• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నువ్వు గొప్పోడివి సామీ.....

నువ్వు గొప్పోడివి సామీ.. భార్య కోసం మరో తాజ్ మహల్ కట్టిన భర్త

| ప్రేమకు ప్రతీకగా నిలిచే తాజ్ మహల్ ను తలపించేలా ఓ భర్త తన భార్య కోసం ఇంటిని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

By - Tupaki Desk
Update: 2025-06-16 22:30 GMT

ప్రేమకు ప్రతీకగా నిలిచే తాజ్ మహల్ ను తలపించేలా ఓ భర్త తన భార్య కోసం ఇంటిని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆనంద్ ప్రకాశ్ చౌక్సే అనే వ్యక్తి తన జీవిత భాగస్వామికి వినూత్నమైన కానుకను ఇచ్చాడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్ మహల్ నమూనాలో 4 BHK విల్లాను నిర్మించి భార్యకు అందించాడు. ఈ విశేషం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

-పాలరాయితో తయారు చేసిన తాజ్ మహల్ హౌస్

బుర్హాన్ పూర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ ప్రకాశ్ తన స్వంత పాఠశాల ప్రాంగణంలో తాజ్ మహల్ నమూనాలో ఇంటిని నిర్మించారు. అసలైన తాజ్ మహల్ లో వాడిన మక్రానా పాలరాయిని ఈ ఇంటి నిర్మాణానికి కూడా ఉపయోగించడం విశేషం. దీని డిజైన్, డోమ్స్, పిల్లర్లు, మిండోలు అన్నీ నిజమైన తాజ్ మహల్ ని తలపించేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- ఆగ్రా తాజ్ మహల్ కంటే పరిమాణం తక్కువ

ఈ ఇంటి పరిమాణం ఒరిజినల్ తాజ్ మహల్ కన్నా మూడింట ఒక వంతు మాత్రమే. అయినప్పటికీ దీని శిల్పకళ, నిర్మాణ శైలి అచ్చంగా ఆగ్రా తాజ్ మహల్ ను పోలి ఉంటుంది. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించడం విశేషం. ఇంటి నిర్మాణానికి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆనంద్ ప్రకాశ్ పేర్కొన్నారు.

- వైరల్ వీడియోలు.. లైక్స్, షేర్ల మోత

ఈ ఇంటికి సంబంధించిన వీడియోలను ప్రియం సామ్రాట్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో అది తెగ వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోకు 71 లక్షల లైక్స్, 51 లక్షల షేర్లు రావడం విశేషం. ఈ ఇంటిని చూసిన నెటిజన్లు "వావ్.. అద్భుతం!", "ఇది నిజంగా మినీ తాజ్ మహల్!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- నా భార్య ప్రేమకు ఈ ఇల్లు ప్రతిరూపం

"తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం. నా భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తీకరించేందుకు ఇదే సరైన మార్గమని భావించాను. అందుకే ఆమె కోసం తాజ్ మహల్ నమూనాలో ఇంటిని నిర్మించాను" అని ఆనంద్ ప్రకాశ్ ఆనందంగా వెల్లడించారు. ఆయన చేసిన ఈ వినూత్న ప్రయత్నం నెట్టింట ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

మొత్తంగా భార్యపై భర్త చూపిన ఈ అపురూప ప్రేమకు తాజ్ మహల్ హౌస్ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇది ప్రేమకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చినట్టే అని అందరూ అభిప్రాయపడుతున్నారు.

Tags:    
  • MiniTajMahal 
  • LoveSymbol 
  • TajForWife 
  • ViralLoveStory 
  • IncredibleIndia 
  • TajMahalHouse 
  • GiftOfLove 
  • ArchitecturalWonder 
  • MPLoveStory 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS