• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్యూరోక్రాట్స్ హిట్...

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

| బ్యూరోక్రాట్స్ అంటే నాలుగు గోడల మధ్య ఏసీ గదిలో కూర్చుని పనిచేస్తారు.

By - Satya P
Update: 2026-11-04 18:30 GMT

బ్యూరోక్రాట్స్ అంటే నాలుగు గోడల మధ్య ఏసీ గదిలో కూర్చుని పనిచేస్తారు. వారు పాలకుల నిర్ణయాలను అమలు చేసేవారు మాత్రమే. అందులో కూడా తమ సొంత టాలెంట్ ని బయట పెట్టుకుని గొప్పగా రాణించిన సివిల్ సర్వెంట్స్ ఎంతో మంది ఉన్నారు. అలా వారికి పదవుల కంటే కూడా ఎంతో కొంత అదనంగా పేరు వస్తుంది. అదంతా వారు ఆ పోస్టులలో ఉన్నంతవరకే. ఆ పదవి పోగానే వారు కూడా సగటు జనంలో భాగం అవుతారు. అయితే అందరిలాగానే వారికి కూడా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి రావాలని కోరికలు ఉంటాయి. అందులో తప్పు లేదు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. కానీ ఇక్కడే బ్యూరోక్రాట్స్ తమను తాము ఎక్కువ ఊహించుకుంటున్నారు. తాము నిర్వహించిన పదవులు స్టేట్ లెవెల్ వి కాబట్టి తాము కచ్చితంగా జనంలోకి వస్తే ఉన్నత పదవులతో జనాలు గౌరవిస్తారు అని ఆలోచిస్తున్నారు. అక్కడే వారు తప్పులో కాలు వేస్తున్నారు అన్నది ఒక కఠినమైన విశ్లేషణ.

జనం నాడి తెలియకనే :

బ్యూరోక్రాట్స్ ఎంతసేపూ అధికార పరిధిలో ఆలోచనలు చేస్తారు, వారు నిర్ణయాలు కూడా ప్రభుత్వాల విధానాలను బట్టి మాత్రమే ఉంటాయి. అందులో వారు ఎంత సమర్ధులు అయినా పాలనలో ఎంత విశిష్టులు అయినా కూడా ప్రజా ప్రతినిధిగా జనంలోకి రావాలంటే అది ఏ మాత్రం అర్హత కాదని అనేక మంది గుర్తించలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. జనం నాడిని పట్టుకోవడం వేరు, వారితో మమేకం అయినప్పుడు మాత్రమే ఎవరి రాజకీయం అయినా పండుతుంది అన్నది వాస్తవం. అది రాజకీయ నాయకుల విషయంలో చూస్తే సక్సెస్ రేటుగా ఉంటుంది. బ్యూరోక్రాట్లు అందుకే రాజకీయంగా నెగ్గలేకపోతున్నారు అని అంటున్నారు. జనం ఏమనుకుంటున్నారు, వారి ఆలోచనలు ఏమిటి, వారి మనోభావాలు ఎలా ఉన్నాయని గుర్తించడంతో విఫలం కావడం వల్లనే రాజకీయం వారికి అందని పండుగా మారిపోతోంది అని అంటున్నారు.

బురదలో తిరిగితేనే :

రాజకీయం అంటే భవంతులలో ఉండదు, బురదలో ఉంటుంది. పేదల లోగిళ్లలో ఉంటుంది. వారి సమస్యలలో ఉంటుంది. దానిని పట్టుకోవాలి. బురదలో పొర్లాడుతూ సగటు జనంతో కలిసిపోవాలి. వారికి అండగా దండగా తాము ఉన్నామని ఒప్పించగలగాలి. మెప్పించగలగాలి. అంతే తప్ప పేదరికం ఎలా పోతుంది అన్నది వైట్ పేపర్ మీద థిసీస్ రాసినంత మాత్రానో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినంత మాత్రానో తమకు బీదల గురించి తెలుసు అనుకుంటే పొరపాటే అవుతుంది. మంచి పాలసీలు గురించి ఎంతటి బ్యూరోక్రాట్ అయినా అనర్గళంగా చెప్పగలరు, కానీ అదే ప్రాక్టికల్ గా అమలు చేయడంలో కష్ట నష్టాలు మాత్రం వారికి తెలియవని అంటున్నారు.

కేజ్రీవాల్ మాత్రమే :

ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ జనంలో ఉంటూ ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచారు. ఆయన అందుకే ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఏకంగా పన్నెండేళ్ళ పాటు పనిచేశారు. తన ఆప్ పార్టీని పంజాబ్ లో కూడా అధికారానికి తేగలిగారు. అలాగే గుజరాత్, యూపీ, గోవా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంతో కొంత పోటీ ఇస్తున్నారు. ఆయన సామాన్య జనంతో కలిసిపోయారు. వారి నాడి పట్టుకున్నారు. వారి గొంతుక అయ్యారు, మధ్యతరగతి వర్గాలకు ఆశగా మారారు. వారి సమస్యలను టచ్ చేశారు. అందుకే విక్టరీ కొట్టారు. మరి ఆయనలా సొంత పార్టీ పెట్టి రాజకీయంగా హిట్ అవుదామనుకుంటే అందరి వల్ల అయ్యేది కాదు, ముందే చెప్పినట్లుగా బ్యూరోక్రాట్స్ బడుగు జనంతో అడుగులు వేయకుండా ఎప్పటికీ లక్ష్యాలను చేరుకోలేరు అని రెండు తెలుగు రాష్ట్రాలలో ఫెయిల్ అయిన ఎందరో బ్యూరోక్రాట్ల పొలిటికల్ హిస్టరీ చెబుతోంది. రాజకీయాల్లోకి రావాలంటే తమకు ముందే చేసిన పదవితో వచ్చిన పేరుతో పార్టీ పెట్టడం కాదు, జనం వద్దకు ముందు వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలి. ఆ మీదట మాత్రమే అడుగులు వేయాలి. ఈ సూత్రం విస్మరించి నేల విడిచి సాము చేస్తే భంగపాటు తప్పదు.

Tags:    
  • bureaucrats 
  • indianpolitics 
  • civilservants 
  • arvindkejriwal 
  • politicalanalysis 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS