పెద్ద రీఫండ్ వదిలేస్తే... గ్రీన్‌కార్డ్ పోతుందా?

అమెరికాలో వలసదారుల మధ్య ఒక ప్రమాదకరమైన ధోరణి వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా H-1B మరియు OPT వీసా ఉన్నవారికి ఇది తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది.;

Update: 2025-06-07 05:34 GMT

అమెరికాలో వలసదారుల మధ్య ఒక ప్రమాదకరమైన ధోరణి వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా H-1B మరియు OPT వీసా ఉన్నవారికి ఇది తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. తప్పుడు పన్ను దాఖలాలు వల్ల వారి గ్రీన్ కార్డు లే రద్దవుతున్నాయి. "ఇప్పుడు పెద్ద రీఫండ్ – తర్వాత గ్రీన్‌కార్డ్ డినయల్!" అనే హెచ్చరికతో వలస నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఏమి జరుగుతోంది?

అనధికారిక, లైసెన్స్ లేని టాక్స్ ప్రిపేర్‌ర్స్ (పన్ను దాఖలుదారులు) ఎక్కువ రీఫండ్‌లు వస్తాయంటూ యువతను ప్రలోభ పెడుతున్నారు. "పెద్ద రీఫండ్", "వేగవంతమైన ప్రాసెసింగ్", "లీగల్ ట్రిక్స్"తో పన్ను తగ్గింపు వంటి వాగ్దానాలతో వీరు ఆకర్షిస్తున్నారు. అయితే, ఈ వాగ్దానాలు అన్నీ తప్పుడు దారులు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి తప్పుడు క్లెయిమ్స్ చేస్తున్నారు?

ఈ అక్రమ ఏజెంట్లు ఎక్కువగా అమెరికా బయట జరిగే ఖర్చులను చూపించి పన్ను రీఫండ్‌ను పెంచుతున్నారు.

వాటిలో కొన్ని:

* ఇండియాలో హోం రిపేర్ ఖర్చులు

* కుటుంబ వైద్య బిల్లులు

* విదేశాల్లో ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు

* అద్దె నష్టాలు, ఫేక్ కరెన్సీ లాస్

* తప్పుడు 1099 ఫార్మ్‌లు

పర్యవసానాలు:

USCIS ఇప్పుడు కేవలం ఆదాయాన్ని మాత్రమే కాకుండా, పన్ను రిటర్న్స్‌లో చూపించిన ఖర్చులనూ నిశితంగా పరిశీలిస్తోంది. ఉదాహరణకు, ఒక అభ్యర్థి $20,000 పన్ను చెల్లించి, $25,000 పైగా ఖర్చులు చూపించినందున వారి గ్రీన్ కార్డ్ తిరస్కరించబడింది.

ఈ తప్పుడు పన్ను దాఖలాలు I-485 Green Card ప్రాసెసింగ్, H-1B పొడిగింపులు, OPT నుండి H-1Bకి మారే సమయంలో, విదేశీ వీసా ఇంటర్వ్యూలలో తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తాయి.

జాగ్రత్తలు:

* USCIS మరియు IRS డేటాను పంచుకుంటాయి.

* Green Card కోసం పూర్తి బ్యాక్‌గ్రౌండ్ , ఆర్థిక స్థితి చెక్ జరుగుతుంది.

* తెలియక చేసిన తప్పులు కూడా వీసా రద్దు, Green Card నిరాకరణ, ఫ్రాడ్ కేసులు, భవిష్యత్తులో అమెరికా ప్రవేశానికి నిషేధం కలిగించవచ్చు.

మీ భవిష్యత్తు కోసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

* లైసెన్స్ ఉన్న CPA (Certified Public Accountant) లేదా టాక్స్ అటార్నీతో మాత్రమే మీ పన్ను రిటర్న్ ఫైల్ చేయండి.

* WhatsApp గ్రూపులు లేదా అక్రమ ఏజెంట్ల "బిగ్ రీఫండ్" వాగ్దానాలను నమ్మవద్దు.

* మీ పన్ను రిటర్న్‌ను స్వయంగా పరిశీలించండి – మీరు దాఖలు చేసిన దానికి మీరే బాధ్యులు.

చిన్న రీఫండ్ సరే కానీ, మీ Green Card భద్రంగా ఉండడమే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News