• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Andhra Pradesh >  Kakinada >  పవన్ ఇలాకాలో ఏంటీ...

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

| చైర్మన్ గా జనసేన ఎంపిక చేసిన అభ్యర్ధికి ఓటేసి పట్టం కట్టిన జనాలే వార్డుల దగ్గరకు వచ్చేసరికి గాజు గ్లాస్ కి షాక్ ఇచ్చేశారు.

By - Satya P
Update: 2026-11-04 17:46 GMT

పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అన్నంతగా గుర్తింపు వచ్చింది. దానికి కారణం పవర్ స్టార్ గా వెండి తెరను ఏలుతూ రియల్ స్టార్ గా రాజకీయాల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఏరి కోరి ఈ సీటు నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక స్థానిక సంస్థలలో భాగంగా పిఠాపురం మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కూటమి చైర్ పర్సన్ కే జనాలు జై కొట్టారు. అలా జనసేనకు చెందిన దానం లాజర్ బాబు మంచి మెజారిటీతో గెలిచారు. కానీ వార్డులలో కౌన్సిలర్ల దగ్గరే తేడా వచ్చింది. ఏకంగా పది మంది రెబెల్స్ గెలిచి మరీ తమ సత్తా చాటుకున్నారు. దాంతో మూడవ వంతు క్యాండిడేట్లు పార్టీ ఎంపిక చేసిన వారు ఓటమి చవి చూశారు. మరి ఈ తేడా ఎలా జరిగింది, ఎక్కడ లోపం ఉంది అన్నది రాజకీయంగా వాడిగా వేడిగా సాగుతోంది.

జనాలకు నచ్చలేదా :

చైర్మన్ గా జనసేన ఎంపిక చేసిన అభ్యర్ధికి ఓటేసి పట్టం కట్టిన జనాలే వార్డుల దగ్గరకు వచ్చేసరికి గాజు గ్లాస్ కి షాక్ ఇచ్చేశారు. తమకు నచ్చిన అభ్యర్ధులు రెబెల్స్ అని అంటూ వారినే గెలిపించుకున్నారు. దాంతో జనసేన ఎంపిక జనాలకు నచ్చలేదా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. అలాగే బలమైన అభ్యర్ధులను వార్డులలో ఎంపిక చేసి అభ్యర్ధులుగా నిలబెట్టడంలో జనసేన తడబాటు పడిందా అని కూడా అంతా చర్చించుకుంటున్నారు. పిఠాపురం అంటే ముందే చెప్పినట్లు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ సొంత సీటు. అక్కడ ఏమి జరిగినా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం దీని మీదనే అంతా డిస్కషన్ చేస్తున్నారు.

కుప్పంలో బాబు అలా :

మరో వైపు చూస్తే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మునిసిపాలిటీలో మొత్తానికి మొత్తం వార్డులు చైర్మన్ సహా అన్నీ కూటమి ఖాతాలోకి వెళ్లాయి. ప్రత్యర్ధి వైసీపీ ఇక్కడ ఒక్క సీటూ గెలవలేకపోయింది. అంతే కాదు రెబెల్స్ కూడా ఎవరూ రంగంలో లేరు, ఇక ఏపీ అంతా కూటమి పెద్దన్నగా టీడీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మధింపు చేసింది అని అంటున్నారు. కానీ పిఠాపురం పవన్ సొంత సీటు కాబట్టి అక్కడ నిర్ణయం అంతా జనసేనకే వదిలేసింది అని అంటున్నారు. అలా 36 వార్డులు ఉన్న పిఠాపురంలో ముందే మూడు వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 33 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలలో పది మంది రెబెల్స్ గెలిచి వచ్చారు. ఆ విధంగా వారు కూటమికే ఎదురు నిలిచారు. అఫ్ కోర్స్ వారు గెలిచినా కూడా కూటమికి విరుద్ధంగా రంగంలో ఉండటం మాత్రం పార్టీలను ఇబ్బంది పెట్టడమే కాదు సొంత అభ్యర్థుల ఓటమికి కారణం అయ్యారు అని అంటున్నారు.

