• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చక్రం తిప్పుతున్న ఎంపీ...

చక్రం తిప్పుతున్న ఎంపీ లావు.. టీడీపీలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

| తెలుగుదేశం పార్టీలో చేరిన నుంచి ఎంపీ లావు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయనను బాగా ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2025-06-22 23:30 GMT

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీని ఖాళీ చేయించేలా వ్యూహం రచిస్తున్నారు నరసారావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి రెండోసారి ఎంపీగా గెలిచిన లావు.. గతంలో తనకు సన్నిహితంగా మెలిగిన వారిని టీడీపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్, మక్కిన మల్లికార్జునరావును వైసీపీ నుంచి టీడీపీలోకి తెచ్చారు ఎంపీ లావు. జంగా, మక్కెన ఎన్నికలకు ముందే వైసీపీని వీడగా, కొద్ది నెలల క్రితం మర్రిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుపై లావు ఫోకస్ పెట్టారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో చేరిన నుంచి ఎంపీ లావు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయనను బాగా ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అధిష్టానం వద్ద తన పరపతిని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో వైసీపీని టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో తాను ఉండగా సన్నిహితంగా మెలిగిన నేతలు అందరినీ క్రమంగా టీడీపీలోకి తెచ్చేలా ఎంపీ పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.

2014లో తొలిసారి నరసారావుపేట పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయులు అప్పటి సీఎం జగన్ తో మంచి సంబంధాలే ఉండేవని చెప్పేవారు. కానీ, అప్పటి మంత్రి విడదల రజినితోపాటు కొందరు వైసీపీ నేతలతో ఎంపీకి పొసిగేది కాదని ప్రచారం ఉంది. దీంతో వైసీపీలో లావు ప్రత్యేక వర్గం ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో జగన్ తో తెగతెంపులు చేసుకున్న లావు వైసీపీలో తన వర్గాన్ని టీడీపీలోకి తెచ్చారు. అయితే కొందరు టికెట్ దక్కదనే ఆలోచనతో అప్పట్లో వైసీపీలోనే ఉండిపోగా, ప్రస్తుతం వారు కూడా టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.

మరోవైపు వైసీపీలో కమ్మ సామాజికవర్గం నేతలు ఉండకూడదా? అంటూ ఈ మధ్య పల్నాడు పర్యటనలో మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా గతంలో తనకు ఎదురైన అవమానాలు మళ్లీ కమ్మ సామాజికవర్గం నేతలకు ఎదురుకాకూడదన్నట్లు ఎంపీ భావిస్తున్నారని, వైసీపీలో కమ్మ సామాజికవర్గ నేతలు అందరితో చర్చించి, తాను అండగా ఉంటానని వైసీపీని వీడి రావాలని పిలుపునిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ ప్రయత్నాలను టీడీపీలో సిట్టింగు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శంకరరావు పార్టీలోకి వస్తే తన సంగతి ఏంటని సిట్టింగ్ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఎంపీ లావు ఎత్తుగడులు ఆసక్తికరంగా మారాయని అంటున్నారు.

Tags:    
  • LavuSriKrishnaDevarayalu 
  • TDP 
  • YCP 
  • GunturPolitics 
  • Palnadu 
  • AndhraPolitics 
  • ChandrababuNaidu 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS