• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  స్థానిక ఎన్నికల్లో జగన్...

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

| ఏపీలో స్థానిక ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల విజయానికి కొలమానం కావని గత అనుభవాలు చెబుతున్నాయి. 2021లో స్థానిక సంస్థలన్నింటిలోనూ ఆధిపత్యం చూపిన వైసీపీ, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోయింది. అందుకే స్థానిక ఎన్నికల విజయంతో ధీమా పడకుండా, ఐదేళ్ల పాలనతో ప్రజల నమ్మకం గెలుచుకోవడమే కూటమికి కీలకం.

By - Satya P
Update: 2026-11-05 07:15 GMT

ఏపీ రాజకీయాలను ఎవరూ తక్కువ వేయడానికి లేదు, ఇక్కడ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారు. తలపండిన వారికి రాజకీయ చాణక్యత ఉన్న వారికి సైతం జనాల నాడి పట్టుకోవడం కష్టమే. ఏపీ జనాలు ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. అందుకే ఎక్కువగా సీట్లు ఇస్తారు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా వారు ఓట్ల వర్షం కురిపిస్తారు. విపక్షానికి చోటే లేని స్థితి తెస్తారు. అదే వారిలో అసంతృప్తి రగిలితే తాము ఇచ్చిన సీట్లను వెనక్కి తీసుకుని మరీ పాతాళానికి ఆ పార్టీని ఎత్తి పడేస్తారు. ఇది ఇవాళా నిన్నా కాదు దశాబ్దాలుగా ఏపీలో జనం తీర్పు ఇదే తీరుగా ఉంటోంది. ఇక ఏపీలో స్థానిక ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఏదీ సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేదు, ఇది ఒక ట్రాక్ రికార్డు. దానికి అనేక ఉదాహారణలు కళ్ళ ముందే ఉన్నాయి.

ఆ గెలుపు కొలమానం కాదు :

స్థానిక ఎన్నికల్లో గెలిచామని ఎవరైనా సంబరపడితే అది వాపు తప్ప బలుపు కాదు అని అంటారు. ఏపీలో ప్రస్తుతం కూటమి నూరు శాతం స్ట్రైక్ రేట్ ని అర్బన్ బాడీస్ లో సాధించామని చెప్పుకుంటోంది. మంచిదే కానీ ఈ ఫలితాలు రేపటి విజయానికి భరోసా అవుతాయా అన్నదే పెద్ద చర్చ. నిజానికి చూస్తే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రభుత్వ ప్రజాదరణకు కొలమానంగా చూపించడం కొత్తేమీ కాదు. కానీ గత ఎన్నికల చరిత్ర చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం స్పష్టమవుతోంది. అదేంటి అంటే లోకల్ బాడీస్ లో గెలిచిన పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కావడం. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ మొత్తానికి మొత్తం స్వీప్ చేసి పారేసింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేదనిపించుకుంది. అలా వైసీపీ తన రాజకీయ ఆధిపత్యం చూపించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఫల్టీ :

నిజానికి ఈ ఫలితాలు చూసిన వారు అంతా వైసీపీకి ఎదురులేదని అనుకున్నారు. కట్ చేస్తే కేవలం మూడేళ్ల తర్వాత జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో అదే వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అత్యధిక సీట్లు అందుకుంది. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకూ వైసీపీ వారే ఉన్నారు. ఇంత మందీ మార్బలం అధికార బలం ఉన్న వైసీపీ 2024 లో ఎందుకు ఓటమి పాలు అయింది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వేరు సార్వత్రిక ఎన్నికలు వేరు అని రాజకీయ పండితులు చెబుతారు. రాజకీయ పార్టీలకు అన్ని ఎన్నికల్లో గెలిచేశామని ఉంటుంది. కానీ ఏ ఎన్నికలో పవర్ ఏమిటి ఫలితం ఏమిటి తేడా ఏమిటి అన్నది జనాలకు బాగా తెలుసు అని అంటున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో గెలిపించిన చేత్తోనే సార్వత్రిక ఎన్నికల్లో సాగనంపుతున్నారు అని అంటున్నారు.