ఎంపిక సరిగ్గా లేదా :

ఇక పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో వార్డులలో అభ్యర్ధుల ఎంపిక సరిగ్గా జరగలేదా అన్న చర్చ అయితే సాగుతోంది. జనాలు మెచ్చని వారిని ఎంపిక చేయడం వల్లనే బలమైన అభ్యర్ధులుగా రంగంలోకి దిగిన రెబెల్స్ విజయం సాధించారు అని విశ్లేషణలు ఉన్నాయి. అదే విధంగా చూస్తే జనసేన స్థానిక నాయకత్వం ఇంతటి సమర్ధులైన అభ్యర్ధులను ఎందుకు గుర్తించలేకపోయింది బలహీనమైన అభ్యర్థులను ఎలా బరిలోకి దింపింది అన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇది పూర్తిగా పిఠాపురంలో స్థానిక నాయకత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పవన్ కళ్యాణ్ సొంత సీటులో ఇబ్బందులు తలెత్తేలా పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. టీడీపీ విషయానికి వస్తే అక్కడ బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మను తప్పించింది. అలాగే జనసేనకు ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. మరి అలాంటి చోట ఎక్కడా రెబెల్ సౌండ్ వినబడకుందా ఏకతాటి మీద అభ్యర్థుల ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది అని అంటున్నారు.

రెబెల్స్ ని ఏం చేస్తారు :

మరి పిఠాపురంలో రెబెల్స్ అంత పెద్ద ఎత్తున ఎందుకు నిలబడ్డారు అన్నది ఒక ప్రశ్న అయితే వారిని అధినాయకత్వాలు వారించినా మాట వినకుండా ఎందుకు కొనసాగారు అన్నది మరో ప్రశ్న. ఇప్పుడు వారు గెలిచి జెండా ఎగరేశారు, మళ్ళీ వారిని చేర్చుకుంటారా అన్నది కూడా ఇంకో ప్రశ్నగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే తాము టికెట్ ఇవ్వని వారు వద్దు అని చెప్పిన వారు గెలిచి అధినాయకత్వాలకు సవాల్ చేయడం మాత్రం పిఠాపురంలో కొత్త రాజకీయ తలనొప్పిగానే ఉందని అంటున్నారు. ఇప్పటి నుంచే సర్దుకోకపోతే మాత్రం రానున్న కాలంలో ఈ రెబెల్స్ సౌండ్ మరింతగా మరో రూపంలో గట్టిగా వినిపించే చాన్స్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు.

Tags:    
  • pithapuram 
  • pawankalyan 
  • janasena 
  • pithapurampolls 
  • municipalelections 

Similar News

కాకినాడకు GD 10 అలర్ట్.. అసలేంటి హెచ్చరిక

2026-10-27 10:44 GMT

మేయర్ లేదా జెడ్పీ చైర్మన్ గా ముద్రగడ కుమార్తె ?

2026-10-15 03:41 GMT

వైసీపీకి షాక్ ఇచ్చిన యనమల

2026-09-25 16:47 GMT

యనమల కృష్ణుడిని ఆపుతున్నదెవరు? జనసేనలో రెడ్ సిగ్నల్

2026-09-23 10:20 GMT

పవన్ కాకినాడ మీటింగ్...డిసైడ్ చేస్తారా ?

2026-09-20 16:40 GMT

రాజకీయ గోదాట్లో వైసీపీ ఇంచార్జిలు

2026-09-01 02:40 GMT

ఏఈ నూకరాజు అల్లుడి హత్య : ప్రొటీన్ పౌడర్‌లో విషం.. బయటపడ్డ సంచలన నిజాలు

2026-08-27 05:52 GMT

ఏఈ నూకరాజు అల్లుడిది హత్యే.. వెలుగులోకి షూటింగ్ కోచ్ దారుణాలు!

2026-08-18 08:57 GMT

'పెద్దాపురం' సీన్ మారుతోందా.. రాజ‌కీయాల‌కు రాజ‌ప్ప రాంరాం...?

2026-08-13 07:33 GMT

ముద్రగడ పాడె మోసిన జగన్.. తీవ్ర భావోద్వేగం

2026-07-15 11:41 GMT

ముద్రగడ లేని వైసీపీకి భారీ నష్టం !

2026-07-15 06:46 GMT

Copyright @2026

Powered by Blink CMS