జగన్ కి జనాలు మార్కులు వేస్తున్నారు !
ఇక దేశంలో గుజరాత్ లో చూస్తే విపక్షం మూడు దశాబ్దాలుగా లేవలేకపోతోంది. ఎపుడూ అధికార పక్షం బీజేపీనే అక్కడ గెలుస్తోంది అంటే అందులో విపక్షం చేతగానితనం పాత్ర కూడా ఉందని అంటున్నారు.
అధికార పక్షానికే యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుందని అనుకోవడం పూర్వం రోజుల ముచ్చట. అధికార పార్టీ అయిదేళ్ళ పాలనకు విసిగి కినిసి జనాలు పొద్దు తిరుగుడు పువ్వు మాదిరిగా మూలన ఉన్న బలహీనంగా ఉన్న విపక్షాన్ని తెచ్చి అందలం ఎక్కిస్తారు అంటే అది పొరపాటే అని అంటున్నారు. గతంలో అయితే అది చెల్లుబాటు అయ్యేది కానీ సోషల్ మీడియా యుగంలో ప్రజలే అసలైన పాత్రికేయులుగా రాజకీయ విశ్లేషకులుగా మారిన తరంలో ఏ రాజకీయ పార్టీ పప్పులు అయితే అసలు ఉడకవు అని అంటున్నారు. అందువల్ల విపక్షం సరిగ్గా లేకపోతే మరిన్ని సార్లు ఉన్న చోటనే కూర్చోబెడుతున్న దాఖలాలు దేశంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయని గుర్తు చేస్తునాయి.
లేవలేకపోతున్నాయిగా :
ఇక దేశంలో గుజరాత్ లో చూస్తే విపక్షం మూడు దశాబ్దాలుగా లేవలేకపోతోంది. ఎపుడూ అధికార పక్షం బీజేపీనే అక్కడ గెలుస్తోంది అంటే అందులో విపక్షం చేతగానితనం పాత్ర కూడా ఉందని అంటున్నారు. మంచి ఆల్టర్నేషన్ ఉంటే కనుక జనాలు కచ్చితంగా తెచ్చి అధికారం అప్పగిస్తారు అని అంటున్నారు. ప్రజల విచక్షణ అది అని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అధికార పక్షం కంటే కూడా విపక్షం పనితీరు మరీ నాసిరకంగా ఉంటే మాత్రం గుజరాత్ మధ్యప్రదేశ్, బీహార్ హర్యానా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో రిపీట్ అయినట్లుగా అధికార పక్షానికే పవర్ దక్కుతుందని అంటున్నారు.
దేశంలో అదే తీరు :
ఇక దేశంలో వరుసగా మూడు సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే మోడీ సరిసాటి నాయకుడు విపక్ష శిబిరంలో లేకపోవడమే అని అంటున్నారు. మోడీకి ధీటుగా తమను తాము రుజువు చేసుకునే క్రమంలో ఇండియా కూటమి నాయకత్వం కొంత విఫలం అయింది అని అంటున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎంతో కొంత రాటు దేలారు. 2029 ఎన్నికల నాటికి ఆయన తన సామర్థ్యాన్ని గట్టిగా జనంలో ఉంచి చర్చకు తెర తీస్తే కచ్చితంగా అవకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు. లేకపోతే మాత్రం జనాల ఆలోచనలు విచక్షణతను కూడా అర్ధం చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
ఏపీ సంగతి ఏమిటి :
ఏపీలో చూస్తే విపక్షం వైసీపీ గడచిన రెండేళ్ళుగా నిర్వహించిన పాత్ర మీద అయితే జనాలు సంతోషంగా లేరని నివేదికలు సర్వేలు అంచనాలు అభిప్రాయాలు విశ్లేషణలు చెబుతున్నాయి. వైసీపీ అసలైన చట్టసభ వేదిక అయిన అసెంబ్లీని వదిలేసింది. ఇది నేల విడిచి సాము చేయడమే అని అంటున్నారు. పోనీ జనంలో అయినా వైసీపీ ఉందా అంటే అధినాయకత్వం పెద్దగా కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ పార్టీల అధినాయకులే ఈ రోజున నిరంతరం జనంలో ఉండేందుకు చూస్తున్నారు. అలాంటిది ఒక ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ తన పార్టీ నేతలతో క్యాడర్ తో మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహిస్తే జనాలు ఆ వైపు చూసే అవకాశం పెద్దగా ఉండదని అంటున్నారు.
రెండు రెళ్ళు నాలుగు కావు :
గణిత శాస్త్రంలో అయితే రెండు రెళ్ళు నాలుగు అని కచ్చితంగా జవాబు ఉంటుంది. రాజకీయ గణితంలో మాత్రం అలా జరగదని అంటున్నారు. రెండు రెళ్ళు ఆరు అయినా కావచ్చు, మూడు అయిన అవవచ్చు అని అంటున్నారు. ఏపీలో పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే ఒక ఎన్నికల్లో ఒక పార్టీ గెలిపించిన ప్రజలు మరో ఎన్నికల్లో ఇంకో పార్టీని గెలిపిస్తారు అని ఓల్డ్ సెంటిమెంట్ ని పట్టుకున్నా కుదిరేది కాదని అంటున్నారు. ఇలాంటి సెంటిమెంట్లు ఎన్నింటికో బ్రేకులు వేసిన చరిత్ర విచక్షణత జనాలకు ఉందని అంటున్నారు. ఏపీలో కూటమి కంటే ఏ విధంగా అయినా తాము మిన్న అని విపక్షం వైసీపీ జనాలకు చెప్పాల్సి ఉంటుంది. అలా కాకపోతే ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు తప్పించాలని జనాలు ఆల్ ఓవర్ గా డిసైడ్ అవుతారు అని అంటున్నారు. అందువల్ల వైసీపీ అయినా మరో ప్రతిపక్ష పార్టీ అయినా విపక్షంలో ఉండడమే తమకు అడ్వాంటేజ్ అనుకుంటే పొరపాటే అని నయా రాజకీయం చెబుతోంది. విపక్షంగా తమ బాధ్యతలను పూర్తిగా నెరవేర్చి జనంలో గ్రాఫ్ పెంచుకున్న పార్టీలకే జనాలు అందలం అందిస్తారు అన్నది వర్తమాన రాజకీయం రుజువు చేస్తున్న విషాంగా చెబుతున్నారు.