అభ్యర్ధుల ఎంపికలో కొత్తపద్దతి

రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధుల ఎంపికలో కొత్తపద్దతిని అనుసరించబోతున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు.

Update: 2023-12-15 09:26 GMT

రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధుల ఎంపికలో కొత్తపద్దతిని అనుసరించబోతున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. ఎవరికీ తెలియకుండానే ఆశావహుల చరిత్రను సేకరించి అభ్యర్ధులను ఎంపిక చేస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయసేకరణ, వారి ఆమోదంతోనే అభ్యర్ధులను ఎంపికచేసి ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇపుడు తాను చెప్పిందంతా చాలా రహస్యంగా చేస్తానని ఎవరికి చెప్పనని కూడా చంద్రబాబు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్ధుల గెలుపు ముఖ్యంకాదని రాష్ట్రం గెలవాన్నదే తమ కొత్త నినాదమన్నారు.


జనసేనతో పొత్తున్న కారణంగా కేటాయించబోయే సీట్లు, నియోజకవర్గాల విషయమై జాగ్రత్తగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా చాలా కోణాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పనిలోపనిగా వైసీపీలో జరుగుతున్న మార్పులపైన చంద్రబాబు సెటైర్లు వేశారు. ఒక నియోజకవర్గంలో చెల్లని కాసు మరో నియోజకవర్గంలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. వైసీపీ ఓడిపోతే కానీ రాష్ట్రానికి మంచి జరగదని చంద్రబాబు తేల్చేశారు.

Read more!

జగన్లో ఓటమిభయం పెరిగిపోతున్న కారణంగానే 11 మందిని మార్చినట్లు ఎద్దేవా చేశారు. అయితే 150 మందిని మార్చినా వైసీపీ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. పరిపాలనలో జగన్ అన్నీ విషయాల్లోను ఫెయిలైనట్లు చంద్రబాబు తేల్చిచెప్పేశారు. జగన్ పాలనలో రాష్ట్రం బాగా ఇబ్బందులు పడుతోందని జనాలే మాట్లాడుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. అధికారులకు బదిలీలు ఉంటాయని తెలుసుకాని మంత్రులు, ఎంఎల్ఏలకు కూడా బదిలీలు ఉంటాయని ఇపుడే తెలుసుకున్నట్లు నవ్వుతు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ? జగన్ను తరిమికొడదామా అని జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు తాజాగా చెప్పిన కొత్తపద్దతి పైనే పార్టీలో చర్చలు మొదలయ్యాయి. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు అబిప్రాయసేకరణ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మొబైల్ ఫోన్ల ద్వారా జనాలకు ఫోన్లుచేసి, మెసేజులు పంపించి ఎంఎల్ఏ అభ్యర్ధిగా ఎవరైతే బాగుంటుందో చెప్పమని కొన్ని నియోజకవర్గాల్లో జనాలను అడిగారు. నెల్లూరు, గూడూరు నియోజకవర్గాల్లో ఇదే విషయమై గందరగోళం కూడా జరిగింది. తర్వాత ఆ పద్దతి నిలిపేశారు. ఇపుడు కొత్తపద్దతి అంటే ఏమిటో చంద్రబాబే చెప్పాలి

Tags:    

Similar News