ధీమా పడితే మాత్రం :

అందుకే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి కూడా ఈ రాజకీయ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు. విజయం ఎపుడూ ఊపు ఇస్తుంది. అలా లోకల్ బాడీస్ లో గెలుపు అన్నది కిక్ ఇవ్వవచ్చు. అలాగే ప్రభుత్వానికి బలం కావచ్చు కానీ ఇదే బలం శాశ్వతం అని ధీమా పడితే మాత్రం తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే గ్యారంటీ మాత్రం ఇవ్వదని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. నిజానికి స్థానిక ఎన్నికలకూ సార్వత్రిక ఎన్నికలకూ ఎంతో తేడా ఉంది. లోకల్ బాడీస్ లో అభ్యర్థుల వ్యక్తిగత పలుకుబడి ప్రధాంగా ఉంటుంది. అంతే కాదు గ్రామ స్థాయిలో వారికి ఉన్న మంచి సంబంధాలు కూడా జత కలుస్తాయి. ఆ మీదట అధికార పార్టీ ప్రభావం, స్థానిక రాజకీయ సమీకరణాలు కీలకంగా పనిచేసి గెలుపు గుర్రం ఎక్కేస్తారు. కానీ సార్వత్రిక ఎన్నికలు అలా ఉండవు, ఇదే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అయిదేళ్ల పనితీరును సమగ్రంగా అంచనా వేస్తారు. ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమం, ధరలు, ఎన్నికల హామీలు, నాయకత్వంపై విశ్వాసం వంటి అంశాలు ఇలా ఇవన్నీ కూడా నిర్ణయాత్మకంగా మారుతాయని అంటున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ప్రభుత్వం 2024లో ఓడిపోయిందని చెబుతున్నారు.

కూటమి సంగతి ఏమిటి :

లోకల్ బాడీస్ లో గెలిచాం, 2029 లో గెలుస్తామని కూటమి అంటోంది. మరి జగన్ కి ఎదురైన పరిస్థితి ప్రస్తుత కూటమికి కూడా ఎదురవుతుందా అంటే దానికీ ఎన్నో లెక్కలు ఉన్నాయి. అయిదేళ్ళ పాటు సాగే కూటమి పాలనపై ప్రజల అభిప్రాయం ఆనాటికి ఎలా ఉంటుంది, అలాగే ఎన్నికల హామీల అమలు చేశారా లేదా ఇక ప్రతిపక్షాల బలం అప్పటికి ఏ విధంగా ఉండబోతుంది. రానున్న కాలంలో రాజకీయ పరిణామాలు వీటి మీదనే ఎక్కువగా ఆధారపడి 2029 ఎన్నికల ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఇక లోకల్ బాడీస్ లో కూటమి గెలిస్తే అది రాజకీయంగా సానుకూల సంకేతమే అని భావించవచ్చు. అదే సమయంలో ఈ విజయాన్ని 2029 అసెంబ్లీ ఎన్నికల తీర్పుగా భావించడం అంటే ఇప్పటికైతే తొందరపాటు అవుతుంది అని అంటున్నారు.

మెప్పించినప్పుడే :

మొత్తం నాలుగు కోట్ల మంది జనాలు ఒకసారి 2029 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటేస్తారు. అపుడు రాష్ట్ర అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే యాంటీ ఇంకెంబెన్సీ కూడా కీలకంగా మారుతుంది. విపక్షం ఆనాటికి బలపడితే అది ఆప్షన్ గా ఉంటే జనాలు ఆలోచించుకుంటారు కూడా. వైసీపీ విషయంలో ఇదే కచ్చితంగా జరిగింది. జగన్‌కు 2021 స్థానిక ఎన్నికలు ఇచ్చిన రాజకీయ భరోసా 2024లో ఏ మాత్రం ఉపయోగపడలేదు అన్నది రుజువు అయింది. ఇక టీడీపీ కూటమి కూడా స్థానిక విజయాలనే 2029 గెలుపునకు హామీగా భావించకూడదనే అంటున్నారు. ఎందుకంటే ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఒకలా, సార్వత్రిక ఎన్నికల్లో మరోలా తీర్పు ఇవ్వగలరని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర ఇప్పటికే నిరూపించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కూటమి తన పాలనతోనే జనాన్ని గెలవాలని అంటున్నారు. జగన్ చేసిన తప్పులను కూటమి పునరావృత్తం చేయకుండా ఉండేందుకే ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

Tags:    
  • andhrapradesh 
  • apolitics 
  • tdp 
  • janasena 
  • ysrcp 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS