు చేరింది. కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), పూరీ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో మరో యూట్యూబర్ ప్రియాంక పేరు తెరపైకి వచ్చింది!

By - Tupaki Desk
Update: 2025-05-18 18:30 GMT

పాకిస్థాన్ కు చెందిన నిఘా సంస్థలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాలోని హిసార్ లో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఆ కేసులు ఇప్పుడు ఒడిశాతో సంబంధం వెలుగులోకి వచ్చింది! ఈ సందర్భంగా మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అవును... పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతితో పాటు మరో ఆరుగురు అరెస్టైన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ కేసు వ్యవహారం ఒడిశాకు చేరింది. కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), పూరీ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో మరో యూట్యూబర్ ప్రియాంక పేరు తెరపైకి వచ్చింది!

ఈ సందర్భంగా స్పందించిన పూరీ ఎస్పీ వినీత్ అగర్వాల్... జ్యోతి గత ఏడాది పూరి సందర్శించినట్లు తాము గుర్తించామని.. ప్రస్తుతం వాస్తవాలు ఏమిటనే విషయం వెరిఫై చేస్తున్నామని.. పూర్తి వివరాలు తెలిసి, వాటిని ధృవీకరించిన అనంతరం మరింత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ అంశంపై పూర్తీ యూట్యూబర్ ప్రియాంక ఇన్ స్టా వేదికగా స్పందించారు.

ఈ సందర్భంగా... జ్యోతి మల్హోత్రా తనకు స్నేహితురాలు మాత్రమే అని.. ఆమెను తాను యూట్యూబ్ ద్వారా కలిశానని తెలిపారు. అయితే.. ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం తనకు తెలియదని.. ఆమె పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తుందని తెలిస్తే అసలు ఆమెతో కాంటాక్ట్ లోనే ఉండేదానిని కాదని.. ఈ సమయంలో తనను ప్రశ్నించాలనుకుంటే దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని ఆమె పేర్కొన్నారు.

మరోపక్క ఇదే విషయంపై ప్రియాంక తండ్రి స్పందించారు. పోలీసులు తన కుమార్తెను విచారించి కొంత సమాచారం సేకరించారని అన్నారు. ఇద్దరూ యూట్యూబర్లు అవ్వడం వల్లే తన కుమార్తెకు జ్యోతితో పరిచయం ఏర్పడిందని.. వారి మధ్య స్నేహం పెరగడంతో జ్యోతి పూరీని సందర్శించిందని.. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం అయితే సరైన దర్యాప్తు జరగాలని అన్నారు.

ఇదే సమయంలో.. తన కుమార్తె మూడు నాలుగు నెలల క్రితం తీర్థయాత్రలో భాగంగా పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ కు వెళ్లిందని.. అయితే ఆమె ఆ సమయంలో జ్యోతితో వెళ్లలేదని.. మరో ఫ్రెండ్ తో కలిసి వెళ్లిందని.. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదని అన్నారు.

Tags:    
  • SpyScandal 
  • JyotiMalhotra 
  • PriyankaSenapati 
  • PakistanISI 
  • IndianSecurity 
  • YouTuberArrest 
  • NationalSecurity 
  • OdishaNews 
  • PuriPolice 
  • KartarpurVisit 
  • YouTubeControversy 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS