రాజకీయం లేదు.. పోటీ అంతకన్నా లేదు.. లారెన్స్ యూటర్న్!

ముఖ్యమంత్రి దళపతి విజయ్ కి అత్యంత సన్నిహితుడిగా లారెన్స్ ను చెబుతారు. తిరుచ్చి నుంచి పోటీ చేసి డిప్యూటీ సీఎం అవుతారని లారెన్స్ అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తించారు.

Update: 2026-06-30 08:30 GMT

ప్రముఖ నటుడు, కొరియా గ్రాఫర్ లారెన్స్ రాజకీయ ప్రవేశం వాయిదా పడింది. తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నా, ప్రస్తుతం పోటీ చేయాలనే ఆలోచన లేదని లారెన్స్ తాజాగా ప్రకటించారు. లారెన్స్ రాజకీయ ప్రవేశంపై జూన్ 11న అధికారిక ప్రకటన ఉంటుందని ముందుగా చెప్పారు. కానీ, ఏ కారణం వల్లనో ఆ ప్రకటన వాయిదా వేశారు. ముఖ్యమంత్రి దళపతి విజయ్ కి అత్యంత సన్నిహితుడిగా లారెన్స్ ను చెబుతారు. తిరుచ్చి నుంచి పోటీ చేసి డిప్యూటీ సీఎం అవుతారని లారెన్స్ అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తించారు.

తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. టీవీకే అభ్యర్థిగా తిరుచ్చి నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని లారెన్స్ తేల్చిచెప్పారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయిందని అంటున్నారు. ముఖ్యమంత్రి దళపతి విజయ్ కి అత్యంత సన్నిహితుడైన లారెన్స్ రాజకీయాల్లోకి వస్తారని రెండు నెలలుగా విస్తృత ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే అభ్యర్థిగా లారెన్స్ కి అవకాశం వస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి విజయ్ స్టైల్ లోనే లారెన్స్ కూడా నల్లటి సూటులో ఉన్నట్లు ఏఐ ఫొటోలు సృష్టించి కాబోయే ఉప ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. దీంతో లారెన్స్ రాజకీయ ప్రవేశంపై జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ విషయమై అధికారికంగా స్పందించని లారెన్స్ అనూహ్యంగా పోటీ చేయడం లేదంటూ స్పష్టత ఇచ్చి అందరినీ నిరాశకు గురిచేశారని అంటున్నారు.

తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై లారెన్స్ స్వయంగా స్పందిస్తూ, ప్రస్తుతానికి తాను ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో లేనని స్పష్టం చేశారు. రాజకీయాల పట్ల తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించినప్పటికీ, ప్రజా సేవ చేయడానికి రాజకీయ అధికారం లేదా పదవి తప్పనిసరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, వృత్తిపరమైన బాధ్యతలే తన ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండటమనేది ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News