పాక్ బంగ్లా మచ్చికతో చైనా విచ్చుకత్తులు ...భారత్ అలెర్ట్ !

చైనాది ఎంతసేపూ భూభాగాల విస్తరణ దాహం అన్నది తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక పొరుగు దేశాలు కలిగిన దేశంగా చైనా రష్యాతో సమానంగా నిలిచింది.

Update: 2026-06-30 03:55 GMT

చైనాది ఎంతసేపూ భూభాగాల విస్తరణ దాహం అన్నది తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక పొరుగు దేశాలు కలిగిన దేశంగా చైనా రష్యాతో సమానంగా నిలిచింది. చైనా ఏకంగా 14 దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. చిత్రమేంటి అంటే ఇలా భూభాగం పంచుకున్న ప్రతీ దేశంలోని భూభాగాలను చైనా ఆక్రమించడం. భారత్ విషయంలో కూడా చైనా సరిహద్దుల వద్ద గొడవలు వివాదాలు తెలిసిందే. ఇక చైనా భారత్ కి పొరుగు దేశాలుగా ఉన్న పాకిస్థాన్ బంగ్లాదేశ్ లతో చేస్తున్న స్నేహాలు ఈ రోజున భారత్ కి రక్షణ రంగంలో పెను సవాళ్ళుగా మారుతున్నాయి.

పాక్ లో చైనా జలాంతర్గామి :

ఇదిలా ఉంటే ప్రధాన నావికాదళ ఆధునీకరణలో భాగంగా పాకిస్తాన్ చైనా నిర్మిత ఎనిమిది హంగోర్-తరగతి స్టెల్త్ జలాంతర్గాములలో మొదటిదైన పిఎన్ఎస్.హంగోర్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. చైనాతో పాక్ కి అయిదు బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం ప్రకారం నాలుగు జలాంతర్గాములను చైనాలో నిర్మించగా మిగిలిన నాలుగు కరాచీలో సాంకేతిక బదిలీ ద్వారా రూపొందుతాయి. బంగాళాఖాతంలో పాకిస్థాన్ అత్యాధునిక జలాంతర్గామి పీఎన్ఎస్ హ్యాంగోర్ ప్రస్తుతం సంచరిస్తున్న తీరు అయితే భారత్ అలెర్ట్ కావాల్సిన అవసరాన్ని తెలియచేస్తోంది. ఇక చైనా నిర్మించిన ఈ జలాంతర్గామి అనేక వారాలపాటు నీటి అడుగున ఉండగలదు అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థ వల్ల బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి పైకి రాకుండానే మూడు వారాల పాటు నీటి అడుగున ఉండగలదని చెబుతున్నారు.

బంగ్లాదేశ్ లో నేవల్ బేస్ :

ఇంకో వైపు బంగ్లాదేశ్‌లోనూ చైనా బీఎన్ఎస్ పెకువా నేవల్ బేస్ ని నిర్మించింది. దాంతో ఈ బేస్ అన్నది రానున్న కాలంలో పాక్, చైనా సబ్‌మెరైన్‌లకు అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ హబ్‌గా మారే ప్రమాదం ఉందని భారత రక్షణ దళం నిపుణులు చెబుతునారు. దీంతో ఒక్కసారిగా భారత్ భారత తూర్పు తీరంలో అతి పెద్ద ముప్పుగా ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. అంతే కాదు అనేక రకాలైన భద్రతాపరమైన సవాళ్లు కూడా పెరిగాయని అంటున్నార్జు.

బంగ్లాతో స్నేహం :

ఇక బంగ్లా దేశ్ లో 2024 తరువాత వేగంగా పరిణామాలు మారిపోయాయి. భారత్ అనుకూల వైఖరితో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దాంతో అటు పాక్ ఇటు చైనా బంగ్లా దేశ్ ని మచ్చిక చేసుకున్నాయి. ఇపుడు ఉత్తర బంగ్లాదేశ్‌లోని రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఒక పాత వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించడం లో చైనా సహాయపడి బంగ్లా మెప్పు పొందినిద్. అయితే ఈ స్థావరం భారత సరిహద్దుకు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అంతే కాదు భారతదేశంలోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్ కు ప్రమాదకరంగా ఇది దాపురించిందని అంటున్నారు.

భారత్ ఏమీ చేయలేదా :

ఈ క్రమంలో భారత్ పూర్తిగా అలెర్ట్ కావాల్సి ఉందని రక్షణ రంగం నిపుణులు చెబుతున్నారు. ఇక కీలకమైన బీఎన్ఎస్ పెకువా నేవల్ బేస్ కి చైనా పాకిస్థాన్ యుద్ధనౌకలు వస్తే భారత్ ఏమీ చేయలేదని, అందువల్ల వాటిని పర్యవేక్షించేందుకు అదనపు బలగాలను పెద్ద ఎత్తున మోహరించాల్సి వస్తుందని భారత నౌకాదళానికి చెందిన పేర్కొంటున్నారు. ఈ బీఎన్ఎస్ పెకువా నేవల్ బేస్ అన్నది చాలా వ్యూహాత్మకమైన చోట ఉందని అంటున్నారు. అండమాన్ నికోబార్ దీవులకు సుమారు వేయి కిలోమీటర్ల దూరంలో భారత తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం నుంచి కూడా దాదాపు అంతే దూరంలో ఉండటం గమనార్హంగా చెబుతున్నారు. బంగాళాఖాతంలో చైనా నౌకల కదలికలను ఎదుర్కోవడానికి భారత్ వద్ద ఇప్పటికే శక్తిమంతమైన నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ పొరుగు దేశాల స్థావరాలను ఉపయోగించుకుంటూ పాక్ చైనా జలాంతర్గాములు భారత్ కి చాలా సమీపంలోని రావడం మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన పెంచే వ్యవహారమే అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా భారత్ చేయాల్సింది చాలానే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News