అది చంద్రబాబుకే సాధ్యం..జగన్ సెటైర్లు

ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు కూటమి నేతలపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-01-28 14:16 GMT

ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు కూటమి నేతలపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ అని, సూపర్ సెవెన్ అని ప్రజలకు చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పారని, మోసం చేశారని ఆరోపించారు. అన్ని అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసిన వారిని 420 కేసు పెట్టి లోపల వేస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ, చంద్రబాబు, కూటమి నేతలే కేసులు లేకుండా బయట ఉండగలుగుతున్నారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒక్క మంచి కూడా జరగలేదని విమర్శించారు. పార్టీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా వైసీపీ ప్రభుత్వం భావించిందని గుర్తు చేశారు. రెండేళ్లలో చంద్రబాబు రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారని జగన్ ఆరోపించారు. ఆ డబ్బంతా ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. మద్యం వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతోందని, ఆ ఆదాయమంతా చంద్రబాబు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోందని విమర్శించారు.

మద్యం షాపులన్నీ చంద్రబాబు మనుషులవేనని ఆరోపించారు. ఇక, బెల్టు షాపులు కూడా చంద్రబాబు మనుషులవేనని, ఎమ్మార్పీ ధరలకు మద్యం అమ్మడం లేదని ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దైపోయాయని అన్నారు. చంద్రబాబులా ప్రజలను మోసం చేయడం ఇంకెవ్వరికీ సాధ్యం కాదని జగన్ సెటైర్లు వేశారు. తాడేపల్లి ఆఫీసులో భీమవరం నియోజకవర్గ వైసీపీ నేతలతో సమావేశం సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News