• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబుని జగన్...

బాబుని జగన్ పొగిడారా...లేక ?

| ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష నేత జగన్ ల మధ్య రాజకీయం ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-12-09 03:34 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష నేత జగన్ ల మధ్య రాజకీయం ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. ట్రెడిషనల్ పాలిటిక్స్ హద్దులు దాటి ఈ ఇద్దరి మధ్యన రాజకీయం ఒక భీకర సమరం గానే సాగుతుంది. ఈ ఇద్దరూ మీడియా ముఖంగానే మాట్లాడుకుంటారు. మీడియా కేంద్రంగానే విమర్శించుకుంటారు. కౌంటర్లు ప్రతి కౌంటర్లు అన్నీ మీడియా వేదికగానే జరుగుతుంటాయి.

బాబు యాక్షన్ కి జగన్ రియాక్షన్ ఇస్తే జగన్ చర్యలు బాబు నుంచి ప్రతి చర్య ఉంటుంది. ఇలా మాటల ద్వారా ఈ ఇద్దరూ తూటాలు పేల్చుకుంటారు. సెటైర్లు వేసుకుంటారు. కొన్ని సందర్భాలలో అయితే తీవ్రమైన ఆరోపణలు కూడా చేసుకుంటారు.

లేటెస్ట్ గా చంద్రబాబు మీద జగన్ సెటైర్లు పేల్చారు. అవి ఏంటి అంటే అలా బాబుని చూసిన తాను ఆశ్చర్యపోయాను అన్నారు. మరి బాబుని ఎలా చూసారు ఎందుకు జగన్ ఆశ్చర్యపోయారు అంటే ఆ కధా కమామీషు వేరు అని అంటున్నారు.

బాబులో ఎంతో నటనా కౌశలం ఉందని జగన్ అంటున్నారు. ప్రతీ స్కూల్ లో సహజంగానే జరిగే టీచర్ పేరెంట్స్ మీటింగ్స్ కి అదేదో పెద్ద ప్రోగ్రాం గా మార్చి చంద్రబాబు అక్కడ ప్రదర్శించిన నటనా కౌశలం చూసి ఆశ్చర్యపోయాను అని ఎక్స్ వేదికగా జగన్ సెటైర్లు వేశారు.

ఒక వైపు తల్లిదండ్రులకు తల్లికి వందనం పేరుతో కార్యక్రమం అమలు చేయకుండా సున్నం పెట్టిన బాబు పాఠశాలలకు వచ్చి మాత్రం చాలా హడావుడు చేశారని ఆయన విమర్శిస్తున్నారు. రొటీన్ గా జరిగే సమావేశాలను సైతం తన ప్రచార వేదికలుగా మార్చుకోవడంలో బాబుకు ప్రపంచంలోనే సాటి ఎవరూ లేరంటూ జగన్ ఆయనను పొగిడారా లేక విమర్శించారా అంటే ఆలోచించాల్సిందే మరి.

విద్యారంగం తమ హయాంలోనే బాగుందని నాడు నేడు కింద కొత్త గదులను నిర్మించామని ఆయన చెప్పారు. ఇపుడు వాటి పనులు అన్నీ ఆపేశారని పైపెచ్చు ఏదో చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని జగన్ చురకలు అంటించారు.

విద్యా రంగంలో తాము సంస్కరణలు తీసుకుని వస్తే చంద్రబాబు మాత్రం ఏమీ చేయకుండానే ఏదో చేసినట్లుగా చెప్పుకుంటున్నారని జగన్ ఫైర్ అవుతున్నారు. వైసీపీ హయాంలో తల్లుల ఖాతాలో ఏకంగా 26 వేల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం ఇచ్చిందని బాబు సర్కార్ మాత్రం ఈ రోజుకు పైసా కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

పాఠశాలలకు వెళ్ళి స్పీచులు ఇచ్చిన సీఎం బాబు డిప్యూటీ సీఎం పవన్ విద్యా శాఖ మంత్రి లోకేష్ తల్లికి వందనం కార్యక్రమం గురించి ఎందుకు మాట్లాడటం లేదని జగన్ నిలదీస్తున్నారు. తాము ఎంతో కష్టపడి తీసుకుని వచ్చిన సీబీఎస్ ఈ ఎఫిలియేషన్ ని రద్దు చేశారని, టొఫెల్ క్లాసులు ఫ్యూచర్ టెక్నాలజీ కోర్సులు ఇలా అన్నీ రద్దు చేశారని జగన్ అంటున్నారు.

మొత్తానికి చూస్తే కనుక బాబు నటన బాగుందని జగన్ కితాబు ఇస్తున్నారు. బాబుకు ప్రపంచలో సాటి ఎవరూ లేరని అంటున్నారు. బాబు గ్రేటెస్ట్ అంటున్నారు. మరి ఇవన్నీ ప్రశంసలేనా అంటే అది టీడీపీ వైసీపీలకే తెలుసు. అందుకే జగన్ కామెంట్స్ మీద టీడీపీ కామెంట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే.

1. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్‌ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్‌ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. వైయస్సార్‌సీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన…

— YS Jagan Mohan Reddy (@ysjagan) December 8, 2024
Tags:    
  • Jaganmohanreddy 
  • Ysrcp 
  • Tdp 
  • Chandrababunaidu 
  • Ndaalliance 
  • Pawankalyan 
  • Janasena 
  • Parentsmeeting 
  • Governmentschools 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS