• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Andhra Pradesh >  West Godavari >  జగన్ బాస్...ఓడించింది...

జగన్ బాస్...ఓడించింది బోస్ !

| వైసీపీ ఏపీలో అర్బన్ బాడీస్ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడింది. మొత్తానికి మొత్తం ఓటమి పాలు అయింది.

By - Satya P
Update: 2026-11-04 16:15 GMT

వైసీపీ ఏపీలో అర్బన్ బాడీస్ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడింది. మొత్తానికి మొత్తం ఓటమి పాలు అయింది. వందకు పైగా మునిసిపాలిటీస్ కి ఎన్నికలు జరిగితే అందులో నాలుగు మాత్రమే గెలిచి బలహీన స్వరం వినిపించింది. అయితే ఈ ఓటమికి కూటమి ప్రభుత్వం అరాచకాలు కారణం అని వైసీపీ అధినాయకత్వం మండిపడుతోంది. కానీ తాజాగా వైసీపీ అభ్యర్ధులే తాము ఎందుకు ఓటమి పాలు అయ్యామో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. స్థానిక అంశాలు వైసీపీలో అంతర్గత విభేదాల వల్లనే ఓటమి పాలు అయిన వారు ఎక్కువ మంది ఉన్నారని లెక్క తేలుతోంది అంటున్నారు.

బోస్ కుటుంబమే కారణం :

ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కీలకమైన రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఓటమిని చవి చూసింది. దానికి కారణం అక్కడ నియోజకవర్గం పెద్దగా ఉన్న మాజీ మంత్రి మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ పిల్లి సూర్యప్రకాశ్‌ కారణం అని వైసీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన చింతపల్లి నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో చేసి మరీ సోషల్ మీడియాకు రిలీజ్ చేశారు. తన ఓటమికి ఆ ఇద్దరే కారణమని అందులో స్పష్టం చేశారు. అంతే కాదు స్థానిక ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా నిలవలేదని ఇక సుభాష్ చంద్ర బోస్ తనను దూషించారని చింతపల్లి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు ఈ వీడియో స్థానికంగా రాజకీయంగా కూడా అతి పెద్ద చర్చకు తావిస్తోంది.

అధినాయకత్వం వైపు :

మరి ఇంత బాహాటంగా ఒక పార్టీ అభ్యర్ధి తన ఓటమి పార్టీ పెద్దలే కారణం అని వీడియో రిలీజ్ చేసి కన్నీరు పెట్టడం మీద వైసీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది అని అంతా చర్చిస్తున్నారు. నిజానికి వైసీపీ అధినాయకత్వం పదే పదే ఇంచార్జిలకు చెబుతూ వచ్చింది. మీరే అండగా ఉండి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని వారు రేపు జరిగే ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు మద్దతుగా ఉంటారు అని. కానీ గ్రౌండ్ లెవెల్ లో అలా జరిగినట్లుగా లేదని రామచంద్రాపురంలో సీన్ చూస్తే అర్ధం అవుతోంది. అంటే వైసీపీలో అంతర్గత విభేదాలు కూడా పార్టీ ఓటమికి కారణాలుగా మారాయని మరో విశ్లేషణ ఇపుడు వినిపిస్తోంది. సొంత పార్టీ అభ్యర్ధి కన్నీరు పెడుతూంటే హైకమాండ్ ఏ విధంగా ఈ ఇష్యూని చూస్తుంది అని అంతా ఆలోచిస్తున్నారు.

కూటమి స్ట్రాంగ్ గా :

అయితే రామచంద్రాపురంలో కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంది. రెండున్నరేళ్ల కూటమి పాలన రాష్ట్రంలో పూర్తి అయినా గోదావరి జిల్లాలలో మాత్రం వైసీపీ ఇంకా కోలుకోలేదని అంటున్నారు. ఇక రామచంద్రాపురం మునిసిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉంటే ఇందులో టీడీపీకి 14 జనసేనకి 12 బీజేపీకి 1 వైసీపీకి 5 దక్కాయి. ఇలా మొత్తం మునిసిపాలిటీలో చాలా బలంగా కూటమి ముద్ర కనిపిస్తోంది. మరి బలమైన కూటమిని ఎదుర్కోవడానికి వైసీపీ ఐక్యంగా ముందుకు రాకుండా విభేదాలతో సాగిందని చైర్మన్ అభ్యర్ధి చింతపల్లి నాగేశ్వరరావు ఆరోపణలతో తేటతెల్లమవుతోంది.

Tags:    
  • ysrcp 
  • ramachandrapuram 
  • pillisubhashchandrabose 
  • andhrapradeshpolitics 

Similar News

వేలంపాటలో ఎంపీటీసీ సీటు... వైసీపీకి బూమరాంగ్ !

2026-10-25 13:45 GMT

కొరుకుడు పడని గోదావరి...జగన్ ఏం చేయబోతున్నారు ?

2026-10-08 23:37 GMT

వైద్య విద్యార్థిని యాక్సిడెంట్ కేసు... ఎఫ్ఐఆర్ నమోదుకు మూడు రోజులు పట్టిందా? నిజమేంటి!

2026-08-08 17:59 GMT

అటు గోదావరి...ఇటు ఉత్తరాంధ్ర...వైసీపీ నయా వ్యూహం !

2026-07-23 03:53 GMT

శోధ‌న ఆగింది.. జాను ఏమైంది?!

2026-06-25 12:30 GMT

పవన్ సూపర్ స్పీడ్.. గోదావరి ప్రక్షాళనకు హైటెక్ ప్లాన్

2026-05-29 09:12 GMT

8 వేల కోట్ల బడ్జెట్ లో గోదావరి శుద్ధికి ఒక్క రూపాయి లేదా? పవన్ సూటి ప్రశ్న!

2026-05-26 10:52 GMT

రఘురామ కొత్త పార్టీ ‘తెలుగు వీర లేవరా’.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్!

2026-05-23 04:09 GMT

ఉండి.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది.. ?

2026-05-22 11:30 GMT

దెందులూరు మీర‌నుకున్న‌ట్టు లేదు... చింత‌మ‌నేని మారిపోయాడు...!

2026-05-08 15:30 GMT

నలుగురు నీలి కుమారులు...రఘురామ సెటైర్లు

2026-05-04 04:00 GMT

Copyright @2026

Powered by Blink CMS