ఆ 6 గ్రామాలకు దీపావళి ఇవాళ కాదంతే

ఎప్పటిలానే.. ఇటీవల కాలంలో పండుగలకు సంబంధించిన కన్ఫ్యూజ్ పెరుగుతోంది.

Update: 2023-11-12 05:07 GMT

ఎప్పటిలానే.. ఇటీవల కాలంలో పండుగలకు సంబంధించిన కన్ఫ్యూజ్ పెరుగుతోంది. ప్రతి పండక్కి రెండు రోజులుగా డిసైడ్ చేయటం.. పండుగను చేసుకోవటంలో ఎవరి దారి వారిది.. ఎవరి నమ్మకం వారిది అన్నట్లుగా తయారు కావటం తెలిసిందే. దీపావళి పర్వదినాన్ని ఇవాళ పలువురు జరుపుకుంటుంటే.. కొందరు మాత్రం సోమవారం జరుపుకుంటున్నారు. అత్యధికులు ఆదివారమే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. కర్ణాటకకు చెందిన ఆరు గ్రామాలు మాత్రం దీపావళిని వాయిదా వేసుకుంటున్నాయి. రానున్న బుధవారం దీపావళి పండుగను జరుపుకోవటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకిలా? కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చామరాజనగర్ లోని గుండ్ల పేట్ తాలుకాలో ఉన్న ఆరు గ్రామాల వారు మాత్రం ఈరోజు దీపావళికి ససేమిరా అంటున్నారు.

దీనికి వారి నమ్మకమే ప్రధాన కారణం. వీళ్లు దీపావళి జరుపుకోవాలంటే బలి పాడ్యమి.. బుధవారం రెండూ ఒకే రోజు రావాల్సి ఉంటుంది. ఒకవేళ అలా రాకుంటే మాత్రం.. పాడ్యమి తర్వాత వచ్చే బుధవారాన్ని పండుగగా జరుపుకుంటారు. తాజాగా చూస్తే.. పాడ్యమి మంగళవారం కావటంతో.. ఈ ఆరు గ్రామాలకు చెందిన వారు బుధవారం పండుగను చేసుకోనున్నారు. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు. ఇంతకీ ఆ ఆరు గ్రామాలు ఏవంటే..

- వీరనాపుర్

- బన్నితలపుర్

- ఇంగల్వాడి

- మాద్రహళ్లి

- మళవళ్లి

- నెనెకట్టే

Tags:    

Similar News