రాష్ట్రపతి పోస్టులోకి చంద్రబాబు: లోకేష్ ఆన్సర్ ఇదే!
ఈ విషయంపై మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్‌ను ఓ యువతి ప్రశ్నించింది. సీఎం చంద్రబాబుకు రాష్ట్రపతి పోస్టు వస్తే.. మీరు ఎలా స్పందిస్తారని ఆమె ప్రశ్నించింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పదవీ కాలం వచ్చే ఏడాది జూలైతో ముగియనుంది. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీతో రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన విషయం తెలి సిందే. దీనికి వైసీపీ, టీడీపీలు కూడా మద్దతు తెలిపాయి. అయితే.. వచ్చే ఏడాది ఆమె రిటైర్మెంట్ కాను న్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రపతి పోస్టుకు సరైన అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు పేరు కూడా వినిపిస్తోందని కొందరు అంటున్నారు.
ఈ విషయంపై మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్‌ను ఓ యువతి ప్రశ్నించింది. సీఎం చంద్రబాబుకు రాష్ట్రపతి పోస్టు వస్తే.. మీరు ఎలా స్పందిస్తారని ఆమె ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. లోకేష్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుకు గతంలోనే అనేక ఆఫర్లు వచ్చాయని గుర్తు చేశారు. ఎన్డీయే తొలినాళ్లలో 1995లోనే ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత కూడా కేంద్రంలో పదవులు కూడా వచ్చాయని చెప్పారు.
కానీ, చంద్రబాబు అవసరం.. విజన్ వంటివి ఏపీ వంటి రాష్ట్రాలకు అవసరమని.. అందుకే ఆయన రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారని చెప్పారు. ఇప్పుడు కూడా అదే పంథాలో సీఎం చంద్రబాబు ఉన్నారని లోకేష్ చెప్పారు. ఏపీని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలన్నదే సీఎం చంద్రబాబు తప నగా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎలాంటి పదవులు ఆశించబోరని.. వచ్చినా కూడా సునిశితంగా వాటిని తిరస్కరిస్తారని చెప్పారు.
ముఖ్యంగా రాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధపదవి గొప్పదే అయినా.. ఆ పదవిని చంద్రబాబు ఎప్పుడూ ఆశించలేదన్నారు. నిరంతరం తెలుగు వారి కోసం.. తెలుగు రాష్ట్రాల కోసం పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు ముందు కీలక లక్ష్యాలు ఉన్నాయని, వాటిలో అమరావతి రాజధాని, పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులు సహా.. రాష్ట్రంలో భరీ ఎత్తున ఉపాధి కల్పించే పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఇతర విషయాలపై ఆయన ఆలోచన చేయరని వెల్లడించారు.