ఇండియా కూటమి : నాలుక మడతేసిన మమత !

‘‘నేను ఇండియా కూటమిలోనే ఉన్నాను. అయితే బెంగాల్లో మాత్రం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో పొత్తు లేదు.

Update: 2024-05-17 07:34 GMT

‘‘నేను ఇండియా కూటమిలోనే ఉన్నాను. అయితే బెంగాల్లో మాత్రం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో పొత్తు లేదు. ఎన్నికల తర్వాత ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే బయటనుండి మా మద్దతు ఉంటుంది’’ అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారీతీశాయి.

ఇండియా కూటమి విషయంలో రచ్చ రచ్చ చేసి బయటకు వచ్చి కూటమి లేదంటూ ప్రకటించిన మమత అనూహ్యంగా యూటర్న్ తీసుకోవడం విశేషం. బెంగాల్ లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పార్టీల ఓట్లు తమ పార్టీ అభ్యర్థుల వైపు మళ్లేందుకే మమతా ఈ వ్యాఖ్యలు చేసిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఆమె కూటమిలో ఉన్నట్లా ? లేనట్లా ? అన్న చర్చ కూడా నడుస్తున్నది.

మమతా బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి స్పందించాడు. ‘‘కూటమికి బయట నుంచి లేదా లోపలి నుంచి మద్దతు ఇచ్చి మమత ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. మేము ఆమెను నమ్మము. ఆమె స్వయంగా కూటమిని వీడారు. ఇప్పుడామే బీజేపీ వైపు కూడా వెళ్లొచ్చు. ఇండియా కూటమిపై ఆమెకు ఏవైనా అనుమానాలు ఉంటే ముందే చెప్పాల్సింది’’ అని అన్నారు.

70 శాతం స్థానాలలో ఎన్నికలు ముగిశాక మమత తీరులో మార్పు వచ్చిందని, ఈ పరిణామాలను బట్టి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న విషయం అర్ధం అవుతుందని అధీర్ రంజన్ చౌదరి అభిప్రాయపడ్డాడు. అయితే ‘‘ఇండియా కూటమి పుట్టిందే నా ఆలోచనల నుండి. జాతీయ స్థాయిలో కలిసే ఉన్నాం. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్, సీపీఎంలతో ఎలాంటి పొత్తు లేదు’’ అని మమతా బెనర్జీ ప్రకటించడం గమనార్హం.

Tags:    

Similar News