• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత్, చైనా సహా ఈ నాలుగు...

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రగిల్చిన యుద్ధోన్మాదంలో ఆ దేశంతోపాటు ఇజ్రాయెల్, ఇరాన్ కూడా తగలబడింది.

By - A.N.Kumar
Update: 2026-11-04 17:52 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రగిల్చిన యుద్ధోన్మాదంలో ఆ దేశంతోపాటు ఇజ్రాయెల్, ఇరాన్ కూడా తగలబడింది. మధ్యలో ఆశ్రయం ఇచ్చిన పాపానికి గల్ఫ్ దేశాలు కూడా ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయాయి. ఇజ్రాయెల్ ప్రోద్బలంతో ఈ యుద్ధాన్ని స్ట్రాట్ చేసిన ట్రంప్ ఇప్పుడు పీక్కోలేక.. లాక్కోలేక ఇరాన్ యుద్ధాన్ని ఆపలేక ఆపసోపాలు పడుతున్నారు. ఇరాన్ గల్ఫ్ దేశాల చమురు ఆయువు పట్టుపై కొడుతూ హార్మూజ్ జలసంధిని మూసేసి ప్రపంచవ్యాప్తంగా చమురు మంటలు రాజేసింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్, చైనా సహా ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆయిల్ ధరలు పెరిగి అరిగోసపడుతున్నాయి. యుద్ధం ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఆగుతూ.. సాగుతూ నడుస్తోంది. చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా ఏ షిప్ ను బయటకు పోనివ్వకుండా ఇరాన్ అమెరికానే కాదు ప్రపంచాన్ని తన కాళ్లకింద పెట్టుకుని ఆటలాడుతోంది.

అయితే తాజాగా అమెరికాలో ట్రంప్ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోవడం.. ఇజ్రాయెల్ లో నెతన్యాహుకు మెజార్టీ రాక హంగ్ ఏర్పడడంతో ఇక యుద్ధానికి బ్రేక్ పడుతుంది అనుకుందేమో కానీ ఇరాన్ కాస్త మెత్తబడింది. భారత్ సహా తమ మిత్ర దేశాల నౌకలకు హార్మూజ్ లో ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్టుగా ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ చైర్మన్ అమీర్ హయత్ పేర్కొన్నారు. భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాల నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ ప్రకటించింది.

దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు ఔషధాల సరఫరాను సులభతరం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. అయితే చివరకు ట్విస్ట్ ఇచ్చింది. భారత్, చైనాల నౌకలను పోనివ్వడానికి అనుమతిస్తాం కానీ నౌకల నుంచి ఫీజు వసూలు చేస్తామని మెలిక పెట్టేసింది.

అమెరికన్లు కూడా ఈ నౌకలను అడ్డుకోవద్దని.. ఇరాన్ దౌత్య, ఆర్థిక ప్రయోజనాలకు దోహదం చేస్తాయనే కారణంతోనే ఈ మినహాయింపులు ఇచ్చామని.. భారత్ నుంచి ఔషధాల దిగుమతిని సులభతరం చేయడానికి.. చైనా నుంచి రాజకీయ మద్దతు పొందడానికి ఈ చర్యలు చేపట్టినట్టు ఇరాన్ తెలిపింది.

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ హార్మూజ్ లో నౌకయానంపై ఆంక్షలతో ప్రపంచ చమురు ధరలు బాగా పెరిగాయి. ఇండియాలోనూ భారం అవుతున్నాయి. మరి ఈ సడలింపులతోనైనా పరిస్థితి మారుతుందో ఏమో చూడాలి.

Tags:    
  • iran 
  • india 
  • straitofhormuz 
  • hormuzstrait 
  • globaloilcrisis 
  • crudeoilprices 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS