ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం వెనక్కి... ఏమైంది?

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-13 05:22 GMT

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు, మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉన్న 24 మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు! ఈ సమయంలో మరో ఎయిరిండియా విమానం లండన్ వెళ్తూ వెనక్కి తిరిగొచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.

అవును... లండన్ వెళ్లాల్సిన ఓ ఎయిరిండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి మళ్లిన ఘటన తాజాగా జరిగింది. ‘ఫ్లయిట్ రాడార్ 24’ డేటా ప్రకారం.. ముంబై విమానాశ్రయం నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఎయిరిండియా విమానం (ఏఐసీ129) లండన్ కు బయలుదేరింది. ఈ క్రమంలో సుమారు మూడు గంటల పాటు గాల్లో ఉన్న ఈ విమానం తిరిగి ముంబైకి చేరుకుంది.

ఇలా సుమారు మూడు గంటల పాటు ప్రయాణించిన తర్వాత విమానాన్ని వెనక్కి మళ్లించడానికి గల కారణాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే... సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం.. ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం అని పలువురు భావిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల పలు చోట్ల గగనతలాలపై ఆంక్షలు విధించారు. పలు విమానాలను దారి మల్లించారు.

ఈ సందర్భంగా స్పందించిన విమానయాన సంస్థ... ఇరాన్ గగనతలం మూసివేతతో ఎయిరిండియాకు చెందిన 16 విమానాలకు అంతరాయం కలిగినట్లు వెళ్లడించింది. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన ఎయిర్ లైన్స్... తాజా వివరాలను ప్రయాణికులు ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని సూచించింది.

కాగా... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేసింది. దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్ట్ లలోనూ విమానాల రాకపోకలు నిలిపివేసింది. అటు రాజధాని టెహ్రాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించింది. దీంతో.. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పలు విమాన సర్వీసులకు ఆటంకం కలిగించింది.

Tags:    

Similar News