• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా అధ్యక్షుడికి ఆ...

అమెరికా అధ్యక్షుడికి ఆ అరుదైన జబ్బు ఉందా?

| అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఏడాది చివరలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు

By - Tupaki Desk
Update: 2024-07-09 05:51 GMT

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఏడాది చివరలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఆయన పోటీ చేయడం ఖాయమైంది. ఇప్పటికే పోటీకి కావాల్సిన మెజారిటీని ఆయన దక్కించుకున్నారు.

కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యవహార శైలి ఇటీవల కాలంలో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆయనకు ఇప్పుడు 81 సంవత్సరాలు. ఇంత పెద్ద వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కూడా జో బైడెన్‌ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వృద్ధాప్య సమస్యల వల్లో, లేక మరేదైనా కారణమో కానీ ఆయన ఈ మధ్యకాలంలో వింతగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

ఇటీవల జీ7 దేశాల సమావేశానికి ఇటలీకి వెళ్లిన జో బైడెన్‌ అక్కడ ఆ దేశాల అధినేతలు గ్రూప్‌ ఫొటోకి పోజు ఇస్తుంటే.. ఉన్నట్టుండి పక్కకు వెళ్లిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా వారికి చేతులెత్తి అభివాదం చేశారు. ఇటలీ ప్రధాని జోక్యం చేసుకుని ఆయన చేయిపట్టుకుని గ్రూప్‌ ఫొటో దిగడానికి తీసుకురావాల్సి వచ్చింది. దీంతో జో బైడెన్‌ కు ఏమైందని అప్పుడే ఊహాగానాలు చెలరేగాయి. వృద్ధాప్య సమస్యలు, మతిమరపుతో ఆయన బాధపడుతున్నారని టాక్‌ నడిచింది.

ఈ ఘటన మరిచిపోకముందే కొద్ది రోజులకు మరోసారి అలాంటిదే పునరావృతమైంది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నగరంలో డెమోక్రటిక్‌ పార్టీ విరాళాలను సేకరించింది. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా పాల్గొన్నారు. అక్కడ 45 నిమిషాలపాటు జిమ్మీ కిమ్మెల్‌.. ఒబామాను, జో బైడెన్‌ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో వారిద్దరూ ఆ కార్యక్రమానికి హాజరైనవారందరికీ నమస్కరించారు.

కార్యక్రమం ముగిశాక బరాక్‌ ఒబామా స్టేజీ దిగి వచ్చేస్తుండగా జో బైడెన్‌ మాత్రం అలాగే అక్కడే ఉండిపోయారు. కట్టుకొయ్యలాగా స్టేజీపైనే ఎటూ కదలకుండా బిగుసుకుపోయారు. దీంతో ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న బరాక్‌ ఒబామా వెనక్కి వచ్చి జో బైడెన్‌ చేతిని పట్టుకుని తీసుకువెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ గా మారింది. దీంతో అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి పుకార్లు చెలరేగాయి. ఆయన వృద్ధాప్య సమస్యలు, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అనుమానిస్తున్నారు.

అయితే జో బైడెన్‌ ఆరోగ్యంగా ఉన్నారని అటు అమెరికా అధ్యక్షుడి కార్యాలయం, ఆయన సతీమణి చెబుతున్నారు. 81 ఏళ్ల వయసులోనూ ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పార్కిన్‌ సన్స్‌(వణుకు) వ్యాధి ఉందనే గాసిప్స్‌ నడుస్తున్నాయి. అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌ హౌజ్‌ కు న్యూరాలజీ డాక్టర్‌ తరచూ వస్తుండటం ఈ అనుమానాలకు ఆజ్యం పోసింది. బైడెన్‌ కు ఉన్న పార్కిన్‌ సన్స్‌ వ్యాధికి చికిత్స చేయడం కోసమే వైద్యుడు వైట్‌ హౌజ్‌ కు వస్తున్నారనే టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో జో బైడెన్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ కెవిన్‌ ఓ కానర్‌ ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. వైట్‌ హౌజ్‌ కు తరచుగా న్యూరాలజిస్ట్‌ రావడంపై ఆయన ఒక అధికారిక లేఖ విడుదల చేశారు. అధ్యక్షుడు బైడెన్‌ కు పార్కిన్‌ సన్స్‌ వ్యాధి లేదని కుండబద్దలు కొట్టారు. ఆయన ఈ వ్యాధి కోసం ఎలాంటి వైద్య సేవలు పొందడం లేదన్నారు.

వైట్‌ హౌజ్‌ లో ఉండే వందలాది మంది సిబ్బంది ఎదుర్కొనే మానసిక సమస్యలకు చికిత్స చేయడానికే న్యూరాలజిస్ట్‌ వైట్‌ హౌజ్‌ కు ఎక్కువగా వస్తున్నారని కెవిన్‌ కానర్‌ వెల్లడించారు.

కాగా, వృద్ధాప్య సమస్యలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్‌ తప్పుకోవాలన్న డిమాండ్‌ ఇటీవల ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన డాక్టర్, కుటుంబ సభ్యులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags:    
  • Joebiden 
  • Parkinsondisease 
  • Whitehouse 
  • Drkevinoconnor 
  • Unitedstates 
  • Neurologicalproblems 
  • Jeanpierre 
  • Joebidendisease 

Similar News

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

Copyright @2026

Powered by Blink CMS