• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘మతిస్థిమితం తప్పి...

‘మతిస్థిమితం తప్పి ఉంటే’... సీఎం వెకిలి చేష్టలపై విపక్షాలు ఫైర్!

| జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలనే విషయం స్కూలు పిల్లలకు కూడా తెలుస్తుంది! అయితే..

By - Tupaki Desk
Update: 2025-03-21 08:16 GMT

ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన విపరీత ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు! ఈ క్రమంలో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సమయంలో సీఎం నితీష్ పై అటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మతిస్థితిమితం తప్పిందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అవును... జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలనే విషయం స్కూలు పిల్లలకు కూడా తెలుస్తుంది! అయితే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో వెకిలిగా ప్రవర్తించారు నితీష్ కుమార్ అనే విమర్శలు ఇప్పుడు ఆయనను విపరీతంగా చుట్టుముడుతున్నాయి. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

తాజాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ తో తొలిసారిగా జరుగుతున్న సెపక్టక్రా ప్రపంచ కప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో జాతీయ గీతం ఆలపిస్తుండగా.. ఆయన ఓ అధికారి భుజం మీద తట్టి, అతనితో సంభాషించే ప్రయత్నం చేశారు! ఇదే సమయంలో.. గీతం ఆలపిస్తుండగానే నవ్వుతూ, ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ కనిపించారు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా... నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన తీరు తనను ఎంతో తీవ్రంగా సిగ్గుపడేలా చేసిందని.. నితీష్ కుమార్ చర్యలతో ప్రతీ బీహారీని సిగ్గుతో తల దించుకునేలా చేశారు.. దేశ చరిత్రలో ఓ సిట్టింగ్ సీఎం జాతీయ గీతాన్ని అగౌరవపరచడం ఇదే మొదటిసారి కావొచ్చు అని తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.

ఇదే సమయంలో... నితీష్ కు మతిస్థిమితం తప్పి ఉంటే.. ఆయన సీఎం కుర్చీ నుంచి దిగిపోయి, ఆయన కుమారుడిని సీఎంగా చేయాలని.. ఆయన అసెంబ్లీకి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 'తోలుబొమ్మ సీఎం రాజీనామా చేయాలి' అంటూ ఆర్జేడీ సభ్యులు అసెంబ్లీలో నిరసన తెలిపారు.

ఇదే క్రమంలో... జాతీయ గీతం ఆలపించే సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ మానసికంగా, శారీరకంగా బాగా కనిపించలేదని.. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గానే ఉందని మీరు భావించారా అని తాను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లను అడగాలనుకుంటున్నట్లు రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మీసా భారతి వ్యాఖ్యానించారు.

CM Nitish Kumar's Unusual Gestures During the National Anthem!

Bihar CM Nitish Kumar attended the opening ceremony of the #SepakTakraw World Cup, being held in the state for the first time.

During the rendition of the national anthem, Nitish Kumar was seen talking, offering… pic.twitter.com/WBcdDwYFuz

— Tupaki (@tupaki_official) March 21, 2025
Tags:    
  • NitishKumar 
  • BiharCM 
  • NationalAnthem 
  • Controversy 
  • IndianPolitics 
  • BiharNews 
  • PoliticalDrama 
  • TejaswiYadav 
  • RabriDevi 
  • MisaBharti 
  • SocialMedia 

Similar News

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS