• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హైదరాబాద్ లో...

హైదరాబాద్ లో ఉంటున్నారా?... ఈ అప్ డేట్ తెలుసుకోవాల్సిందే!

| హైదరాబాద్ లో జనాభా రోజు రోజుకీ ఏ స్థాయిలో పెరిగిపోతున్నారనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ తన పరిధిని మరింత విస్తరించుకుంటుంది.

By - Tupaki Desk
Update: 2024-08-20 07:07 GMT

హైదరాబాద్ లో జనాభా రోజు రోజుకీ ఏ స్థాయిలో పెరిగిపోతున్నారనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ తన పరిధిని మరింత విస్తరించుకుంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఇంటి అడ్రస్ పట్టుకోవడం తలకుమించిన భారం అవుతుంది. మ్యాప్ లేకుండా హైదరాబాద్ లో తెలియని ఓ ఇంటిని చేరుకోవడం ఆల్ మోస్ట్ అసాధ్యం అనేవారూ లేకపోలేదు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతీ ఇంటికీ నెంబర్ ఉన్నా.. అది వెతికి పట్టుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని సార్లు పూటలు మారిపోవచ్చు. ఈ నేపథ్యంలో... గ్రేటర్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనకు అధికారులు మరో ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా... ప్రతీ ఇంటికీ ఓ యూనిక్ ఐడీ నెంబర్ ను కేటాయించనున్నారు. దీని ద్వారా క్యూర్ కోడ్ లాంటి ఓ బోర్డును ఏర్పాటు చేస్తారు.

అవును... జీ.హెచ్.ఎం.సీ పరిధిలో ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనలో భాగంగా అధికారులు మరో ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఇంటికీ క్యూఆర్ కోడ్ లాంటి ఓ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. దీనికి అవసరమైన జియోగ్రాఫిక్ ఇన్ ఫర్మేషన్ సిస్టం సర్వేను అధికారులు ఇప్పటికే ప్రారంభించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆ కోడ్ ను స్కాన్ చేస్తే ఇంటికి సంబంధించిన వివరాలతో పాటు ఎగ్జాట్ లొకేషన్ కూడా వస్తుంది.

వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటి అడ్రస్ తెలుసుకోవడం అంత సులువైన పనికాదు. 10 మీటర్ల దూరంలోనే ఉంటూ అక్కడక్కడే తిరుగుతారు కానీ.. అసలు లొకేషన్ ను చేరుకోలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికలపై ఇప్పుడు లొకేషన్ క్యూఆర్ కోడ్ ను ముద్రించడం కామన్ అయిపోయింది. అయితే అది అందరికీ సాధ్యం కాకపొవచ్చు కూడ్దా. ఈ నేపథ్యంలో ప్రతీ ఇంటికీ ఓ క్యూఆర్ కోడ్ ను ఇవ్వాలనే జీ.హెచ్.ఎం.సీ ఆలోచన త్వరలో పూర్తవనుందని అంటున్నారు.

ఈ జియోగ్రాఫిక్ ఇన్ ఫర్మేషన్ సిస్టం సర్వేని హైదరాబాద్ శాటిలైట్, గ్రౌండ్ ఫిజికల్ విధానంలో నిర్వస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్, హయత్ నగర్ వంటి ఐదు సర్కిల్స్ లో ప్రయోగాత్మకంగా సర్వే ప్రారంభించారు. త్వరలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ పని మొదలై, పూర్తై ప్రతీ ఇంటికీ క్యూ ఆర్ కోడ్ రానుందని చెబుతున్నారు.

Tags:    
  • GHMC 
  • Hyderabadresidents 
  • Qrcodescanner 
  • Locationqrscanner 
  • Telangana 
  • Congressgovernment 
  • QRCode 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS