• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దావోస్...ఆ ఇద్దరినీ...

దావోస్...ఆ ఇద్దరినీ ఆకట్టుకోలేదా ?

| అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలతో భేటీ అయి పెట్టుబడులను తమ రాష్ట్రానికి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తూంటారు.

By - Tupaki Desk
Update: 2025-01-02 22:30 GMT

దావోస్ అంటే భారత దేశంలోని ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు చాలా ఆసక్తిని చూపిస్తారు. ప్రతీ ఏటా దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫారం కి దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి కీలక మంత్రులు సీఎంలు వెళ్తారు. అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలతో భేటీ అయి పెట్టుబడులను తమ రాష్ట్రానికి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తూంటారు.

ఏపీలో చూస్తే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం దావోస్ కి తప్పనిసరిగా వెళ్ళి వచ్చేది. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని చెప్పేది. అందులో ఎన్ని వచ్చాయన్నది పక్కన పెడితే నాడు టీడీపీ ప్రభుత్వం ఈ విషయంలో చేసిన కృషిని అంతా మెచ్చుకునేవారు.

ఇక 2019 నుంచి 2024 వరకూ అయిదేళ్ల పాటు సీఎం గా పాలించిన వైఎస్ జగన్ అయితే దావోస్ కి ఒకే ఒకసారి వెళ్లారు. దానికి ముందూ తరువాత ఆయన వెళ్ళలేదు. వైసీపీ మంత్రులు అయితే దావోస్ కి వెళ్లకుండానే పెట్టుబడులు తెస్తున్నామని చెప్పేవారు. తమ ప్రభుత్వం పెట్టుబడులు పేరుతో ప్రచారం చేసుకోదని కూడా వారు అంటూండేవారు.

కట్ చేస్తే తెలంగాణాలో అదే సీన్ ఉంది. ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ కూడా ఏ నాడూ దావోస్ కి వెళ్లలేదు. ఆ మాటకు వస్తే ఆయన తన జీవితంలో విదేశాలకే వెళ్ళింది లేదు అని చెబుతారు. ఇక సీఎం హోదాలో ఆయన చైనా సింగపూర్ మాత్రమే తిరిగారు అని అంటారు.

అయితే కేసీఅర్ కి బదులుగా కేటీఅర్ క్రమం తప్పకుండా దావోస్ కి వెళ్ళేవారు. పెట్టుబడులలో ఇతర రాష్ట్రాలతో తెలంగాణా పోటీ పడుతోందని కూడా చెప్పేవారు. ఇక ఇపుడు చూస్తే రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. ఆయన గతంలో ఒకసారి దావోస్ కి వెళ్ళి వచ్చారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే రేవంత్ రెడ్డి విదేశీ టూర్ పెట్టుకుని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఇక ఇపుడు మరోమారు రేవంత్ రెడ్డి దావోస్ కి వెళ్తున్నారు. దాని కంటే ముందు అస్ట్రేలియా టూర్ కూడా చేస్తున్నారు. ఇలా సీఎం గా కేవలం ఏడాది కాలంలోనే అయిదారు దేశాలు రేవంత్ రెడ్డి చుట్టేశారు. ఆయన పెట్టుబడులు తెలంగాణాను తేవాలని పట్టుదలతో వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇక ఏపీలో చూస్తే నాలుగవ సారి సీఎం అయిన చంద్రబాబు దావోస్ కి ఈ తడవలో మొదటిసారి వెళ్తున్నారు. కుమారుడు లోకేష్ తో కలసి ఆయన దావోస్ టూర్ చేయడం ఈసారి ప్రత్యేకత. మొత్తానికి చూస్తే దావోస్ అంటే దేశంలో ఎందరు సీఎంలు దూరంగా ఉంటారో తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జగన్ కేసీఆర్ మాత్రం కాస్తా దూరంగానే ఉంటున్నారు. మరి అందరినీ ఆకట్టుకున్న దావోస్ వారిని ఆకట్టుకోలేదా అంటే జవాబు మాత్రం ఎవరి ఊహకు వారే వెతుక్కోవాల్సిందే.

Tags:    
  • Telugupolitics 
  • Telanganacm 
  • Revanthreddy 
  • Kcr 
  • Davos 
  • Apcm 
  • Chandrababu 
  • Jaganmohanreddy 
  • Tdpleaders 
  • Ycpleaders 
  • Investments 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS