తెలంగాణ‌లో ఆర్-ఆర్ ట్యాక్స్‌: బీజేపీ ఆరోప‌ణ‌

రాష్ట్రంలో ఒక్క‌రికి కూడా స‌రైన ఉపాధి లేద‌ని న‌బీన్ విమ‌ర్శించారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు.

Update: 2026-06-30 09:29 GMT

తెలంగాణ ఆర్-ఆర్‌(రేవంత్ రెడ్డి) ట్యాక్స్ వసూలు చేస్తున్నార‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ విమ‌ర్శించారు. కోట్ల రూపాయ‌ల సొమ్ములు బ‌లవంతంగా వ‌సూలు చేసి.. కాంగ్రెస్ పెద్ద‌ల రోజు వారీ ఖ‌ర్చు ల కోసం ఢిల్లీకి పంపిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ మోస‌పోతూనే ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అమాయ‌కులుగా అభివ‌ర్ణించిన న‌బీన్‌.. వారిని కాంగ్రెస్ స‌ర్కారు మోసం చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రంలో ఒక్క‌రికి కూడా స‌రైన ఉపాధి లేద‌ని న‌బీన్ విమ‌ర్శించారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. అయితే ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేద‌ని చెప్పారు. పేద‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నార‌ని పరోక్షంగా ఆయ‌న హైడ్రాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇవ‌న్నీ.. పెద్ద‌ల కోసం చేస్తున్న‌ప‌నులేన‌ని అన్నారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని న‌బీన్ చెప్పారు. కేంద్రంలో మోడీ.. రాష్ట్రం లో బీజేపీ ఉంటే డబుల్ ఇంజ‌న్ స‌ర్కారు ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగాలు ల‌భిస్తాయ ని.. గుజ‌రాత్ త‌ర‌హా మోడ‌ల్‌లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌లు మార్పు కోసం ఎదురు చూస్తున్నార‌ని తెలిపారు. ఆ మార్పు బీజేపీతోనే సాధ్య‌మ‌నిన‌మ్ముతున్నార‌ని అన్నారు. తాజాగా మంగ‌ళ‌వారం.. మ‌ల్కాజిగిరిలో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

ఈ మూడు ఒక్క‌టే

రాష్ట్రంలో కాంగ్రెస్‌-బీఆర్ ఎస్‌-ఎంఐఎం పార్టీలు ఒక్క‌టేన‌ని.. పేరుకే విడివిడిగా ఉన్నా.. ఆ మూడు పార్టీ లూ క‌లిసే ఉన్నాయ‌ని.. ఒక‌రినొక‌రు కాపాడుకుంటున్నార‌ని నితిన్‌న‌బీన్ ఆరోపించారు. కానీ.. ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నార‌ని.. వీటిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన బాధ్య‌త బీజేపీ నాయ‌కుల‌పైనే ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి తీసుకురావాల‌ని.. ఈ క్ర‌మంలో కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని నాయ‌కుల‌కు సూచించారు. కాగా.. వ‌రుస‌గా మూడో రోజు కూడా తెలంగాణ‌లోనే న‌బీన్ ప‌ర్య‌టించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News