• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హంటా వైరస్ కలకలం: ముప్పు...

హంటా వైరస్ కలకలం: ముప్పు పెద్ద‌దేమీ కాక‌పోయినా జాగ్ర‌త్త ముఖ్యం!

| ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మ‌ర్చిపోక ముందే మరో వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.

By - Sivaji Kontham
Update: 2026-05-08 07:01 GMT

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మ‌ర్చిపోక ముందే మరో వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అర్జెంటీనా నుండి బయలుదేరిన `ఎంవి హోండియస్` అనే డచ్ క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ (ఆండీస్ రకం) వెలుగుచూడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నౌకలో 23 దేశాలకు చెందిన ప్రయాణికులు ఉండగా.. అప్పటికే వైరస్ బారిన పడిన పది మందిలో ముగ్గురు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ మరణాల రేటు ప్రతి ముగ్గురిలో ఒకరికి అన్నట్లుగా ఉండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఈ షిప్‌లో ఇద్ద‌రు భారతీయ నావికులు ఉన్నారనే వార్త భారత్‌లో కలకలం రేపుతోంది. వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం బయటకు రాకపోవడం ఆందోళనను మరింత పెంచుతోంది. ఒకవేళ ఈ నౌక తీరానికి చేరిన తర్వాత ఆ 23 దేశాలకు చెందిన ప్రయాణికులు తమ స్వదేశాలకు విస్తరిస్తే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చ‌ర్చ సాగుతోంది. సాధారణంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకే ఈ హంటావైరస్..మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు సోక‌దు అనే వార్త కొంతవ‌ర‌కూ ఊర‌ట‌. అయితే మన దేశం గతంలో నిఫా వంటి వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్న అనుభవం ఉండటం మ‌రింత‌ ఊరటనిచ్చే అంశం.

వైరస్ మూలాలను పరిశీలిస్తే.. అర్జెంటీనా, ఉరుగ్వే, చిలీ వంటి దేశాలలో పక్షులపై అధ్యయనం చేయడానికి వెళ్లిన యాత్రికులకు మొదట ఈ వైరస్ సోకినట్లు సమాచారం. ఈ `ఆండీస్ వైరస్` రకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం ఎలుకల నుంచి మాత్ర‌మే వ్యాపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ వైరస్ పొదిగే కాలం ఆరు వారాల వరకు ఉండటం వల్ల.. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం ఈ షిప్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా స్పెయిన్ వైపు ప్రయాణిస్తోంది. వైద్య‌ నిపుణులు ఇప్పటికే రంగంలోకి దిగి నౌకలోనే ఐసోలేషన్, శానిటైజేషన్ వంటి చర్యలు చేపట్టారు. అయితే అంతర్జాతీయ పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇలాంటి ముప్పులను అరికట్టడానికి అంతర్జాతీయ ఆరోగ్య నియమాలలో (ఐహెచ్ఆర్) సమూల మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. విమానాశ్రయాల్లో కేవలం ప్రాథమిక తనిఖీలే కాకుండా... వైరస్ పొదిగే కాలం ముగిసే వరకు ప్రయాణికులను డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించే నిబంధనలు తీసుకురావాల‌నే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

పర్యాటక రంగాన్ని కాపాడుకుంటూనే ప్రజారోగ్య భద్రతను నిర్ధారించడానికి దేశాల మధ్య పారదర్శకమైన సమాచార మార్పిడి అత్యవసరం. ఏవైనా అసాధారణ అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు పర్యాటక సంస్థలు వెంటనే నివేదించేలా కఠిన చట్టాలు ఉండాలి. అలాగే వైరస్‌లకు రాజకీయాలు తెలియవు కాబట్టి అత్యవసర సమయాల్లో దేశాల మధ్య ఐక్యత మాత్రమే బలమైన ఆయుధంగా మారుతుంది. సాంకేతికతను వాడుకుంటూ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి వైరస్ కల్లోలాల నుండి ప్రపంచాన్ని కాపాడుకోగలం.

ఈ ల‌క్ష‌ణాలు చెక్ చేసుకోండి:

వైర‌స్ ల‌క్ష‌ణాలు ప‌రిశీలిస్తే.. క‌రోనా త‌ర‌హాలోనే జ్వ‌రం ద‌గ్గు అల‌స‌ట, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పి ల‌క్ష‌ణాలు రోగిలో క‌నిపిస్తాయి. ఊపిరి తిత్తుల్లో నీరు చేరుతుంది. ఈ కేసులు పెర‌గ‌క ముందే ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ముఖ్యం. ముఖ్యంగా ఎలుక‌లు, కీచురాళ్లు, ప‌క్షులు, ఇత‌ర కీట‌కాల నుంచి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం అవ‌స‌రం. వైర‌స్ మ‌నుషుల నుంచి వ్యాపించ‌దు. కానీ హంటా వైర‌స్ సోకితే ప్ర‌తి ప‌ది మందిలో ముగ్గురు చ‌నిపోతార‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి వైర‌స్ అదుపులో ఉంది. ప్ర‌భుత్వాలు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. దీనికి సంబంధించి ప్యానిక్ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు.

ఓడ ప్రయాణికులు- సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల మలం, మూత్రం లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఓడలు, కార్గో వెసెల్స్ వంటి ప్రదేశాలలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రారంభంలో జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి , అలసట వంటి లక్షణాలు కనిపించినా సరైన సమయంలో చికిత్స అందకపోతే ఇది `హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్` (HPS) కు దారితీసి ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది వంటి ప్రాణాపాయ స్థితికి చేరుస్తుంది. ముఖ్యంగా ఓడల్లోని గిడ్డంగులు, కార్గో హోల్డ్స్, దీర్ఘకాలం మూసి ఉంచిన ప్రదేశాలను శుభ్రం చేసేటప్పుడు లేదా ఎలుకల వ్యర్థాలు ఉన్న చోట పొడి ఊడ్పులు చేపట్టినప్పుడు వైరస్ గాలిలో కలిసి సోకే ప్రమాదం ఉంది. అందుకే షిప్ క్రూ మెంబర్స్ క్లీనింగ్ సమయంలో తగిన రక్షణ కోసం గ్లోవ్స్ వంటివి ధరించడం.. నిరంతరం పరిసరాలను శానిటైజ్ చేయడం.. ఎలుకల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

Tags:    
  • hantavirus 
  • who 
  • globalhealth 
  • cruiseshipoutbreak 
  • mvhondius 
  • publichealth 
  • viralalert 
  • infectiousdisease 

Similar News

ఎమ్మెల్యే విందు.. గాల్లో ఎగిరిన ప్లేట్లు.. కరెంట్ టవర్లపై వేలాడిన మనుషులు..

2026-11-26 10:20 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

ఫిట్‌గా ఉంటేనే లిక్కర్.. వైన్ షాపు ముందు మెడికల్ క్యాంప్.. మందుబాబులకు ఊహించని షాక్

2026-11-26 10:17 GMT

యూపీలో ఇండి కూటమికి అసలు పరీక్ష: 130 సీట్లపై కాంగ్రెస్ పట్టు.. గెలుపు గుర్రాలకే టికెట్లంటున్న అఖిలేశ్!

2026-11-26 10:14 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

జగన్ దూరం.. విజయమ్మ ఆశీస్సులతో ముగిసిన అంజలీ రెడ్డి వివాహం!

2026-11-26 09:00 GMT

చిన్నారులకు కడుపునొప్పి వస్తే వాతలా? ప్రాణాలకే ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు!

2026-11-26 08:58 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ

2026-11-26 08:51 GMT

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

2026-11-26 08:44 GMT

Copyright @2026

Powered by Blink CMS