• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాతపగలన్నీ మాని ట్రంప్ కు...

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

| ట్రంప్‌కు మద్దతుగా అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల కోసం సుమారు రూ.4,200 కోట్లు ఖర్చు చేసిన ఎలాన్ మస్క్‌కు ఫలితాలు షాకిచ్చాయి. రిపబ్లికన్ల ఓటమి తర్వాత టెస్లా షేర్లు పడిపోవడంతో ఆయన సంపదలో భారీగా నష్టం నమోదైనట్లు కథనాలు చెబుతున్నాయి. డబ్బు, పలుకుబడి ఉన్నంత మాత్రాన ఓటర్ల తీర్పును మార్చలేమనే చర్చ మొదలైంది.

By - A.N.Kumar
Update: 2026-11-05 06:37 GMT

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.. తోటి పారిశ్రామికవేత్త.. బిజినెస్ మైండ్ ఉన్న ట్రంప్ నకు ఆది నుంచి వేల కోట్లు ఫండింగ్ చేసి ఆయన గెలుపునకు ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ బాటలు వేశారు. రెండోసారి ట్రంప్ గెలవడంలో వెనుకుండి నడిపించాడు. ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన పోస్ట్ కూడా సంపాదించి కొన్నాళ్లు పాలించాడు. కానీ ఎక్కడ విభేదాలు వచ్చాయేమో కానీ ట్రంప్ కు దూరంగా జరిగాడు.

అయితే తన వ్యాపారాలు.. బిజినెస్ లు మంచిగా అమెరికా సాగాలంటే మరో బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ అధికారంలో ఉంటే సాధ్యమని ఎలన్ మస్క్ కు బాగా తెలుసు. అందుకే ఈ మిడ్ టర్మ్ ఎన్నికల్లో కూడా ట్రంప్ పై కనకవర్షం కురిపించాడు ఎలన్ మస్క్.. కానీ ఇప్పుడు ట్రంప్ పార్టీ ఓటమితో ఎలన్ మస్క్ నిండా మునిగాడు.

అమెరికా మధ్యంతర ఎన్నికలు ప్రపంచ రాజకీయాల్లోనే కాకుండా.. అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లోనూ ఊహించని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం.. కాంగ్రెస్ పై డెమోక్రాట్లు ఆధిపత్యం సాధించడం ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల గెలుపు కోసం వేల కోట్లు ఖర్చు చేసిన టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కు ఎదురైన పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆయన చేసిన భారీ రాజకీయ పెట్టుబడి రూ.4200 కోట్లు ఫలితాన్ని ఇవ్వకపోగా.. ఇప్పుడు ఆయన సంపద కూడా ఏకంగా రూ.5 లక్షల కోట్లు నష్టపోవడంతో మస్క్ నిండా మునిగినట్టైంది.

టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ సంస్థలతో సాంకేతికరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎలన్ మస్క్ అమెరికా రాజకీయాల్లోనూ కీలక శక్తిగా ఎదిగారు. డొనాల్డ్ ట్రంప్ నకు అత్యంత బలమైన మద్దతుదారుగా నిలిచిన మస్క్.. రిపబ్లికన్ పార్టీ ప్రచారానికి అపారమైన నిధులను సమకూర్చారు.

ఈ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయం కోసం మస్క్ ఏకంగా 446 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 4200 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఒక వ్యక్తి ఇంత భారీ మొత్తంలో రాజకీయ నిధులు సమకూర్చడం అత్యంత అరుదైన విషయంగా నిలిచింది. అయితే మస్క్ తన వ్యాపారాల కోసం చేసిన ఈ బిలియన్ డాలర్ల పందెం పూర్తిగా బెడిసికొట్టి రిపబ్లికన్లు ఓడి ఆయనకు గట్టి షాక్ ఇచ్చారు. ఎలన్ మస్క్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ప్రచారం నిర్వహించిన టెక్సాస్ రాష్ట్రంలోనూ రిపబ్లికన్లు ఓడిపోవడం.. మస్క్ రాజకీయ వైఫల్యాలానికి అద్దం పడుతోంది.

ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్లు ఓడిపోవడంతో ఎలన్ మస్క్ కంపెనీలపై ఎఫెక్ట్ భారీగా పడింది. టెస్లా షేర్లు దాదాపు 5.7 శాతం పడిపోయాయి. స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. దీంతో ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద ఒక్కసారిగా 60 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా సుమారు రూ.5 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

ఎలన్ మస్క్ కు ఒక మంచి గుణపాఠం ఈ ఎన్నికలు నేర్పినట్టైంది. అపారమైన సంపద, ప్రచార హోరు ఉన్నంత మాత్రాన ఓటర్ల నిర్ణయాన్ని మార్చడం సాధ్యం కాదని మస్క్ కు అర్థమైంది. కార్పొరేట్ దిగ్గజాల భారీ ఫండింగ్ ఎన్నికల ఫలితాలను మార్చలేవనే సత్యం అమెరికా ఎన్నికల ద్వారా నిరూపితమైంది. డబ్బుతో రాజకీయ ప్రభావాన్ని కొనలేరని.. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ఓటరుదేనన్న వాస్తవం బోధపడింది.

Tags:    
  • elonmusk 
  • donaldtrump 
  • usmidtermelections 
  • tesla 
  • republicans 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS