• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇరాన్ ప్రెసిడెంట్ కి...

ఇరాన్ ప్రెసిడెంట్ కి మోడీ ఫోన్... ఖోర్రామ్ షహార్-4 ప్రయోగించిన టెహ్రాన్!

| అవును... ఇరాన్‌ లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిన విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-06-22 17:48 GMT

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్న వేళ.. శనివారం అత్యంత కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇరాన్ లోని అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. దీంతో.. పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా మరింత ఉదృతంగా మారిపోయాయి! ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రెసిడెంట్ కు మోడీ ఫోన్ చేశారు.

అవును... ఇరాన్‌ లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిన విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌ తో మాట్లాడారు. ఈ సందర్భంగా... పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని 'ఎక్స్' లో వెల్లడించిన మోడీ... ప్రస్తుత పరిస్థితి గురించి ఇరాన్ ప్రెసిడెంట్ తో వివరంగా చర్చించినట్లు తెలిపారు. ఇటీవలి ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసామని.. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం ముఖ్యమని చెబుతూ దౌత్యం కోసం పిలుపును పునరుద్ఘాటించామని అన్నారు.

ఇదే సమయంలో.. ఇరాన్ పై అమెరికా దాడులతో పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారుతున్న వేళ పలు దేశాల నుంచి ఇరాన్ కు కాల్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఇరాన్‌ లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత, సంక్షోభానికి చర్చల ద్వారా పరిష్కారం చూపాలని అన్ని పక్షాలను కోరుతున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ తెలిపారు.

ఇదే సమయంలో... జర్మనీ ప్రతిపక్ష నాయకుడు ఫ్రెడరిక్ మెర్జ్ స్పందిస్తూ... ఇరాన్‌ ను అమెరికా, ఇజ్రాయెల్‌ తో అత్యవసరంగా దౌత్య చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో... మరింత సైనిక ఘర్షణపై శాంతియుత పరిష్కారం, చర్చల కోసం బెర్లిన్ ఒత్తిడి చేస్తోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

మరోవైపు... అమెరికా దాడుల అనంతరం ఇరాన్ మరింత ఘాటుగా రియాక్ట్ అవుతుంది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ పై ప్రతీకార క్షిపణి కాల్పులు మునుపటి కంటే భారీగా కనిపించాయని అంటున్నారు. ఈ తాజా దాడుల్లో 86 మంది గాయపడ్డారని టెల్ అవీవ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ క్రమంలో... అమెరికా దాడి అనంతరం ఇజ్రాయెల్ పై ఇరాన్ కనీసం 40 క్షిపణులను ప్రయోగించిందని.. వాటిలో ఖోర్రామ్ షహార్ - 4 ఒకటని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐ.ఆర్.జీ.సీ.) వెల్లడించింది. ఈ క్షిపణి 2,000 కి.మీ పరిధి, 1500 కిలోల వార్ హెడ్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు.

Spoke with President of Iran @drpezeshkian. We discussed in detail about the current situation. Expressed deep concern at the recent escalations. Reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early restoration of regional…

— Narendra Modi (@narendramodi) June 22, 2025
Tags:    
  • IranUSConflict 
  • ModiDiplomacy 
  • MiddleEastTensions 
  • Iranisraelwar 
  • USAirstrike 
  • IranMissileStrike 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS