20 సీట్లపై పవన్ కు ఒక ప్రశ్న, ఒక సలహా... ముద్రగడ సంచలన వ్యాఖ్యలు!

అవును... తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సొదరుల ఆత్మీయ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే

Update: 2024-04-06 12:26 GMT

పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ అని ప్రకటించినప్పటి నుంచీ ముద్రగడ పద్మనాభం మరీ వెంటాడుతున్నారని అంటున్న నేపథ్యంలో... తాజాగా మరోసారి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా 20 సీట్ల ప్రస్థావన తెచ్చిన ఆయన... ఆ 20 సీట్లకు సంబంధించి రెండు విషయాలు వెల్లడించారు. ఇందులో ఒకటి ప్రశ్న కాగా.. మరొకటి సలహా కావడం గమనార్హం.

అవును... తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సొదరుల ఆత్మీయ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ముద్రగడ పత్మనాభంతో పాటు మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఉమాబాల ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తనపై క్లబ్ లు నడిపేవారితో పవన్ కల్యాణ్ తిట్టిస్తున్నారని.. తనకు 5, 10 రూపాయలు ఎంవోలు చేసి అవమానిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారి స్థాయి 5, 10 రూపాయలేనా అని ఎద్దేవా చేసిన ముద్రగడ... రోజూ వందేసి మంది కలిపి తలో లక్షా ఎంవోయూలు చేయాలని.. ఖర్చులకు ఉపయోగపడతాయని వెల్లడించారు.

ఇలా తెరవెనుక ఉండి మాట్లాడటం మగతనం కాదని చెప్పిన ముద్రగడ.. పవన్ కు ఎన్నిసార్లు చెప్పినా పౌరుషమే రావడం లేదని.. ఆయనకు ధమ్మూ ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి నేరుగా తనను విమర్శించాలని.. అప్పుడు తాను ప్రతీ విమర్శకూ సమాధానం చెబుతానని అన్నారు. ఇదే సమయంలో.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారో సమాధానం చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు.

Read more!

ఈ సందర్భంగా... 20 సీట్ల ప్రస్థావన తెచ్చిన ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పవన్ కూటమిలో భాగంగా తీసుకున్న 20 సీట్లతో సీఎం అయిపోతారా అని ప్రశ్నించిన ఆయన... ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి పార్టీని మూసేయడం మంచిదని.. తదనంతరం షూటింగ్ లకు వెళ్లిపోతే త్యాగశీలిగా మిగిలిపోతారని ముద్రగడ సలహా ఇచ్చారు. కేవలం చంద్రబాబు ఎస్టేట్ ను కాపాడేందుకే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉంటున్నాడని తెలిపారు.

మరోపక్క ముద్రగడ పద్మనాభంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశంసల జల్లులు కురిపించారు. ఇందులో భాగంగా... ముద్రగడ జీవితం కొవ్వొత్తి అని, తాను కరిగిపోతూ ఎంతోమందికి వెలుగు ఇచ్చారని పేర్కొన్నారు. ఇదే సమయంలో... కొంతమంది కాపులను అడ్డుపెట్టుకుని పైకి రావడానికి చూస్తున్నారని కానీ... తనజాతి పైకి రావడం కోసమే ముద్రగడ ఆలోచిస్తారని పేర్కొన్నారు. కాపుల సహకారం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు!

Tags:    

Similar News