వైసీపీకి షాక్ ఇచ్చిన యనమల
వైసీపీకి కాకినాడ జిల్లాలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచిన పరుపుల సుబ్బారావు కీలక నేతలను వెంటబెట్టుకుని వైసీపీ గేఅటు దాటేశారు.
వైసీపీకి కాకినాడ జిల్లాలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచిన పరుపుల సుబ్బారావు కీలక నేతలను వెంటబెట్టుకుని వైసీపీ గేఅటు దాటేశారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇపుడు అదే జిల్లాలో మరో ముఖ్య నేత ఫ్యాన్ నీడ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన ఎవరో కాదు రాజకీయంగా ప్రముఖ నేతగా ఉన్న మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు.
ఇమడలకేనే :
యనమల కృష్ణుడు 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు. అయితే అది యనమల రామక్రిష్ణుడు కుమ్మర్తె దివ్యకు ఖరారు కావడంతో ఆయన వైసీపీలో అప్పట్లో చేరారు. అయితే వైసీపీ ఓటమి పాలు అయింది. ఇక నియోజకవర్గంలో కూడా ఆయనకు మాజీ మంత్రి తుని వైసీపీ ఇంచార్జి దాడిశెట్టి రాజాకు మధ్య విభేదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఇలా ఒకే పార్టీలో రెండు వర్గాలుగా ఉంటూ వచ్చిన తీరుతో తునిలో పార్టీ ఇబ్బందులో పడుతోంది. ఇపుడు యనమల క్రిష్ణుడు జనసేన దారి చూసుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ మాజీ ంఫ్ఫ్ పోల్నాటి శేషగిరిరావు, తొండంగి మండలానికి చెందిన పలువురు నాయకులు జనసేనలో చేరారు.
బలమైన నేతగా :
తునిలో కాపులతో పాటు యాదవులు కూడా బలంగా ఉంటారు. ఈ రెండు సామాజిక వర్గాలతో పాటు బీసీలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. అలా యనమల రామక్రిష్ణుడు బలమైన నేతగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన వైసీపీని వీడడం అంటే పార్టీకి నష్టమే అని అంటున్నారు. అయితే తునిలో టికెట్ ని ఆశిస్తున్న క్రిష్ణుడుకు వైసీపీలో ఆ చాన్స్ లేదని అర్ధం అవుతోంది. అయినా కానీ పార్టీలో సముచిత స్థానం కూడా దక్కడం లేదని భావించే బయటకు వచ్చారు అని అంటున్నారు.
గోదావరి కష్టాలు :
వైసీపీకి 2024 ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో చేదు ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీ కోలుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు, మరో వైపు టీడీపీ జనసేన బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలనే నాయకులు అంతా ఎంచుకుంటున్నారు. జనసేన అంటే ఒక సామాజిక వర్గం వారే అక్కడ ఎక్కువగా చేరుతున్నారు అన్న భావన తప్పు అనిపించేలా బీసీ నేతగా ఉన్న యనమల క్రిష్ణుడు గాజు గ్లాస్ పట్టుకోవడం రాజకీయంగా సామాజిక సమీకరణల పరంగా కలసి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరో వైపు వైసీపీని కూటమి పార్టీలు గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గం స్థాయి నాయకులు అంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. రానున్న రోజులలో ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు కూడా ఫ్యాన్ పార్టీని వీడి బయటకు వస్తారని అంటున్నారు. వైసీపీ కూడా ఈ పరిణామాలను చేష్టలుడిగి చూస్తోంది అన్న విమర్శలు అదే పార్టీ నుంచి ఉన్నాయి అంటున్నారు.