• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చెంబు పేరు చెప్పి...

చెంబు పేరు చెప్పి కోటిన్నర కొట్టేశారు.. మోసపోయిన డాక్టరమ్మ!

| మోసాలు పలు రకాలనే సంగతి తెలిసిందే. మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లకు ఈ రోజుల్లో ఏ కొదవా లేదు.

By - Raja Ch
Update: 2025-10-27 08:08 GMT

మోసాలు పలు రకాలనే సంగతి తెలిసిందే. మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లకు ఈ రోజుల్లో ఏ కొదవా లేదు. ఇక ప్రస్తుతం కాలంలో సైబర్ నేరాలు పెట్రేగి పోతున్న నేపథ్యంలో.. అప్పుడప్పుడూ వినిపించినా బిగ్ నెంబర్స్ తో వినిపించే రైస్ పుల్లింగ్ గురించి చాలా మందికి ఓ అవగాహన ఉండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆ పేరు చెప్పి కొందరు కేటుగాళ్లు ఓ లేడీ డాక్టర్ ను బురిడీ కొట్టించారు అనే వార్త వైరల్ గా మారింది.

అవును... మాయా ప్రపంచంలో అప్పుడప్పుడూ వినిపించే పేర్లలో రైస్ పుల్లింగ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో చాలామంది అత్యాసలకు లోనయ్యో, అమాయకంగా నమ్మో ఏకంగా రూ.కోట్లలో నష్టపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా అలాంటి ఘటన మరొకటి జరిగింది. మహిమ గల చెంబు ఉందని చెప్పి హైదరాబాద్‌ కు చెందిన లేడీ డాక్టర్‌ ను బురిడీ కొట్టించింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో ముగ్గురు అరెస్ట్ అయ్యారు.

వివరాళ్లోకి వెళ్తే... అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయకు చెందిన కొర్రా బంగార్రాజు, కర్నాటి ప్రసాద్‌, పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్‌ లతో కూడిన ఓ ఓ గ్యాంగ్‌ ఇటీవల హైదరాబాద్‌ కు చెందిన ఓ లేడీ డాక్టర్‌ ను కలిశారు. ఆమెతో.. మహిమ గల చెంబు తమ దగ్గర ఉందంటూ మాయ మాటలు చెప్పారు. ఆ చెంబు ఖరీదు రూ.30 కోట్లు అని నమ్మబలికారు. కారణం ఏదైనా.. ఈ విషయాన్ని ఆమె కూడా నమ్మారు.

దీంతో ఈ ముగ్గురు డాక్టర్ దగ్గర నుంచి విడతలవారీగా రూ.కోటిన్నర వరకు వసూలు చేశారట. కట్ చేస్తే.. డబ్బులు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత ఈ ముగ్గురు సదరు డాక్టర్‌ కు అందుబాటులో లేకుండాపోయారట. ఈ క్రమంలో ఒకటి కాదు రెండు కాదు సుమారు ఆరు నెలలు గడిచిపోయింది. అయినప్పటికీ ఈ ముగ్గురు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ డబ్బులూ తిరిగి ఇవ్వలేదు.

అప్పటికి గానీ తాను మోసమోపాయనే విషయం సదరు మహిళా డాక్టర్ కు తెలియలేదు. దీంతో... ఈనెల 19న ఆరిలోవ పోలీసుల్ని ఆమె ఆశ్రయించారు. దీంతో... ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ చెంబు వ్యవహారంలో ఆరిలోవ హెల్త్‌ సిటీలోని ఓ హోటల్, శ్రీకాంత్‌ నగర్‌ లోని ఓ హోటల్‌ లో లావాదేవీలు జరిగాయని పోలీసులకు ఆధారాలను అందజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఈ నేపథ్యంలో.. ఈ నెల 23న ఆరిలోవ దగ్గర ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం విమ్స్‌ మెయిన్ గేటు దగ్గర మరొకర్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా నిందితుల దగ్గర నుంచి సుమారు రెండున్నర లక్షల రూపాయలతో పాటుగా మొబైల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

Tags:    
  • RicePullingScam 
  • CyberFraud 
  • LadyDoctorScam 
  • FraudAlert 
  • PoliceArrest 
  • ScamExposed 
  • FinancialFraud 

Similar News

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

Copyright @2026

Powered by Blink CMS