• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్‌కు షర్మిల...

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

| వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్‌పై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తూ, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వెనుకబడుతున్నారనే చర్చ సాగుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం షర్మిల ముందున్న ప్రధాన సవాలుగా మారింది.

By - Satya P
Update: 2026-11-05 07:29 GMT

కాంగ్రెస్ పెద్దలు గమనిస్తున్నారో లేదో కానీ ఏపీలో కాంగ్రే పూర్తిగా వట్టిపోయింది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్ధులు పోటీ చేయడానికి ముందుకు వచ్చినా పట్టించుకునే వారే లేరని వాపోతున్న నేపథ్యం ఉంది. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న భావన ఉంది. ఆమె స్థానిక ఎన్నికల వేళ కనీసం పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంతసేపూ ఆమె తన అన్న జగన్ ని విమర్శించేందుకే పరిమితం అవుతున్నారు అన్నది కూడా ఉంది. రాజకీయాలో రక్త సంబంధాలకు తావు లేదు, అయితే వైసీపీ అధినేతగా మాజీ సీఎం గా ఆయన్ని విమర్శించడం లేదు, సొంత వ్యవహారాల మీదనే ఆమె విమర్శలు చేస్తున్నారు అన్నది మాత్రం చర్చగా ఉంది.

ఆమె వల్ల లాభమేంటి :

రెండేళ్ల క్రితం ఏపీ కాంగ్రెస్ కి అధినేతగా షర్మిలను తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో పార్టీకి ఏమైనా మేలు జరిగిందా అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. వైఎస్సార్ కూతురు అన్న కారణంగానే ఆమెకు ఈ పదవి దక్కింది. కానీ ఆమె మాత్రం కాంగ్రెస్ ని ఏ విధంగానూ బలోపేతం చేయలేకపోయారు అన్నది నిశితమైన విమర్శగా ఉంది. ఆమె జగన్ ని టార్గెట్ చేస్తోంది. అది మీడియాలో వస్తోంది. ఆ హైప్ తోనే చాలు అనుకుంటే కాంగ్రెస్ పెద్దలు ఏపీ వైపు చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎంతసేపూ వ్యక్తిగత విమర్శలకు ఆమె ప్రాధాన్యత ఇస్తారు అన్నది కూడా కాంగ్రెస్ లోనూ జనంలో ఉన్న భావనగా కనిపిస్తోంది.

ఎన్డీయేకు వ్యతిరేకంగా :

కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎన్డీయేకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తోంది. మరి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఊపిరి ఇస్తున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి మీద ఏపీలో కాంగ్రెస్ ఎంతలా పోరాడాలి. మచ్చుకైనా అది కనిపిస్తోందా అంటే లేనే లేదు అన్నదే జవాబుగా వస్తోంది. కాంగ్రెస్ అంటేనే దానికి ప్రత్యేకమైన రాజకీయ సిద్ధాంతం ఉంది. మరి దానికి ఏపీలో ఏ మేరకు షర్మిల తీసుకుని వెళ్తున్నారు అన్నది మరో ప్రశ్న. షర్మిల మాత్రం ఏపీలో కూటమి మీద విమర్శలు చేయడం కంటే జగన్ ని టార్గెట్ చేయడం మీదనే ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. నిజానికి జగన్, షర్మిల మధ్య వ్యక్తిగత కుటుంబ సంబంధిత వివాదాలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవే ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి కూడా హైలెట్ అవుతున్నాయి. ఆ పార్టీ అజెండా అదే అన్నట్లుగా సెట్ చేసేశారు.

కాంగ్రెస్ పట్ల ప్రేమతోనా :

ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. షర్మిల కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారా లేక కుటుంబ విభేదాలతో అన్న జగన్ కి వ్యతిరేకంగా రాజకీయంగా ఎదుర్కోవాలని చేరారా అంటే దానికి ఆమె కాంగ్రెస్‌లో చేరడానికి ఆస్తుల వివాదమే కారణమని నిర్ధారించే ఆధారాలు బహిరంగంగా లేవు కానీ జరుగుతున్న పరిణామాలు కుటుంబ వివాదాలు, రాజకీయ విమర్శలు ఇవన్నీ జనంలో చర్చగా ఉన్నపుడు ఈ తరహా అనుమానాలు జనంలో వ్యక్తమవుతున్నాయి. షర్మిల జాతీయ పార్టీకి సంబంధించి ఏపీకి ఒక నాయకురాలు. కానీ ఆమె రాజకీయాన్ని వ్యక్తిగత వివాదాలు అధిగమించేలా ప్రభావం చూపడం వల్లనే జనంలో ఈ భావన కలుగుతోంది అని అంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ ఐసీయూలోకి :

ఇప్పుడు కరడు కట్టిన కాంగ్రెస్ అభిమానులు అంతా దీని మీదనే చర్చించుకుంటున్నారు. వైఎస్సార్ చర్మిషాతో ఆయన కుమార్తె కాంగ్రెస్ పగ్గాలు చేపడితే పార్టీకి కొత్త ఊపు వస్తుందని భావించే వారు ఖంగు తినేలా రెండేళ్ల షర్మిల పీసీసీ చీఫ్ వ్యవహారం సాగింది అని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఆశించేది కుటుంబ వివాదాలపై ఆమె స్పందనలు కాదు రాష్ట్రంలో తమ పార్టీని తిరిగి నిలబెట్టే నాయకత్వం అని గట్టిగానే చెబుతున్నారు. ఇక నిజం చెప్పాలీ అంటే షర్మిల రాకముందే ఏపీలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బ తిని ఉంది. అలాంటి పార్టీని పైకి తీసుకుని వస్తారనే షర్మిలకు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎంత మెరుగుపడిందనేది కూడా ఇక్కడ పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగళి అన్న జవాబు వస్తుంది.

సీట్లూ లేవు, ఓట్లూ లేవు :

కాంగ్రెస్ కి గత మూడు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా అసెంబ్లీలో లేదు, ఇక షర్మిల నాయకత్వంలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాడింది. అపుడు కూడా ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు, అదే విధంగా పార్టీ ఓట్ల శాతం కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉందని అంటున్నారు. మరో వైపు షర్మిల స్వయంగా కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు సుమారు 1.41 లక్షల ఓట్లు వచ్చాయి ఇక్కడ షర్మిల గెలుపు సాధించకపోయినా కాంగ్రెస్‌కు కొంత రాజకీయ చర్చను తీసుకురాగలిగారని అంటారు, ఆ మేరకు మాత్రమే సంతృప్తి పడాల్సి ఉంది.

పార్టీ నిర్మాణం ఏదీ :

వైసీపీలోకి కాంగ్రెస్ మొత్తం షిఫ్ట్ అయిపోగా అరకొరగా మిగిలిన పార్టీని పునర్నిర్మించే విధంగా షర్మిల ఏ మేరకు చర్యలు తీసుకున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. షర్మిల వల్ల కాంగ్రెస్ కి ఎంతో కొంత ప్రచారం వచ్చింది, అది మీడియాలోనే. కానీ గ్రాస్ రూట్ లో కాంగ్రెస్ అలాగే ఉంది అని అంటున్నారు. గ్రామాలలో ఈ రోజుకీ కాంగ్రెస్ కి ఎంతో కొంత ఓటు ఉంది, మరి దానిని పటిష్టం చేసే విధంగా యాక్షన్ ప్లాన్ ఉందా అనే లేదు అని జవాబు ఉంది. షర్మిల గతంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేశారు, ఫలితాలు మాత్రం పెద్దగా లేవని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలకు రెండేళ్ళ సమయం ఉంది. కాంగ్రెస్ కి పోటీ చేసేందుకు ఎంతమంది గట్టి అభ్యర్థులు ఉన్నారు అంటే కూడా సమాధానం లేదు.

కూటమి మీద ఉదాసీనత :

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు సాగాయి. ఎన్నో సమస్యలు ఏపీలో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు, ఎన్నికల హామీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు, రైతుల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీలు నిరంతరం ప్రశ్నించాల్సి ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకురాలిగా షర్మిల ఏమి చేస్తున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. కూటమి మీద షర్మిల విమర్శలు తక్కువగా ఉన్నాయన్న భావన ఇక్కడే జనంలో ఏర్పడుతోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఎన్డీయేని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరి ఏపీలో వామపక్షాలతో కలసి కాంగ్రెస్ కూటమిని గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా లేదా అంటే కూడా జవాబు వెతుక్కోవాల్సి వస్తోంది.

ఆమెకు ఉన్న ఇమేజ్ తో :

ఇక షర్మిల అంటే ఒక ఇమేజ్ జనంలో ఉంది. ఆమె వైఎస్సార్ కుమార్తె. జగన్ సోదరి, దానితో పాటు గతంలో వైసీపీ తరఫున సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాయకురాలిగా ఆమెకు ప్రజల్లో గుర్తింపు ఉంది. అయితే అదొక్కటి సరిపోదు రాజకీయాల్లో నిరంతరం పనిచేస్తేనే ప్రజల మద్దతు దక్కుతుంది. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు పీసీసీ చీఫ్ గా షర్మిల వల్ల కాంగ్రెస్ కి ఒనగూడింది పెద్దగా లేదని అంటున్నారు. షర్మిల బలంగా నిలిచినట్లు అయితే వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ పాత కాంగ్రెస్ నాయకులు వచ్చి చేరాలి కదా. అలాగే కొత్త నాయకత్వం గ్రామాలలో తయారు కావాలి కదా. అది జరగడం లేదు అంటే ఆమె నాయకత్వం మీద పార్టీలోనూ ప్రశ్నలు మొదలవుతున్నాయని అనుకోవాల్సిందే.

షర్మిలకు అది సవాల్ :

ఏపీలో కాంగ్రెస్ కి గత వైభవం తీసుకుని రావడం అంత సులభం కాదు. ఉనికి కోసం పోరాడుతూ దశాబ్దానికి పైగా బలహీనంగా ఉన్న పార్టీని పునర్నిర్మించాలంటే చాలా కష్టపడాలి. ఈ క్లిష్ట బాధ్యతలను షర్మిల తీసుకున్నారు కానీ ఆమె తన ప్రాధాన్యతల విషయంలోనే తడబడుతున్నారు అని అంటున్నారు ఆమె జగన్ కి రాజకీయ ప్రత్యర్ధిగా రుజువు చేసుకోవాలని చూస్తున్నారు. అలాగే వైఎస్సార్ వారసత్వం తనదే అని చాటి చెప్పాలని అనుకుంటున్నారు. అందుకే ఆమె జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ ని బలోపేతం చేయడం ద్వారా జనంలో పార్టీని ఉంచడం ద్వారా ఈ రెండింటితో పాటు కాంగ్రెస్ ని కూడా ముందుకు తీసుకుని రాగలరు, కానీ ఆమె మాత్రం జగన్ మీద పోరాటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది ఒక విమర్శగా ఉంది. ఇప్పటికైనా షర్మిల తన యాక్షన్ ప్లాన్ ని ముందుకు తీసుకుని కాంగ్రెస్ కి ఊపిరి పోసేందుకు కృషి చేస్తేనే అది ఆమెకూ ఆమె రాజకీయానికీ మేలు అని అంటున్నారు.

Tags:    
  • yssharmila 
  • apcongress 
  • andhrapradeshpolitics 
  • ysjagan 
  • congressparty 

Similar News

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS