• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆపరేషన్ సిందూర్ ...

ఆపరేషన్ సిందూర్ సక్సెస్... దేశ వ్యాప్తంగా బీజేపీ బిగ్ ప్లాన్!

| ఆపరేషన్ సిందూర్ ఫుల్ సక్సెస్ అనే మాట యావత్ భారత్ చెప్పిన సంగతి తెలిసిందే! దీంతో.. దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాపెయిన్ చేపట్టనుంది బీజేపీ.

By - Tupaki Desk
Update: 2025-05-12 17:57 GMT

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లోయలో సందడిగా, ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి. ఈ సమయంలో మతం అడిగి మరీ వారిపై విరుచుకుపడటం గమనార్హం. ఈ పాశవిక దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.

దీంతో... భారతదేశం ప్రతీకార జ్వాలతో రగిలిపోయింది. ఈ క్రమంలో మే 6, 7 మధ్య రాత్రి పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం విరుచుకుపడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 25 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసి, 100 మంది ఉగ్రమూకలను మట్టుబెట్టింది.

ఈ విషయంలో భారత సైన్యం దాడి కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాలేదు. నేరుగా పాక్ లోని కీలక ప్రాంతాలనూ టచ్ చేసింది. పంజాబ్ లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది! దీంతో.. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అనే మాట వినిపించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికారం ఎన్డీయే కూటమిలో కీలకమైన బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంపై వినిపిస్తున్న భిన్నాభిప్రాయాల సంగతి కాసేపు పక్కనపెడితే... మే 6, 7 తేదీల్లో పాక్, పీవోకే లో 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసే విషయంలో ఆపరేషన్ సిందూర్ ఫుల్ సక్సెస్ అనే మాట యావత్ భారత్ చెప్పిన సంగతి తెలిసిందే! దీంతో.. దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాపెయిన్ చేపట్టనుంది బీజేపీ.

ఇందులో భాగంగా... మే 13 నుంచి ఈ యాత్రను ప్రారంభించి, 11 రోజుల పాటు క్యాపెయిన్ చేపట్టి.. ఈ నెల 23న ముగించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్యాంపెన్ లో ప్రధానంగా ప్రధాని మోడీ నాయకత్వ పటిమ, భారత సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా కొనసాగాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ తిరంగా యత్ర నిర్వహణపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, మొదలైన పలువురు అగ్రనేతలు సమావేశమయ్యరు. ఈ యాత్రలో పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

Tags:    
  • Operationsindoor 
  • TirangaYatra 
  • IndiaPakistanConflict 
  • BJPLeadership 
  • IndiaArmyVictory 
  • ModiGovernment 
  • IndianArmySuccess 
  • IndianArmy 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS