• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మొదటి రోజే సెంచరీ......

మొదటి రోజే సెంచరీ... డొనాల్డ్ ట్రంప్ భారీ ప్లాన్ ఇదే!

| గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-01-12 22:30 GMT

గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కోసం అమెరికాతో పాటు.. ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు ఆందోళనతోనూ ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

అవును... మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే పెను మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఆయన కార్యవర్గం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో... ఈ విషయం సంచలనంగా మారింది.

దీంతో.. డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చే ఆ ఆర్డర్లు ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో... ట్రంప్ తీసుకొచ్చే 100 ఆర్డర్లలో చాలా వరకూ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన ఆదేశాల్లో చాలా వాటిని వెనక్కి తీసుకొచ్చేందుకే ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు! ఇదే సమయంలో... ప్రధానంగా సరిహద్దుల భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

వాస్తవానికి సరిహద్దులపై తీసుకునే నిర్ణయాలను ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ ఇప్పటికే సెనెటర్లకు చెప్పినట్లు చెబుతున్నారు. ఇటీవల క్యాపిటల్ హిల్ లో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో వీటికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల గురించి తన పార్టీ సెనెటర్లకు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారనే ప్రచారం జరుగుతుంది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు.

ఈ 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ప్రధానంగా ఫెడరల్ షెడ్యూల్ ఎఫ్ లో ఉద్యోగుల నిబంధనలు మార్చడం.. టీకాలపై నిర్ణయం, స్కూలు జెండర్ పాలసీలతో పాటు ప్రధానంగా అమెరికా-మెక్సికో సరిహద్దును కట్టడి చేయడం ఉండొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ సహచరులు వీటిని తయారు చేసే పనిలో ఇప్పటికే నిమగ్నమైనట్లు చెబుతున్నారు.

వాస్తవానికి వైట్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత కొత్త అధ్యక్షుడు పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం సహజమే. అయితే... డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వీటిని జారీ చేయనుంది.

Tags:    
  • Donaldtrump 
  • Usapresident 
  • Republicanparty 
  • USA 
  • Executiveorders 
  • Joebiden 
  • Unitedstates 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS