• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుమారస్వామి అభయంతో...

కుమారస్వామి అభయంతో ఆగుతుందా ?

| ఆయన మొత్తం ప్లాంట్ లోని కీలక విభాగాలను అన్నింటినీ తనిఖీ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-12-02 20:30 GMT

కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు. ఆయన మొత్తం ప్లాంట్ లోని కీలక విభాగాలను అన్నింటినీ తనిఖీ చేశారు. ప్లాంట్ కి ఫ్యూచర్ ఉందని అన్నారు. లాభాల బాట పట్టిస్తామని అన్నారు. ప్రైవేట్ పరం చేయకుండా చూస్తాను అని హామీ ఇచ్చారు.

ఇది జరిగి అయిదు నెలలు గడుస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్న మీద స్పష్టమైన ప్రకటన అయితే లేదు. దాంతో పాటుగా జోరుగా ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని ఉక్కు ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కార్మిక నేతలు అంతా విమర్శిస్తున్నారు.

లేటెస్ట్ గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో ఏపీకి చెందిన అధికార విపక్షాలు విశాఖ ఉక్కు విషయంలో తాము మాట్లాడుతామని అంటున్నారు. వీరంతా ఉక్కు మంత్రి కుమారస్వామిని కలసి వినతిపత్రాలు ఇస్తున్నారు. ఆయన కూడా విశాఖ ఉక్కు విషయంలో తాను సానుకూలంగా ఉన్నానని కుమారస్వామి చెబుతున్నారు. వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో విశాఖ ఉక్కుని లాభాల బాటలో పెట్టే విషయంలో తన ప్రతిపాదనలు పెడతాను అన్నారు.

టీడీపీ ఎంపీలు అయినా వైసీపీ ఎంపీలు అయినా కుమారస్వామిని కలుస్తున్నారు ఆయన సంబంధిత శాఖ మంత్రి కాబట్టి కలవడంలో తప్పు లేదు కానీ ఏపీకి చెందిన మొత్తం పాతిక మంది లోక్ సభ ఎంపీలు ఏడుగురు రాజ్యసభ సభ్యులు అందరూ ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలసి ఉక్కు కర్మాగారం విషయంలో ప్రైవేట్ పరం చేయవద్దు అని గట్టిగా చెప్పవచ్చు కదా అన్న మాట అయితే వినిపిస్తోంది.

విశాఖ ఉక్కు విషయంలో ప్రధాని స్థాయిలోనే పరిష్కారం ఉంటుందని వామపక్ష నేతలు అంటున్నారు. కేంద్రం అయితే 2021లోనే దీని మీద విధానపరమైన డెసిషన్ ని ప్రకటించింది. దాని ప్రకారమే ముందుకు పోతోంది. ఇపుడు మళ్లీ వెనక్కి తీసుకోవాలంటే ప్రధాని మోడీ నుంచి భేటీ వేస్తేనే జరిగే పని అంటున్నారు. లేకపోతే కూటమి ఎంపీలు అయినా వైసీపీ ఎంపీలు అయినా ఉక్కు విషయంలో చేసేది మొక్కుబడి పోరాటమే అని అంటున్నారు.

Tags:    
  • UnionMinisterofSteel 
  • Kumaraswamy 
  • VisakhapatnamSteelplant 
  • Steelplant 
  • Privatizationofplant 
  • Parliamentsession 
  • Visakhapatnamsteelissues 
  • UnionCabinetMeeting 
  • TdpMp 
  • YcpMp 
  • LoksabhaMps 
  • RajyasabhaMps 
  • Primeminister 
  • NarendraModi 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS