దాయాది పాక్ ప్రేలాపనలు...ఆపరేషన్ సింధూరు గుర్తుందా ?

పాక్ తీరు లేస్తే మనిషిని కాను అన్నట్లుగానే ఉంటుంది. ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు ఎన్నింటిలో కూడా భారత్ చేతిలో చిత్తుగా ఓడినా పాక్ కి మాత్రం గుణపాఠం నేర్వడం తెలియడం లేదని అంటున్నారు.

Update: 2026-06-30 09:30 GMT

పాక్ తీరు లేస్తే మనిషిని కాను అన్నట్లుగానే ఉంటుంది. ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు ఎన్నింటిలో కూడా భారత్ చేతిలో చిత్తుగా ఓడినా పాక్ కి మాత్రం గుణపాఠం నేర్వడం తెలియడం లేదని అంటున్నారు. ఆ దేశ సైన్యం ప్రధాని నుంచి ప్రతీ మంత్రి వరకూ భారత్ మీద తెల్లారి లేస్తే విమర్శలతో విరుచుకుపడడం తమ పని అన్నట్లుగా ఉంటారు. అక్కడికి తామేదో అరవీర భయంకరమైనట్లు, భారత్ అతి చిన్నదేశం అయినట్లుగా కబుర్లు బాగా చెబుతారు.

ఈయన మాటలు వింటే కనుక :

లేటెస్ట్ గా చూస్తే పాక్ మంత్రి ఒకరు ఏకంగా భారత ప్రధానికే వార్నింగ్ ఇచ్చెశారు. నా నీళ్ళు అని సింధు జలాల గురించి అంటున్నారు. వాటి జోలికి వస్తే ఆ చేతులనే నరుకుతామని హెచ్చరిస్తున్నారు. పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ మాటలు అయితే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అంటున్నారు. తమ నీటి వాటా అంటూ అతిగా మాట్లాడుతున్నారు. సింధు నదీ జలాలలో తమకూ వాటా ఉందని పాక్ మంత్రి చెబుతున్న మాటలు అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం తప్ప నిజంగా అలా ఉందా అంటే అది పచ్చి అబద్ధం అని అంటున్నారు. భారత్ గుండా ప్రవహించే సింధు నదీ జలాలను పాక్ కి గొంతెండి పోకుండా అక్కడ వ్యవసాయం కోసం సాయం చేసే మానవత్వంతో నెహ్రూ జమానాలో కుదుర్చిన ఒప్పందం అది. అందులో మన కష్టం మన నిధులు మన సహకారం అన్నీ ఉంటే మూడొంతుల నీరు పాక్ హాయిగా సింధు నదీ జలాల నుంచి వాడుకుంటోంది.

నీరు రక్తం కలసి ఉండవు :

ఇక పహల్గాం లో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా భారత్ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపి వేసింది. అయితే దీని మీద పాక్ ప్రతీ సారీ మండిపడుతోంది. అయితే భారత్ ఈ విషయంలో ఒక్కటే చెబుతోంది. ఉగ్ర దాడిని ప్రోత్సహించమని పాక్ నుంచి ఒక్క మంచి మాట వచ్చినా తిరిగి ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంది. కానీ అసలు విషయం వదిలేసి భారత్ మీద ఊరకే రెచ్చిపోవడమే కాకుండా సింధు జలాలు మా హక్కు అని పాక్ పిచ్చి ప్రేలాపనలు పేలడం ఏమిటి అని అంటున్నారు. ఇక నదీ జలాలు అడ్డుకునే చేతులు నరుకుతామని పాక్ హెచ్చరికలు రెచ్చగొట్టుడు తప్పించి మంచిగా మసలుకునే ఆలోచనలు కావని అంటున్నారు.

దాహం అంటూనే :

ఒక వైపు గొంతెండుతోంది దాహం అని పాక్ కేకలు పెడుతోంది. ఇంకో వైపు పాకిస్థాన్ లో అధిక శాతం వ్యవసాయానికి ఈ నదీ జలాలే అవసరం అని అంటోంది. మరి ఇంతలా ఆధారపడిన పాక్ ఏ విధంగా భారత్ తో వ్యవహరించాలో తెలియదా అని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బ గుర్తుందా అని పాక్ మంత్రిని భారత్ నెటిజన్లు గట్టిగానే తగులుకుంటున్నారు. దాయాది తీరు మార్చుకోకుండా ఇలాగే ప్రేలాపనలు పేలితే మాత్రం ఫ్యూచర్ లో అసలు నీరు భారత్ నుంచి ఒక్క చుక్క కూడా ఆ వైపుగా ప్రవహించేది ఉండదని అంటున్నారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ రానున్న రెండేళ్లలో సింధు జలాలలో పూర్తి వాటాను భారత్ వాడుకుంటుందని ప్రకటించిన నేపథ్యం ఉంది. దాంతోనే పాక్ మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి మరీ గంగవెర్రులు ఎత్తుతున్న పరిస్థితిని అంతా చూస్తున్నారు.

Tags:    

Similar News