రోజాపై కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు... డిపాజిట్లు రావంటూ జోస్యం!

ఈ సందర్భంగా తాజాగా కిరాక్ ఆర్పీ.. మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-09 00:30 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వాతావరణం తీవ్రంగా వేడెక్కిపోతుంది. ఇందులో భాగంగా వ్యక్తుల మధ్య బంధాలు, సంబంధాల నడుమ రాజకీయ పార్టీల వారీగా విడిపోయి చేసుకుంటున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజాపై జబర్ధస్ట్ మాజీ, ప్రస్తుత నటీనటులు చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తున్న రియాక్షన్ లు వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా కిరాక్ ఆర్పీ.. మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూటమి తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో జబర్ధస్త్ ప్రస్తుత, మాజీ నటీ నటులతో పాటు పలువురు సీరియల్ నటులు, పవన్ కల్యాణ్ కుటుంబంలోని నటీనటులు కొంతమంది ఆయన తరుపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన రోజా... పాపం వాళ్లు చిన్న ఆర్టిస్టులు.. వారికి సినిమాల్లో అవకాశాలు పోకుండా ఉండటం కోసం పడుతున్న తపనలో భాగంగా ఈ ప్రచారానికి వస్తున్నారు అంతే అని వ్యాఖ్యానించారు.

Read more!

దీనిపై స్పందించిన గెటప్ శ్రీను... తమకు అవకాశాలు రాకుండా మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఎఫెక్ట్ లేదని, తామంతా స్వచ్చందంగానే పవన్ కోసం ప్రచారం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఇదే విషయంపై స్పందించిన కిర్రాక్ ఆర్పీ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... తమను గౌరవిస్తే, తాము కూడా రోజాగారు అంటామని.. అలా కానిపక్షంలో రోజా అని ఏకవచనంతోనే పిలుస్తామని అన్నారు.

ఇదే సమయంలో తమను చిన్న చిన్న అర్టిస్టులు అంటున్న రోజా ఏమైనా నేషనల్ వైడ్ ఆర్టిస్టా, ఆస్కార్ అవార్డులు సాధించిన నటా అని అన్నారు. ఈ సందర్భంగా... "గెటప్ శ్రీను చేయగలిగిన క్యారెక్టర్ లలో నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా..? నీకంటే సుధీర్ కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది!.. అతనితో నువ్వు పోటీ పడగలవా..? ఆది గంటసేపు నవ్వించగలడు, అతనితో నువ్వు పోటీ పడగలవా?" అని రోజాని కిర్రాక్ ఆర్పీ ప్రశ్నించడం గమనార్హం.

ఇదే క్రమంలో... ఈసారి ఎమ్మెల్యేలో మొట్టమొదటిసారిగా ఓడిపోబోయేది నగరిలో రోజా అని, ఆమెకు ఈదఫా డిపాజిట్లు కూడా రావని ఆర్పీ జోస్యం చెప్పారు. ఇదే సమయంలో ఏడు మంది హీరోలు మెగా ఫ్యామిలీలో ఉంటే.. 70 మంది రౌడీలు రోజా అన్న వెనుక ఉన్నారంటూ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ వ్యాఖ్యలపై రోజా ఇప్పుడు స్పందిస్తారా.. ఎలక్షన్ తర్వాత స్పందిస్తారా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News