'మావిగన్' మారీచులకు ఆ హక్కులేదు: చంద్రబాబు
అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం పోతే మరో మాట మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. చేరువలో ఉన్న మంత్రులకు సోమవారం ఆయన విందు ఏర్పాటు చేశారు.
ఏపీ రాజధాని అమరావతిపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆది నుంచి అమరావతిపై విషం కక్కిన వైసీపీ నాయకులకు ఇప్పుడు రాజధాని రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని రైతులపై లాఠీలతో బూటు కాళ్లతో విరుచుకుపడినప్పుడు.. వారిని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం పోతే మరో మాట మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. చేరువలో ఉన్న మంత్రులకు సోమవారం ఆయన విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అమరావతిపై వైసీపీ చేస్తున్న కుట్రలను సీఎం ప్రస్తావించారు. మావిగన్ మారీచులకు అమరావతి గురించి మాట్లాడే హక్కులేదన్నారు. రాజధాని విషయంలో రైతులకు అండగా ఉంటా మంటూ ఇటీవల డ్రామాలు ఆడారని, ఉద్రిక్తతలు సృష్టించి,రాష్ట్రం శాంతి భద్రతల సమస్యలు వచ్చేలా చేయాలన్నదే వారి వ్యూ హమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటివాటిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యకు వెళ్లి వైసీపీ కుతంత్రాలను వివరించాలని మంత్రులకు సూచించారు. రాజధానిలో ఏమైందని పరామర్శలకు వచ్చారో తెలియడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదని, వారిని తాము ఒప్పించే ప్రయత్నంలో ఉన్నామని చంద్రబా బు అన్నారు. ఇది సహజంగానే జరుగుతుందన్నారు. అన్ని చోట్లా అందరూ ముందుకు రారని చెప్పారు. అలాంటి వారితో కలిసి వైసీపీ కుట్రలు చేస్తోందని, రాజధాని రైతులకు నాడు-నేడు టీడీపీ నాయకులే అండగా ఉన్నారని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా వారిని ఆదుకుంటుందని ఈ విషయాన్ని కూడా రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా వైసీపీని ఓ క్రిమినల్ పార్టీగా అభివర్ణించారు.
``ఎక్కడికి వెళ్లినా రౌడీలు, గూండాలు ఉండాల్సిందే. రౌడీలు లేకుండా వైసీపీ లేదు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలి`` అని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ప్రతి విషయాన్నీ ప్రజల ముందు పెట్టాలన్నారు. వైసీపీ నేరచరిత్రను కూడా ప్రజలకు వివరించాలన్నారు. తమ పార్టీకిచెందిన ఎమ్మెల్సీ శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు..జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని అప్పట్లో బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని సీఎం ప్రశ్నించారు. ఓ ఎంపీ న్యూడ్ వీడియోలతో చెలరేగిపోతే సమర్థించుకున్నారని.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీశారు. ఈ విషయాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.