• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గుంటూరులో జీబీఎస్...

గుంటూరులో జీబీఎస్ టెన్షన్.. ఆస్పత్రిలో ఏడుగురు రోగులు?

| ఈ వ్యాధితో శ్రీకాకుళం జిల్లాలో ఓ బాలుడు మరణించగా, తాజాగా గుంటూరులోనూ కొత్త కేసులు నమోదయ్యాయి.

By - Tupaki Desk
Update: 2025-02-14 07:20 GMT

ఏపీలో జీబీఎస్ (గులియన్ బారే సిండ్రోమ్) కేసులు టెన్షన్ పెడుతున్నాయి. ఈ వ్యాధితో శ్రీకాకుళం జిల్లాలో ఓ బాలుడు మరణించగా, తాజాగా గుంటూరులోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం ఏడుగురు రోగులు జీబీఎస్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఏపీలో టెన్షన్ ఎక్కువవుతోంది. ఒకవైపు బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రమవుతుండగా, మరోవైపు జీబీఎస్ కేసులు వెలుగు చూడటంతో ప్రజలు ఆందోళన చెబుతున్నారు.

కరోనా మహమ్మారి పీడకలలా వెండాతుండగా, కొత్త వైరస్ జీబీఎస్ కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలోని పుణేలో 172 మందికి జీబీఎస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే ఏపీలో ఆ వ్యాధి లక్షణాలు లేవని ప్రజలు ఊపిరిపీల్చుకునేంత లోగానే పంజా విసురుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో జీబీఎస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఏడుగురు బాధితులు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ఒకరిని వెంటిలేటర్ పై, మరొకరని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. మిగిలిన ఐదుగురు సాధారణ వార్డులో వైద్యం పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా జీబీఎస్ కేసులు కలకలం పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వ్యాధి లక్షణాలతో దేశంలో ఏడుగురు మరణించారు. ఇందులో మన రాష్ట్రంలోనే ఒక మరణం సంభవించింది. శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల చిన్నారి జీబీఎస్ లక్షణాలతో ప్రాణాలు కోల్పోవడం ఆందోళకరంగా మారింది. మరోవైపు తెలంగాణలోనూ ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. అయితే జీబీఎస్ తో పెద్దగా ఇబ్బంది లేదని, వ్యాధి లక్షణాలపై ఎవరూ భయపడొద్దని వైద్యులు భరోసా ఇస్తున్నారు. కాళ్లు, చేతులు చచ్చుబడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణి యశస్వి సూచించారు. జీబీఎస్ వైరస్ కి వైద్యం అందుబాటులో ఉందని, రోగులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆమె ధైర్యం చెప్పారు.

Tags:    
  • GBS 
  • GuillainBarreSyndrome 
  • APHealthAlert 
  • Guntur 
  • Telangana 
  • BirdFlu 
  • HealthConcerns 
  • GBSCases 
  • GBSOutbreak 
  • GBSSymptoms 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS